సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రం అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌లో గతరాత్రి ఓ వ్యక్తిని భక్తులు కొట్టి చంపిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోన్న సంగతి తెలిసిందే. గర్భగుడిలోకి ప్రవేశించి పూజారిని చంపేందుకు ప్రయత్నించిన ఆ యువకుడిని అడ్డుకున్న భక్తులు ఒక్కసారిగా దాడి చేసి హతమర్చారు. 

సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రం అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌లో గతరాత్రి ఓ వ్యక్తిని భక్తులు కొట్టి చంపిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోన్న సంగతి తెలిసిందే. గర్భగుడిలోకి ప్రవేశించి పూజారిని చంపేందుకు ప్రయత్నించిన ఆ యువకుడిని అడ్డుకున్న భక్తులు ఒక్కసారిగా దాడి చేసి హతమర్చారు. ఇది జరిగిన మరుసటి రోజే పంజాబ్‌లో అదే తరహాలో మరో ఘటన చోటుచేసుకుంది.

కపుర్తలా జిల్లాలోని (kapurthala district ) నిజాంపూర్ గ్రామంలో ఓ వ్యక్తి గురుద్వారాలో చొరబడినట్టు గ్రామస్తులు గుర్తించారు. సిక్కుల పవిత్ర పతాకం నిషాన్ సాహిబ్ ను అతడు అపవిత్రం చేస్తున్నట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అయితే సిక్కు సంఘాలు మాత్రం అతడిని తమ ఎదుటే విచారించాలని పట్టుబట్టాయి. అయినప్పటికీ ఆ యువకుడిని అక్కడినుంచి తరలించే యత్నంలో పోలీసులకు, గ్రామస్తులకు మధ్య తోపులాట జరిగింది. అప్పటికే ఆగ్రహంతో వున్న ప్రజలు ఆ యువకుడిపై మూకుమ్మడిగా దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలై అతడు మరణించాడు.

Also Read:అమృత్‌సర్ స్వర్ణ దేవాలయంలో కలకలం.. పవిత్ర ఖడ్గాన్ని తీసే యత్నం, యువకుడిని కొట్టి చంపిన భక్తులు

కాగా.. శనివారం ఓ యువకుడు అమృత్‌సర్‌ (amritsar) స్వర్ణ దేవాలయంలోని (golden temple) గర్భగుడి లోపల గోల్డెన్ గ్రిల్స్ దూకి తల్వార్ అపహరించాడు. అనంతరం సిక్కు పూజారి పవిత్ర గురు గ్రంథ్ సాహిబ్ (guru granth sahib) పఠిస్తున్న ప్రదేశానికి చేరుకున్నాడు. దీనిని గుర్తించిన శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ (shiromani gurdwara parbandhak committee) టాస్క్‌ఫోర్స్ సభ్యులు పట్టుకున్నారు.

అనంతరం అతన్ని ఎస్‌జీపీసీ కార్యాలయానికి తీసుకెళ్తుండగా.. ఆగ్రహంతో ఉన్న అక్కడి వారు తీవ్రంగా కొట్టారని పోలీసులు చెప్పారు. మృతుడిని యూపీకి చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. అతను స్వర్ణ దేవాలయంలోకి ఎప్పుడు ప్రవేశించాడు. అతనితో పాటు ఎవరైనా వున్నారా అని తెలుసుకోవడానికి ఆలయంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. మరోవైపు ఈ సంఘటన తర్వాత, పెద్ద సంఖ్యలో సిక్కులు, వివిధ సిక్కు సంస్థలు ఎస్‌జీపీసీ నిర్లక్ష్యంపై మండిపడ్డారు. పరిస్ధితి ఉద్రిక్తంగా మారుతుండటంతో తేజా సింగ్ సముంద్రి హాల్‌లోని ఎస్‌జీపీసీ కాంప్లెక్స్ చుట్టూ భారీగాత పోలీసు బలగాలను మోహరించారు.