ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కు మరో కూటమి నేత దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అఖిలేష్ యాదవ్ ను లెక్కచేయకుండా ఎస్‌బీఎస్‌పీ అధ్యక్షుడు ఓం ప్రకాష్ రాజ్‌భర్ ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు బహిరంగానే మద్దతు ప్రకటించారు.
సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఆయన మేనమామ, ప్రగతిశీల సమాజ్ వాదీ స్థాపకుడు అయిన శివపాల్ సింగ్ యాదవ్ అఖిలేష్ యాదవ్ కు దూరమయ్యారు. రాబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకే మద్దతు ఇస్తున్నట్టు బహిరంగా ప్రకటించారు. తాజాగా మరో నేత కూడా ఆయనను విడిచి వెళ్లిపోతున్నట్టు స్పష్టం అవుతోంది.
NIRF Ranking 2022: దేశంలో ఉత్తమ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్
గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్‌బీఎస్‌పీ) పార్టీని కలుపుకొని సమాజ్ వాదీ పార్టీ పోటీ చేసింది. అయితే ఇప్పుడు ఆ పార్టీ అధ్యక్షుడు ఓం ప్రకాష్ రాజ్‌భర్ అఖిలేష్ యాదవ్ కు వ్యతిరేకంగా ద్రౌపది ముర్ముకే మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. తనతో పాటు తన పార్టీ ఎమ్మెల్యేలు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థికే ఓటు వేస్తామని తెలిపారు. కాగా ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో SBSPకి ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు.
ఒకదాని తర్వాత ఒకటిగా మిత్రపక్షాలను కోల్పోతున్న సమాజ్‌వాదీ పార్టీకి SBSP చీఫ్ చేసిన తాజా ప్రకటన పెద్ద కుదుపు. ఈ విషయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజ్‌భర్ తెలిపారు. తన నిర్ణయాన్ని అమిత్ షాకు, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు తెలియజేశానని చెప్పారు. తాను కూడా ద్రౌపది ముర్ముకే ఓటేస్తానని ఎస్‌బీఎస్పీ ఎమ్మెల్యే ముఖ్తార్ అన్సారీ కుమారుడు అబ్బాస్ అన్సారీ తేల్చి చెప్పారు.
గాంధీ విగ్రహాన్ని కూడా ఎందుకు తొలగించకూడదు ?- కేంద్రంపై టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా వ్యంగాస్త్రం
ఇటీవల శివపాల్ సింగ్ యాదదవ్ సమాజ్ వాదీ పార్టీపై, అఖిలేష్ యాదవ్ పై తీవ్ర విమర్శలు చేశారు. ‘‘ నా సూచనలను (అఖిలేష్ యాదవ్) సీరియస్‌గా తీసుకుంటే ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. పార్టీకి చెందిన అనేక కూటములు ఇప్పుడు విడిచిపెట్టి వెళ్లిపోతున్నాయి.’’ అని అన్నారు. ‘‘ రాష్ట్రపతి ఎన్నికల్లో నన్ను ఓటు అడిగే వారికి ఓటు వేస్తానని ముందే చెప్పాను. సమాజ్‌వాదీ పార్టీ కూడా నన్ను పిలవలేదు. నా ఓటు అడగలేదు. సీఎం యోగి ఆదిత్యనాథ్ నిన్న నన్ను ఆహ్వానించారు. నేను అక్కడికి వెళ్లాను. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముతో సమావేశమయ్యాను. ఆమెకే ఓటు వేయాలని నిర్ణయించుకున్నాను.’’ అని శివపాల్ సింగ్ యాదవ్ ఇటీవల మీడియాతో అన్నారు.
జస్వంత్‌నగర్ నుంచి సమాజ్‌వాదీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందిన శివపాల్ సింగ్ యాదవ్ స్వయంగా ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ కు స్వయాన మేన మామ. గత కొంత కాలంగా ఆయన సమాజ్ వాదీ పార్టీపై బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ఆయన 2018లో ప్రగతిశీల సమాజ్ వాదీ అనే పేరుతో సొంతంగా ఒక పార్టీ ఏర్పాటు చేశారు. అయితే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్నితొలగించే ప్రయత్నంలో భాగంగా 2022 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అఖిలేష్ యాదవ్ తో కలిసి నడిచారు. ఆయన కూడా సమాజ్ వాదీ టికెట్ పైనే పోటీ చేసి విజయం సాధించారు.
