Asianet News TeluguAsianet News Telugu

దారుణం.. వాయిదా చెల్లించ‌డం లేద‌ని గొడ‌వ‌.. గ‌ర్భిణిపై ట్రాక్ట‌ర్ ఎక్కించిన లోన్ రిక‌వ‌రీ ఏజెంట్.. ఎక్క‌డంటే ?

లోన్ రికవరీ చేసేందుకు వచ్చిన ఓ ఫైనాన్స్ కంపెనీ ఏజెంట్లు గర్భిణిపై ట్రాక్టర్ ఎక్కించారు. దీంతో ఆమె హాస్పిటల్ లకు తరలిస్తుండగానే చనిపోయింది. ఈ విషాద ఘటన జార్ఖండ్ లో చోటు చేసుకుంది. 

Argument over non-payment of installments.. Loan recovery agent who loaded tractor on pregnant woman.. Where is it?
Author
First Published Sep 17, 2022, 9:07 AM IST

జార్ఖండ్‌లోని హజారీబాగ్ జిల్లాలో దారుణం జ‌రిగింది. ఓ ఫైనాన్స్ కంపెనీ లోన్ రిక‌వ‌రీ ఏజెంట్ గర్భిణిపై ట్రాక్ట‌ర్ ఎక్కించాడు. దీంతో ఆమె మృతి చెందింది. ఈ ఘ‌ట‌న ఆ రాష్ట్ర వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది. ఈ సంఘటన హ‌జ‌రీబాగ్ ఇచ్చాక్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. బాధితురాలు విక‌లాంగుడైన రైతు కుమార్తె. ఆమె మూడు నెలల గ‌ర్భ‌వ‌తి. 

పాము పగపట్టిందా?!.. ఒకే యువకుడిని, ఒకే చోట 5సార్లు కాటేసిన విషసర్పం...!

ఈ ఘటన తర్వాత ఆ ప్రాంతంలో తీవ్ర ఆందోళ‌నక‌ర వాతావ‌ర‌ణం నెల‌కొంది. గ‌ర్భిణి మృతిపై ఆగ్రహించిన గ్రామస్తులు శుక్రవారం హజారీబాగ్‌లోని ఇంద్రపురి చౌక్‌లోని ఆ ఫైనాన్స్ సంస్థ ఆఫీసు ఎదుట మృత‌దేహంతో నిర‌స‌న వ్య‌క్తం చేశారు. 

హజారీబాగ్ సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ మనోజ్ రతన్ చౌతీ ‘పీటీఐ’కి తెలిపిన వివరాల ప్రకారం.. వికలాంగుడైన రైతు మిథిలేష్ మెహతా కొంత కాలం కిందట మహీంద్రా ఫైనాన్స్ కంపెనీ నుంచి లోన్ తీసుకొని ట్రాక్టర్ కొనుగోలు చేశాడు. అయితే కొన్ని వాయిదాల‌ను ఆయ‌న స‌కాలంలో చెల్లించ‌డం లేదు. దీంతో ఇటీవ‌ల ఆ ఫైనాన్స్ కంపెనీ నుంచి రైతుకు మెజేస్ వ‌చ్చింది. పెండింగ్ లో ఉన్న బ‌కాయిలు చెల్లించాల‌ని లేకపోతే లోన్ రిక‌వ‌రీ ఏజెంట్లు, ఫైనాన్స్ కంపెనీ అధికారులు ఇంటికి వ‌చ్చి ట్రాక్ట‌ర్ ను స్వాధీనం చేసుకుంటార‌ని అందులో పేర్కొన్నారు.

గడ్డం సగం గీశాక డబ్బులివ్వమంటే గొడవ.. సెలూన్ లో ఇద్దరి హత్య..ఆస్తుల ధ్వంసం...

ఈ క్ర‌మంలో గురువారం ఆ రైతు ఇంటికి ఫైనాన్స్ కంపెనీ అధికారులు వ‌చ్చారు. ఆ స‌మ‌యంలో ట్రాక్ట‌ర్ సిజువా భారత్ పెట్రోల్ పంప్ సమీపంలో పార్క్ చేసి ఉంది. దీంతో అక్క‌డికి వెళ్లిన ఏజెంట్లు దానిని ర‌హ‌స్యంగా తీసుకెళ్ల‌డం ప్రారంభించారు. ఈ విష‌యం తెలుసుకున్న మిథిలేష్ మెహతా, గ‌ర్భ‌వ‌తి అయిన త‌న కుమార్తె మోనికా కుమారిని బైక్ పై ఎక్కించుకొని వారిని వెంబ‌డించారు. ఓ చోట వారిని నిలిపివేశారు. దీంతో ఫైనాన్స్ కంపెనీ ఇరు వ‌ర్గాల మ‌ధ్య వాగ్వాదం చెల‌రేగింది. అయినా ఏజెంట్లు ట్రాక్ట‌ర్ ను తీసుకెళ్లేందుకు ప్ర‌య‌త్నించారు. దానిని ఆపేందుకు ప్ర‌య‌త్నించి మోనికా న‌డుముపైకి ట్రాక్ట‌ర్ ఎక్కించారు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. 

ఆమె భ‌ర్త దిలీప్ కుమార్ మోహ‌తా అక్క‌డికి చేరుకొని మోనికాను రాంచీలోని రిమ్స్ హాస్పిట‌ల్ కు త‌ర‌లిస్తుండగా ప‌రిస్థితి విష‌మించ‌డంతో మార్గమ‌ధ్యలోనే మృతి చెందింది. మ‌ర‌ణవార్త విన్న ఆ గ్రామ‌స్తులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పోలీసులు అక్క‌డికి చేరుకొని కేసు ద‌ర్యాప్తు ప్రారంభించారు. ఆ ఫైనాన్స్ కంపెనీ స్థానిక మేనేజర్‌తో పాటు నలుగురిపై కేసు న‌మోదు చేశారు. వారిని అరెస్టు చేసేందుకు ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు.

యూపీలో భారీ వర్షాల బీభత్సం.. 23 మంది మృతి.. స్థంభించిన జనజీవనం

ఈ ఘ‌ట‌న‌పై మ‌హేంద్ర ఫైనాన్స్ మేనేజింగ్ డైరెక్టర్ అనీష్ షా ఈ సంఘటనపై విచారం వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. బాధిత కుటుంబానికి కంపెనీ పూర్తిగా అండగా ఉంటుంద‌ని, పోలీసుల దర్యాప్తుకు అన్ని విధాల స‌హ‌కారం అందిస్తామ‌ని పేర్కొన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios