Asianet News TeluguAsianet News Telugu

Army Day 2022: భారత సైన్యానికి ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ శుభాకాంక్షలు..

నేడు(జనవరి 15) సైనికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ఆర్మీకి ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) శుభాకాంక్షలు తెలిపారు. సైనికులు, మాజీ సైనికులు, వారి కుటుంబాలకు మోదీ శుభకాంక్షలు తెలియజేశారు. దేశ భద్రత కోసం సైనికులు చేసిన త్యాగాలకు మాటలు సరిపోవని అన్నారు. 

army day 2022 PM Modi wishes soldiers and their families
Author
New Delhi, First Published Jan 15, 2022, 10:57 AM IST

నేడు(జనవరి 15) సైనికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ఆర్మీకి ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) శుభాకాంక్షలు తెలిపారు. సైనికులు, మాజీ సైనికులు, వారి కుటుంబాలకు మోదీ శుభకాంక్షలు తెలియజేశారు. భారత సైన్యం నిబద్ధత, అంకితభావాన్ని కొనియాడారు. దేశ భద్రత కోసం సైనికులు చేసిన త్యాగాలకు మాటలు సరిపోవని అన్నారు. దేశ రక్షణ కోసం కృషి చేస్తున్న Indian Army.. సంక్షోభ సమయంలో తోటి పౌరులకు సహాయం చేయడంలో ముందంజలో ఉంటున్నారని చెప్పారు. 

‘ఆర్మీ డే సందర్భంగా.. మన ధైర్యవంతులైన సైనికులు, మాజీ సైనికులకు, వారి కుటుంబాలకు శుభాకాంక్షలు. భారత సైన్యం ధైర్యసాహసాలు, వృత్తి నైపుణ్యానికి ప్రసిద్ధి చెందింది. దేశ భద్రత కోసం భారత సైన్యం చేస్తున్న అమూల్యమైన సహకారం గురించి చెప్పడానికి మాటలు న్యాయం చేయలేవు’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

మరో ట్వీట్‌లో.. ‘భారత ఆర్మీ సిబ్బంది ప్రతికూల పరిస్థితులలో, భూభాగాలలో దేశానికి సేవలందిస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలతో సహా మానవతా సంక్షోభ సమయంలో తోటి పౌరులకు సహాయం చేయడంలో ముందంజలో ఉన్నారు. మన సైనికులు విదేశాలలో శాంతి కార్యకలాపాలలో ఎల్లప్పుడూ చురుకుగా పాల్గొంటారు. భారత సైన్యం యొక్క గొప్ప సహకారానికి భారతదేశం గర్విస్తోంది’ అని మోదీ పేర్కొన్నారు. 

 

ఇక, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ కూడా భారత సైన్యం సేవలను కొనియాడారు. ‘మన సైన్యం ధైర్యవంతమైన, వృత్తిపరమైన శక్తిగా గుర్తింపు పొందింది. దేశాన్ని రక్షించడానికి వారి నిబద్ధత తిరుగులేనిది. భారతదేశం సైన్యాన్ని చూసి దేశం గర్విస్తోంది’ అని  Rajnath Singh పేర్కొన్నారు. 

భారతదేశాన్ని సైన్యం కంటికి రెప్పలా కాపాడుతూ ప్రజలకు రక్షణ కవచంగా నిలుస్తోంది. దేశంలో ప్రజలు ప్రశాంతంగా ఉండగలుగుతున్నారంటే అందుకు కారణం మన సైనికులే. అయితే భారత సైన్యం ప్రాముఖ్యతను చాటిచెప్పేలా, వారి త్యాగాలను గౌరవించడానికి ప్రతి ఏడాది జనవరి 15న ఆర్మీ డేను జరుపుకుంటున్నాం. 1949 జనవరి 15న భారత సైన్యానికి తొలి కమాండర్‌-ఇన్‌-చీఫ్‌గా మన దేశానికి చెందిన ఫీల్డ్ మార్షల్ కోదండర ఎం కరియప్ప ప్రమాణ స్వీకారం చేశారు. భారతదేశానికి చివరి బ్రిటిష్ కమాండర్‌-ఇన్‌-చీఫ్‌ సర్‌ ఫ్రాన్సిస్‌ బుచ్చర్‌ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బాన్ని పురస్కరించుకొని జనవరి 15న ప్రతి సంవత్సరం ‘జాతీయ సైనిక దినోత్సవం’ జరుపుకుంటున్నాం. 

Follow Us:
Download App:
  • android
  • ios