ఇండియన్ ఆర్మీకి చెందిన డాగ్ జూమ్ తన ధైర్య సాహసాలను ప్రదర్శించింది. శరీరానికి బుల్లెట్ గాయమైనా శత్రువులను వదలలేదు. ఇద్దరు ఉగ్రవాదులను అంతం చేసేందుకు ఆ శునకం వీరోచితంగా పోరాడింది.
మనుషులకు, కుక్కలకు ఏళ్ల తరుబడి అనుబంధం పెనవేసుకొని ఉంది. పూర్వ కాలం నుంచి దానిని పెంపుడు జంతువుగా మానవుడు సాకుతున్నాడు. మనిషికి విశ్వాస పాత్రుడికి శునకానికి ఎంతో గొప్ప పేరు ఉంది. తన యజమానికి కోసం, తనను నమ్ముకున్న వారి కోసం ఆ జంతువు ఎంతకైనా తెగిస్తుంది. తాజాగా ఓ శునకం ఇండియన్ ఆర్మీ కూడా ఇలాంటి త్యాగానికే సిద్ధపడింది. శరీరానికి గాయమైన శత్రువుతో పోరాడింది. దీంతో ఆ కుక్క ఇప్పడు వార్తల్లో నిలిచింది.
ఉజ్జయిని మహాకల్ లోక్ కారిడర్ ప్రారంభం నేడే.. ఆ ప్రాజెక్టు ప్రత్యేకతలేంటీ?
ఆ కుక్క పేరు ‘జూమ్’. కొన్ని సంవత్సరాలుగా ఇండియన్ ఆర్మీలో సేవలు అందిస్తోంది. సైనికులకు సహాయంగా ఉంటోంది. ఎన్నో ఉగ్రవాద క్రియాశీల కార్యకలాపాల ఏరివేతలో భాగం అయ్యింది. శత్రువులను మట్టికరిపించేందుకు ఆ శునకంగా ప్రత్యేకంగా శిక్షణ పొందింది. చాలా కాలం నుంచి అది భద్రత బలగాలకు విశ్వాస పాత్రుడిగా ఉంటోంది. తాజాగా ఓ ఇండియన్ ఆర్మీ నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్ లో భాగం అయ్యింది. శత్రువులతో వీరోచితంగా పోరాడింది.
వివరాలు ఇలా ఉన్నాయి. దక్షిణ కాశ్మీర్ జిల్లాలోని టాంగ్‌పావా ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికి గురించి నిర్దిష్ట సమాచారంతో భద్రతా దళాలు ఆదివారం అర్థరాత్రి కార్డన్, సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. అయితే సోమవారం ఉదయం ఉగ్రవాదులు దాక్కున్న ఇంటిలోకి సైన్యం జూమ్ ను పంపించింది. అందులో దాక్కున్న ఉగ్రవాదులను క్లియర్ చేసే పనిని ఆ ఆర్మీ డాగ్ కు ఎప్పటిలాగే అందించారు.
మమతా బెనర్జీకి ఎదురుదెబ్బ.. టీఎంసీ ఎమ్మెల్యే మాణిక్ భట్టాచార్య అరెస్టు.. ఎందుకంటే ?
అది తన విధులు నిర్వహిస్తున్న సమయంలో భద్రత బలగాలకు, ఉగ్రవాదులకు కాల్పులు జరిగాయి. ఆ సమయంలో టెర్రరిస్టులను గుర్తించిన జూమ్, వారిపై దాడి చేసింది. దీంతో ఈ సమయంలో ఆ కుక్కకు రెండు బుల్లెట్లు తగిలి తీవ్ర గాయాలు అయ్యాయి. అయినప్పటికీ జూమ్ పోరాడుతూనే ఉంది. తన పని తాను చేసుకుపోతూనే ఉంది. ఆ జూమ్ చేసిన పని వల్ల ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. ఈ సమయంలో మన సైనికులకు ఆ ఆర్మీ డాగ్ ఎంతో సహాయం చేసింది.
జైలు శిక్ష అనుభవిస్తున్న వేర్పాటువాద నాయకుడు అల్తాఫ్ అహ్మద్ షా మృతి..
సెర్చ్ ఆపరేషన్ ముగిసిన వెంటనే జూమ్‌ను ఇక్కడి ఆర్మీ వెటర్నరీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం దానికి అక్కడ చికిత్స అందిస్తున్నారు. కాగా.. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు మరణించారని, పలువురు ఇండియన్ ఆర్మీ జవాన్లు కూడా గాయపడ్డారని ఆర్మీ అధికారులు తెలిపారు.
