రెండు వారాల్లో నలుగురు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకోవడం తమిళనాడులో కలకలం రేపింది. తాజాగా 17యేళ్ల 11వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. 

తమిళనాడు : Tamil Naduలో విషాదం చోటు చేసుకుంది. ఓ 11వ తరగతి చదువుతున్న 17యేళ్ల విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం శివకాశి సమీపంలోని అయ్యంబట్టి ప్రాంతంలోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో గత రెండు వారాల్లో తమిళనాడులో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య నాలుగుకు చేరింది. క్రాకర్ ఫ్యాక్టరీలో దినసరి కూలీలుగా పనిచేస్తున్న తల్లిదండ్రులు.. పనిలో ఉండగానే వారి కూతురు ఈ దారుణానికి ఒడిగట్టింది.

రాష్ట్రంలో ఇటీవల వరుసగా చోటు చేసుకుంటున్న విద్యార్థుల ఆత్మహత్యల్లో ఇది నాలుగోది. ఆత్మహత్య చేసుకున్న అమ్మాయి.. కన్నన్, మీనా దంపతుల చిన్న కూతురు. వీరు క్రాకర్ ఫ్యాక్టరీలో దినసరి కూలీలుగా పనిచేస్తున్నారు. తల్లిదండ్రులు పనికి వెళ్లిన సమయంలో కూతురు ఈ దారుణానికి ఒడిగట్టింది.

పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన బాలిక.. ఇంట్లో ఉన్న అమ్మమ్మ బయటకు వెళ్లగానే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంటికి తిరిగి వచ్చిన వృద్ధురాలు ఆమె ఉరివేసుకుని ఉండటం చూసి షాక్‌కు గురయ్యింది. వెంటనే సహాయం కోసం గట్టిగా కేకలు వేసింది. దీంతో ఆమె ఇరుగుపొరుగువారు అక్కడికి చేరుకుని విషయం తెలుసుకున్నారు. వారు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.

Justice for Srimathi : తమిళనాడు బాలిక అనుమానాస్పద మృతి కేసులో ఇద్దరు టీచర్లు అరెస్ట్..

ఇది తమిళనాడులో ఇటీవలి కాలంలో వరుసగా జరిగిన నాలుగో విద్యార్థి ఆత్మహత్య కేసు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం శివకాశి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విద్యార్థిని ఇంత తీవ్రమైన నిర్ణయం తీసుకోవడం వెనుక ఏం కారణం ఉందో ఇంకా తెలియలేదు. ఆమె పోస్ట్‌మార్టం నివేదిక కోసం వేచి చూస్తున్నారు. 

కాగా, తమిళనాడులోని కడలూరు జిల్లాలో సోమవారం 12వ తరగతి చదువుతున్న బాలిక తన ఇంట్లో శవమై కనిపించింది. తల్లి మందలించడంతో మనస్తాపం చెంది తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సోమవారం తెల్లవారుజామున, తిరువళ్లూరు జిల్లాలోని ప్రభుత్వ-సహాయక పాఠశాలలో 12వ తరగతి చదువుతున్న మరో బాలిక తన హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడింది.

Justice for Srimathi : తమిళనాడు విద్యార్థిని అనుమానాస్పద మృతిలో.. తండ్రి పిటిషన్ తోసిపుచ్చిన సుప్రీంకోర్టు...

జులై 13న కళ్లకురిచ్చిలో ఇలాంటి ఆత్మహత్య కేసు మొదటగా నమోదైంది. పాఠశాల ఆవరణలో 12వ తరగతి విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం నిరసనలకు దారితీసింది. ఆమె తల్లిదండ్రులు ఫౌల్ ప్లేను అనుమానించారు. మృతదేహాన్ని స్వీకరించడానికి నిరాకరించారు. వారికి నచ్చిన వైద్యుడి సమక్షంలో రీ-పోస్ట్‌మార్టం కోసం కోర్టు జోక్యాన్ని కూడా కోరారు. అయితే ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ సంఘటన జూలై 17న హింసకు దారితీసింది. పాఠశాలను ధ్వంసం చేశారు, డాక్యుమెంట్లు, సర్టిఫికేట్లను తగులబెట్టారు. ఆస్తి నష్టం జరిగింది.