తమిళనాడు, కళ్లకురుచ్చిలో ఉద్రిక్తతలకు దారి తీసిన విద్యార్థిని ఆత్మహత్య కేసులో పోలీసులు ఇద్దరు ఉపాధ్యాయులను అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు ఐదుగురు ఉపాధ్యాయులు, అధికారులను అదుపులోకి తీసుకున్నట్టయ్యింది.

తమిళనాడు : Tamil Naduలోని కళ్లకురుచ్చిలో ఓ విద్యార్థిని భవనం మీదినుంచి దూకి suicideత్య చేసుకున్న కేసులో ఇద్దరు ఉపాధ్యాయులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు ఐదుగురు ఉపాధ్యాయులు, అధికారులను అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడులోని కళ్లకురిచ్చిలో ఓ 12వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఉపాధ్యాయుల వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడింది. ప్రాథమిక పోస్టుమార్టం రిపోర్టులో మరణానికి కారణం శరీరం మీద అనేక గాయాలు, రక్తస్రావం కావడమేనని తేలింది.

తమిళనాడులోని సేలం జిల్లాలో జూలై 13న ఓ 12వ తరగతి విద్యార్థిని తన హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడంతో.. హింస చెలరేగింది. ఆమెను ఉపాధ్యాయుడు చిత్రహింసలకు గురిచేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో సోమవారం ఆ స్కూల్ కెమిస్ట్రీ టీచర్ హరిప్రియ, మ్యాథమెటిక్స్ టీచర్ కృతికను అరెస్ట్ చేశారు. అంతకుముందు, ప్రిన్సిపాల్, సెక్రటరీతో సహా పాఠశాలకు చెందిన ముగ్గురు మేనేజ్‌మెంట్ అధికారులను అరెస్టు చేశారు.

బాలిక అనుమానాస్పద మృతితో స్కూలు పరిసరాల్లో ఉద్రిక్తత.. 20మంది పోలీసులకు గాయాలు..
తమిళనాడులోని సేలం జిల్లాలో 12వ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం సృష్టించింది. దీంతో పాఠశాల యాజమాన్యం, సిబ్బంది చర్యలకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. కుటుంబసభ్యులు, విద్యార్థులు రాస్తారోకో చేసి నిరసనలు తెలిపారు. కాగా, ఆదివారం నిరసనకారులు పాఠశాల బస్సులు, పోలీసు వాహనాలను తగులబెట్టారు. ఈ హింసాత్మక ఘటనలో పలువురు పోలీసు అధికారులు గాయపడ్డారు. నివేదికల ప్రకారం, 12వ తరగతి విద్యార్థి మృతికి న్యాయం చేయాలని కోరుతూ 500 మందికి పైగా పాఠశాల వద్ద గుమిగూడారు. అయితే, నిరసనకారులు రాళ్లు రువ్వడం, పాఠశాల బస్సులకు నిప్పు పెట్టడంతో ఇదిక కాస్తా హింసాత్మకంగా మారింది. ఈ దాడిలో పాఠశాల ఆస్తులను కూడా ధ్వంసం అయ్యాయి. దీంతో కళ్లకురిచ్చిలో కర్ఫ్యూ కూడా విధించారు. శ్రీమతికి న్యాయం జరగాలంటూ #Justice for srimathi హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. 

కాగా, తమిళనాడులోని కాళ్లకురిచ్చి జిల్లా చిన్నసేలం సమీపంలోని కన్నియమూరు గ్రామంలో ఓ ప్రైవేట్ ఇంటర్నేషనల్ స్కూల్ లో ప్లస్ -2 చదువుతున్న శ్రీమతి(17) అనే బాలిక హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె దగ్గర దొరికిన సూసైడ్ నోట్ లో ఇద్దరు ఉపాధ్యాయులు తనను చిత్రహింసలకు గురిచేస్తున్నారని రాసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గత మంగళవారం రాత్రి ఆమె ఆత్మహత్య చేసుకోగా... బుధవారం ఉదయం హాస్టల్ వాచ్‌మెన్ నేలపై పడి ఉన్న బాలిక మృతదేహాన్ని గుర్తించి పాఠశాల అధికారులకు సమాచారం ఇచ్చాడు. వారు స్థానిక పోలీసులకు సమాచారం తెలిపారు. బాలికను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, ఆమె అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. ఆ సూసైడ్ నోట్‌లో ఇద్దరు ఉపాధ్యాయుల పేర్లు రాసి ఉన్నాయి. 

Scroll to load tweet…