Pune: సెప్టిక్ ట్యాంక్‌ను శుభ్రం చేస్తుండగా ఊపిరాడక ముగ్గురు పారిశుధ్య కార్మికులు మృతి చెందారు. అయితే, అనుమానాస్పదంగా  పారిశుధ్య కార్మికుల మృతి చెందిన ఘ‌ట‌న‌పై సంబంధిత హౌసింగ్ సొసైటీ పోలీసుల విచారణ జ‌రుపుతున్నారు. 

3 Sanitation Workers Die in Maharashtra: సెప్టిక్ ట్యాంక్‌ను శుభ్రం చేస్తుండగా ఊపిరాడక ముగ్గురు పారిశుధ్య కార్మికులు మృతి చెందారు. అయితే, సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తుండగా ఊపిరాడక అనుమానాస్పదంగా పారిశుధ్య కార్మికుల మృతి చెందిన ఘ‌ట‌న‌పై సంబంధిత హౌసింగ్ సొసైటీ పోలీసుల విచారణ జ‌రుపుతున్నారు. ఈ విషాద ఘ‌ట‌న మ‌హారాష్ట్రలోని పూణేలో చోటుచేసుకుంది. 

వివ‌రాల్లోకెళ్తే.. పూణేలో శుక్రవారం ఉదయం హౌసింగ్ సొసైటీలోని సెప్టిక్ ట్యాంక్‌ను శుభ్రం చేస్తుండగా ముగ్గురు పారిశుధ్య కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఊపిరాడక కూలీలు మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. పూణేలోని వాఘోలీ ప్రాంతంలోని ఒక ప్ర‌యివేటు సొసైటీకి చెందిన సెప్టిక్ ఛాంబర్‌ను కార్మికులు మాన్యువల్‌గా శుభ్రం చేస్తున్నారని పూణే మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎంఆర్‌డీఏ) అధికారులు తెలిపారు.

Scroll to load tweet…

అగ్నిమాపక దళం అధికారులు మాట్లాడుతూ.. ఉదయం 7 గంటలకు ఈ సంఘటన గురించి తమకు సమాచారం అందించారని తెలిపారు. రెస్క్యూ పనిలో ఇద్దరు కార్మికుల మృతదేహాలను వెలికి తీయగలిగామనీ, అయితే, ఒకరు తప్పిపోయారని చెప్పారు. అయితే, మ‌రికొంత స‌మ‌యం వెతికిన త‌ర్వాత, తప్పిపోయిన కార్మికుడి మృతదేహం కనుగొనబడిందని వెల్ల‌డించారు. వార్తాసంస్థ పీటీఐ నివేదిక ప్ర‌కారం.. బహుశా లోపల చిక్కుకున్న మరొక కార్మికుడు ఉన్నట్లు నివాసితులు తెలియజేసినట్లు అధికారి తెలిపారు. ట్యాంక్ బయట మూడు జతల పాదరక్షలు కూడా దొరికాయని అధికారి తెలిపారు.

"మొత్తం ముగ్గురు కార్మికులు ఉన్నారని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. ట్యాంక్ వెలుపల మూడు జతల పాదరక్షలు కూడా కనిపించాయి, కాబట్టి మూడవ కార్మికుడి కోసం అన్వేషణ కొనసాగుతోంది" అని అధికారి తెలిపారు. "బాధితులు 18 అడుగుల లోతున్న డ్రైనేజీ కమ్ సెప్టిక్ ట్యాంక్‌లో పని చేస్తున్నారు. వారు ఊపిరాడక లోపల ఇరుక్కుపోయారని తెలుస్తోంది. ఉదయం 7 గంటలకు మాకు సమాచారం అందింది. సంఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత మేము ఇద్దరు కార్మికుల మృతదేహాలను తీసుకున్నాము" అని పూణే మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ అగ్నిమాపక దళ విభాగానికి చెందిన అధికారి ఒకరు చెప్పినట్టు మీడియా నివేదిక‌లు పేర్కొంటున్నాయి. 

కాగా, మృతి చెందిన కూలీలను మహారాష్ట్రలోని బుల్దానాకు చెందిన నితిన్ ప్రభాకర్ గోండ్ (45), ఉత్తరప్రదేశ్‌కు చెందిన సతీష్‌కుమార్ చౌదరి (35)గా గుర్తించారు. అంత‌కుముందు ట్యాంక్‌లో చిక్కుకున్న నాసిక్‌కు చెందిన గణేష్ పాలేక్రావ్ (28) గుర్తించారు. కాగా, ఆగస్టులో ఇదే తరహా ఘటనలో హర్యానాలో చోటుచేసుకుంది. బహదూర్‌ఘర్‌లోని ఓ ఫ్యాక్టరీ సెప్టిక్ ట్యాంక్‌ను శుభ్రం చేస్తుండగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన నలుగురు కూలీలు ఊపిరాడక చనిపోయారు. సెప్టిక్ ట్యాంక్ నుంచి వెలువడే విషవాయువులు పీల్చడంతో కూలీలు మృతి చెందినట్లు సమాచారం.