Asianet News TeluguAsianet News Telugu

అరుణాచల్ ప్రదేశ్ లో ఆర్మీ హెలికాప్టర్ క్రాష్.. ఇద్దరి మృతదేహాలు వెలికితీత..

అరుణాచల్ ప్రదేశ్ హెలికాప్టర్ ప్రమాద స్థలం నుంచి రెండు మృతదేహాలను రెస్క్యూ టీం వెలికి తీసింది. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలానికి వెళ్లేందుకు రోడ్డు మార్గం లేకపోవడంతో రెస్క్యూ ఆపరేషన్ నెమ్మదిగా సాగుతోంది.

Army helicopter crash in Arunachal Pradesh.. Two dead bodies recovered..
Author
First Published Oct 21, 2022, 5:28 PM IST

అరుణాచల్ ప్రదేశ్ పర్వత ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఆర్మీ అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ (ఏఎల్‌హెచ్) కూలిపోయింది. అయితే ఈ ప్రమాద స్థలం నుంచి ఇద్దరి మృతదేహాలను రెస్క్యూ టీం సభ్యులు వెలికి తీశారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో హెలికాప్టర్ లో ఐదుగురు వ్యక్తులు ఉన్నారు.

సెప్టిక్ ట్యాంక్‌ను శుభ్రం చేస్తుండగా ఊపిరాడక ముగ్గురు పారిశుధ్య కార్మికులు మృతి

ఇప్పటికీ రెస్క్యూ టీం సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎగువ సియాంగ్ జిల్లాలోని ట్యూటింగ్ ప్రధాన కార్యాలయానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న మిగ్గింగ్ వద్ద ఉదయం 10:43 గంటలకు ఈ సంఘటన జరిగిందని రక్షణ వర్గాలు తెలిపాయి. 

ఈ ఘటనకు సంబంధించి ఓ వీడియో బయటకు వచ్చింది. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో పర్వత ప్రాంతం నుంచి పొగలు పైకి లేవడం కనిపిస్తోంది. ఈ క్రాష్ పై జుమ్మర్ బసర్ పోలీసు సూపరింటెండెంట్ అప్పర్ సియాంగ్ ఫోన్ వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’తో మాట్లాడారు. ‘‘ప్రమాదం జరిగిన ప్రదేశం రహదారికి కనెక్ట్ అయి లేదని అన్నారు. అక్కడికి రెస్క్యూ టీమ్‌ను తరలించామని చెప్పారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.

పోలీసు కస్టడీలో ఆర్మీ జవాను, ఆయన సోదరుడికి దారుణమైన టార్చర్, వేలు విరిచి తీవ్రంగా దాడి

ఈ ప్రమాదంపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు ట్విట్టర్ లో తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘అరుణాచల్ ప్రదేశ్‌లోని ఎగువ సియాంగ్ జిల్లాలో ఇండియన్ ఆర్మీ అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ క్రాష్ విషయంలో చాలా కలతపెట్టే వార్తలు అందాయి. నా ప్రగాఢ ప్రార్థనలు’’ అని ఆయన ట్వీట్ చేశారు.

కాగా.. అక్టోబర్‌ 5వ తేదీన అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌ ప్రాంతంలో చీతా హెలికాప్టర్‌ కూలిన ఘటనలో భారత ఆర్మీ పైలట్‌ ప్రాణాలు కోల్పోయాడు. తవాంగ్‌లోని ఫార్వర్డ్ ఏరియాల వెంట రొటీన్ మిషన్‌లో  హెలికాప్టర్ ప్ర‌యాణిస్తున్న స‌మ‌యంలో ఉదయం 10 గంటలకు ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఆ స‌మ‌యంలో హెలికాప్ట‌ర్ లో ఇద్ద‌రు పైలెట్ లు ఉన్నారు.  ప్ర‌మాద స‌మాచారం తెల‌సుకున్న వెంట‌నే అధికారులు అక్క‌డికి చేరుకున్నారు. పైలట్‌లను సమీపంలోని మిలిటరీ ఆసుపత్రికి తరలించారు. అందులో ఒక పైలెట్ చికిత్స పొందుతూ ప‌రిస్థితి విష‌మించి మ‌ర‌ణించారు. రెండో పైలట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇవ్వడానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది: రాహుల్ గాంధీ

ఇదిలా ఉండగా.. మంగళవారం ఉత్తరాఖండ్‌లో కూడా ఓ హెలికాప్టర్ కూలిపోయింది. కొండ ప్రాంతాలపై ప్రయాణిస్తున్న సమయంలో ప్రతికూల వాతావరణం ఏర్పడటంతో హెలికాప్టర్ కొండను ఢీకొట్టింది. సరైన విజిబిలిటీ లేకపోవడమే ఈ చాపర్ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తేలింది. ఆర్యన్ ఏవియేషన్‌కు చెందిన ఆరు సీట్ల హెలికాప్టర్-బెల్ 407 (వీటీ-ఆర్పీన్) కేదార్‌నాథ్ ఆలయం నుండి గుప్తకాశీకి యాత్రికులను తీసుకువెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు చనిపోయారు.

Follow Us:
Download App:
  • android
  • ios