Asianet News TeluguAsianet News Telugu

రాజస్థాన్‌లో మళ్లీ పేపర్ లీక్.. పరీక్షకు ముందే అభ్యర్థుల వద్ద కనిపించిన టీచర్స్ రిక్రూట్‌మెంట్ ప్రశ్నాపత్రం..

సీనియర్ టీచర్ల రిక్రూట్ మెంట్ కోసం రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించాలని అనుకున్న ఓ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం లీక్ అయ్యింది. ఈ పరీక్ష నిర్వహించడానికి ముందే అభ్యర్థుల వద్ద ప్రశ్నాపత్రం కనిపించింది. దీంతో ప్రభుత్వం పరీక్షను రద్దు చేసింది. 

Another paper leak in Rajasthan.. Teachers recruitment question paper appeared in the candidates before the exam..
Author
First Published Dec 24, 2022, 3:16 PM IST

రాజస్థాన్‌లో మరోసారి పేపర్ లీక్ అయింది. రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (పీఆర్ పీసీ) నిర్వహించిన సీనియర్ టీచర్ (సెకండరీ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్) పరీక్ష-2022 జీకే పేపర్ బయటకు విడుదలైంది. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం పరీక్షను రద్దు చేసింది. అయితే పరీక్ష రద్దు కావడంతో అభ్యర్థులు ఒక్క సారిగా నిరాశకు లోనయ్యారు. పలుచోట్ల అభ్యర్థులు ఆందోళన కూడావ్యక్తం చేశారు. 

చప్పుడు చేయవద్దని వారించినందుకు డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌ను రాయితో కొట్టి చంపిన దుండగులు

అయితే ఘటనలో ప్రమేయం ఉందని భావిస్తున్న పలువురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. హైటెక్ చీటింగ్ కు పాల్పడుతున్న మాఫియా ముఠాలోని 44 మందిని ఉదయ్‌పూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ పేపర్ లీకేజ్ కు సంబంధించిన వివరాలను ఉదయ్‌పూర్ ఎస్పీ వికాస్ శర్మ మీడియాకు తెలియజేశారు. 

ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొంత కాలం కిందట సెకండరీ టీచర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. దాని ప్రకారం శనివారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు జీకే పేపర్ పరీక్ష చేపట్టాల్సి ఉంది. అయితే పరీక్ష ప్రారంభానికి ముందే ఉదయపూర్‌లోని బకేరియాలో చాలా మంది అభ్యర్థుల దగ్గర పేపర్ కనిపించింది. బస్సులో ప్రయాణిస్తున్న కొందరు యువకుల వద్ద ఈ పేపర్లు కనిపించడంతో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

క‌రోనా డెంజ‌ర్ బెల్స్: ఆక్సిజ‌న్ ల‌భ్య‌త‌పై స‌మీక్ష‌లు చేయండి.. రాష్ట్రాల‌కు కేంద్రం మ‌రో లేఖ

పరీక్ష రద్దు విషయాన్ని తెలియజేస్తూ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. “సీనియర్ టీచర్ (సెకండరీ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్) కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ - 2022ను ఈ నెల 21,24,26,27 తేదీల్లో చేపట్టాలని పీఆర్ పీసీ నిర్ణయించింది. అయితే 24వ తేదీన ఉదయం 9-11 వరకు జరగాల్సిన గ్రూప్-సీ జనరల్ నాలెడ్జ్ పరీక్ష అనివార్య కారణాల వల్ల వాయిదా వేస్తున్నాం. ఈ పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తామనేది త్వరలోనే తెలియజేస్తాం. మిగిలిన పరీక్షల షెడ్యూల్ అలాగే ఉంటుంది” అని పేర్కొంది.

ఇదే రాష్ట్రంలో నవంబర్ 12వ తేదీన నిర్వహించిన ఫారెస్ట్ గార్డ్ రిక్రూట్‌మెంట్ -2022 పరీక్ష పేపర్ లీక్ అయింది. దీంతో ఆ పరీక్షను కూడా ప్రభుత్వం రద్దు చేసింది. ఈ పరీక్షను ఈ ఏడాది డిసెంబర్ నెలలో లేదా 2023 జనవరి నెలలో నిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు. అయితే ఈ పరీక్ష పేపర్ లీక్ లో ప్రమేయం ఉన్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ఒక ప్రభుత్వ ఉద్యోగి కూడా ఉన్నారు.

మీ విద్వేష బజార్‌లో ప్రేమ దుకాణం తెరవడానికి వచ్చాం.. : బీజేపీ, ఆరెస్సెస్ లపై రాహుల్ గాంధీ ఫైర్

అటవీ శాఖలో 2300 ఫారెస్ట్ గార్డ్ పోస్టులను భర్తీ చేసేందుకు ఆర్ఎస్ఎంఎస్ఎస్బీ గతంలో నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం నవంబర్ 12వ తేదీన రెండు షిప్టుల్లో పరీక్షలు నిర్వహించారు. అందులో భాగంగా ఉదయం పూట ఓ పరీక్ష నిర్వహించగా.. మధ్యాహ్నం సమయంలో మరో పరీక్ష చేపట్టాల్సి ఉంది. అయితే రాజసమంద్ ప్రాంతంలో మధ్యాహ్నం జరగాల్సిన పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం లీక్ అయినట్టు అధికారులకు సమాచారం అందింది. దీంతో ఆ పరీక్షను రాష్ట్ర వ్యాప్తంగా నిలిపివేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios