Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీలో మ‌ళ్లీ ఫైర్ యాక్సిడెంట్.. మండవాలి పోలీస్ స్టేషన్‌లో చెల‌రేగిన మంట‌లు

ఢిల్లీలోని మరో అగ్నిప్రమాదం జరిగింది. మండవాలి పోలీస్ స్టేషన్‌లోని మల్ఖానాలో బుధవారం రాత్రి మంటలు వ్యాపించాయి. ఈ ప్రదేశాన్ని అధికారులు తమ వస్తువులను స్టోర్ చేసేందుకు ఉపయోగిస్తుంటారు. అయితే ఈ మంటల్లో ఎలాంటి ప్రాణనష్టమూ జరగలేదు. 

Another fire accident in Delhi .. Fires at Mandawali police station
Author
New Delhi, First Published Jun 9, 2022, 5:04 AM IST

ఢిల్లీలో వ‌రుస‌గా అగ్నిప్ర‌మాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో తీవ్ర ఆస్థి న‌ష్టం, ప్రాణ న‌ష్టాలు సంభవిస్తున్నాయి. తాజాగా దేశ రాజ‌ధానిలోని మండవాలి పోలీస్ స్టేషన్‌లోని మల్ఖానాలో మంటలు చెలరేగాయి. ఈ ప్ర‌మాదం బుధవారం రాత్రి 10:20 గంటలకు జ‌రిగింది. ఈ ప్ర‌మాదం స‌మాచారం అందిన వెంట‌నే 10 ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. నిమిషాల వ్య‌వ‌ధిలో మంట‌ల‌ను అదుపులోకి తీసుకొచ్చాయి. 

ప్ర‌స్తుతం వ‌ర‌కు ఉన్న స‌మాచారం ప్ర‌కారం.. ఈ ప్ర‌మాదంలో ఎలాంటి ప్రాణ‌న‌ష్ట‌మూ జ‌ర‌గ‌లేదు. ఈ ప్ర‌మాద ప‌రిస్థితిని సమీక్షించేందుకు తూర్పు జిల్లాకు చెందిన సీనియర్ పోలీసు అధికారి కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ‘‘ మాకు రాత్రి 10:20 గంటలకు అగ్నిప్రమాదం జరిగిందని సమాచారం వచ్చింది. దీనికి కారణం ఏంట‌నే విష‌యం ఇంకా తెలియ‌లేదు. ఎవ‌రికీ గాయాలు కూడా కాలేదు. ప్ర‌మాదం జ‌రిగింది పోలీస్ స్టేషన్ లోనా మల్ఖానా ప్ర‌దేశం. మేము ఇక్కడ వివిధ రకాల వస్తువులను స్టోర్ చేస్తాం. ఫైర్ సర్వీస్ మంటలను అదుపులోకి తెచ్చింది. మంటలు 45 నిమిషాల్లో అదుపులోకి వ‌చ్చాయి. మా బృందం నష్టాన్ని లెక్కిస్తోంది ’’ అని అచిన్ గార్గ్ తూర్పు జిల్లా అదనపు డీసీపీ తెలిపారు.

జ‌మ్మూ కాశ్మీర్ లో శాంతి భ‌ద్ర‌త‌లు కాపాడ‌టంలో కేంద్రం విఫ‌లం - ఫరూక్ అబ్దుల్లా

నార్త్ బ్లాక్‌లోని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలో మంగళవారం అర్ధరాత్రి తర్వాత అగ్నిప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌పై ఫైర్ సిబ్బందికి వెంట‌నే స‌మాచారం అండ‌టంతో ఫైర్ ఇంజ‌న్లు అక్క‌డికి చేరుకున్నాయి. త్వ‌ర‌లోనే మంట‌ల‌ను అదుపులోకి తీసుకొచ్చాయి.. అలాగే ఢిల్లీలోని జామియా నగర్‌లోని ఎలక్ట్రిక్ మోటార్ పార్కింగ్ వద్ద బుధవారం ఉదయం అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. బుధ‌వారం జ‌రిగిన మ‌రో ఘ‌ట‌న‌లో దాదాపు 10 కార్లు దగ్ధమయ్యాయి. దీంతో వెంటనే ఫైర్ ఇంజ‌న్లు అక్క‌డికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు.

ఢిల్లీలోని లజ్‌పత్ నగర్ ప్రాంతంలోని ఓ భవనం బేస్‌మెంట్‌లోని ఎలక్ట్రిక్ మీటర్ ప్యానెల్‌లో కూడా మంట‌లు చెల‌రేగాయి. దీంతో దాదాపు 10 అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ‘‘ లజ్‌పత్ నగర్ ప్రాంతంలోని గ్రౌండ్ ప్లస్ 3-అంతస్తుల భవనంలోని మినీ బేస్‌మెంట్‌లో మంటలు చెలరేగాయి, మినీ బేస్‌మెంట్‌ను ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ ప్యానెళ్ల కోసం మాత్రమే తయారు చేశారు. మేము సుమారు 80 మందిని రక్షించాము ’’ అని అసిస్టెంట్ డివిజనల్ ఆఫీసర్ (ADO) రాజేష్ కుమార్ తెలిపారు. .

సిద్ధూ మూసేవాలా హత్యలో గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ యే సూత్రధారి - ఢిల్లీ పోలీసులు

మినీ బేస్మెంట్ కేవలం ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ ప్యానెల్స్ కోసం మాత్రమే తయారు చేయబడింది. అయితే మంటలు చెలరేగినప్పుడు భవనంలోని ప్లాస్టిక్, కలప, కొన్ని వ్యర్థ పదార్థాలు ఆ ప్ర‌దేశంలో ఉండ‌టంతో మంట‌లు తొంద‌గ‌రా వ్యాపించాయి. ఇదిలా ఉండ‌గా.. నాలుగు రోజుల కింద ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలో కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్ర‌మాదం సంభ‌వించింది. ఇందులో దాదాపు 12 మంది వ‌ర‌కు చ‌నిపోయారు. ఈ ప్ర‌మాదం విష‌యం తెలిసిన వెంట‌నే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా ఘటనాస్థలానికి చేరుకున్నారు. వెంట‌నే స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొన్నారు. ఈ కెమిక‌ల్ ఫాక్ట‌రీ జాతీయ రాజ‌ధాని న్యూ ఢిల్లీకి 60 కిలోమీటర్ల దూరంలోని ధౌలానాలోని పారిశ్రామిక కేంద్రంలో ఉంది. ఈ ఫాక్ట‌రీలో శ‌నివారం సాయంత్రం ఒక్క సారిగా బాయిలర్ పేలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios