భారతదేశం ఎదుర్కొంటున్న భద్రతా సవాళ్ల గురించి ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే (MM Naravane) కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యతుల్లో జరిగే వివాదాలకు సంబంధించిన కొన్ని ట్రైలర్లను (trailers) మనం ఇంకా చూస్తున్నామని చెప్పారు.

భారతదేశం ఎదుర్కొంటున్న భద్రతా సవాళ్ల గురించి ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే (MM Naravane) కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యతుల్లో జరిగే వివాదాలకు సంబంధించిన కొన్ని ట్రైలర్లను (trailers) మనం ఇంకా చూస్తున్నామని చెప్పారు. మన ప్రత్యర్థులు వారి వ్యుహాత్మక లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నిస్తూనే ఉంటారని అన్నారు. ఒక ఆన్‌లైన్ సెమినార్‌లో ప్రసంగించిన జనరల్ నరవణే.. చైనా, పాకిస్తాన్‌ల నుంచి పొంచి ఉన్న భద్రతా సవాళ్ల గురించి ప్రస్తావించారు. భారతదేశం భిన్నమైన, క్లిష్టమైన, బహుళ-స్థాయి భద్రతా సవాళ్లను ఎదుర్కొంటోందని అన్నారు. ప్రస్తుతం ఉత్తర సరిహద్దులో జరుగుతున్న పరిణామాలు.. పూర్తిగా స్థాయిలో సిద్దమైన, సామర్థ్యం గల బలగాల అవసరాన్ని నొక్కిచెప్పాయని తెలిపారు. 


చైనా మరియు పాకిస్తాన్‌ల పేర్లను పేర్కొనకుండా ఆర్మీ చీఫ్ మాట్లాడుతూ, అణ్వాయుధ సామర్థ్యం ఉన్న పొరుగు దేశాలతో సరిహద్దు వివాదాలు, అలాగే రాష్ట్ర ప్రాయోజిత ప్రాక్సీ యుద్ధం భద్రతా యంత్రాంగానికి మరియు వనరులకు సవాళ్లను కలిగి ఉన్నాయని అన్నారు. అయితే చైనా, పాక్‌ల పేర్లు ప్రస్తావించని నరవణే.. అణ్వాయుధ సామర్థ్యం గల పొరుగు దేశాలతో వివాదాస్పద సరిహద్దులు కలిగి ఉన్నామని.. వాటిని ధీటుగా ఎదుర్కొవాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే ఆధునిక సాంకేతిక పరికరాలతో కూడిన సమర్థ బలగాలను ఉత్తర సరిహద్దులో మోహరించాల్సిన అవసరం ఉందన్నారు.

‘మన చుట్టూ చూస్తే మనకు వాస్తవికత తెలుస్తుంది. ఈ వాస్తవం ఆధారంగా మనం రేపటి యుద్ధానికి సిద్ధం కావాలి. ఈ ట్రైలర్‌ల ఆధారంగా మనం భవిష్యత్తు యుద్ధభూమిని నిర్మించాలి. వీటి ఆధారంగానే మనం ముందుకు వెళ్లాలి’ అని నరవణే చెప్పారు. దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను నిలబెట్టడానికి ఆధునిక సాంకేతిక పరికరాలతో కూడిన సమర్థ బలగాల అవసరం ఉందని పేర్కొన్నారు. కొన్ని దేశాలు ప్రపంచవ్యాప్తంగా ఆమోదించబడిన నిబంధనలను, నియమాలను సవాలు చేస్తున్నాయని చైనాపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు.