Asianet News TeluguAsianet News Telugu

సిద్ధూ మూసేవాలా హత్యలో గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ యే సూత్రధారి - ఢిల్లీ పోలీసులు

తీహార్ జైలులో ఉన్న గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్.. సింగర్ సిద్దూ మూసేవాలా హత్యకు సూత్రధారి అని ఢిల్లీ పోలీసులు తెలిపారు. అయితే అతడు జైలు నుంచే ఈ కుట్రను ఎలా అమలు చేశాడనే విషయాన్ని పోలీసులు వెల్లడించలేదు. 

Gangster Lawrence Bishnoi is the mastermind behind the murder of Sidhu Musewala - Delhi Police
Author
New Delhi, First Published Jun 9, 2022, 3:34 AM IST

ప్రస్తుతం తమ అదుపులో ఉన్న గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ యే.. పంజాబ్ గాయ‌కుడు, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సిద్దూ మూసేవాలా హ‌త్య‌లో సూత్రధారి అని ఢిల్లీ పోలీసులు తెలిపారు. గ‌త నెల‌లో హ‌త్య‌కు గురైన సిద్దూపై కాల్పులు జ‌రిపిన ప్ర‌ధాన షూట‌ర్ సన్నిహితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు బుధ‌వారం వెల్ల‌డించారు. అయితే సింగ‌ర్ హ‌త్య వెనుక ఉన్న ఉద్దేశ్యం, తీహార్ జైలులో ఉన్న‌ప్పటికీ గ్యాంగ్ స్ట‌ర్ బిష్ణోయ్ నేరాన్ని అమలు చేయడానికి ఏ విధంగా కుట్ర పన్నాడనే విష‌యాల‌ను పోలీసులు ఇంకా వెల్ల‌డించ‌లేదు. 

ఈ హత్య కేసులో మరో ఐదుగురిని గుర్తించినట్లు స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (స్పెషల్ సెల్) హెచ్ ఎస్ ధాలివాల్ తెలిపారు. సింగ‌ర్ హ‌త్య‌లో లారెన్స్ బంధువు సచిన్ బిష్ణోయ్ పాత్ర కూడా బయటపడిందని ధాలివాల్ చెప్పారు. మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ కింద ఒక కేసులో మహారాష్ట్ర పోలీసులతో కలిసి నిర్వ‌హించిన జాయింట్ ఆప‌రేష‌న్ లో సిద్ధేష్ హిరామన్ కమ్లే అలియాస్ మహాకాల్ ను పూణేలో అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు.

కొడుకు మృత‌దేహం ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్.. బిచ్చ‌మెత్తుకున్న వృద్ధ దంప‌తులు.. వీడియో వైర‌ల్

ప్రధాన షూటర్ కు అత్యంత సన్నిహితుడైన మహాకాల్ ను మహారాష్ట్ర పోలీసులు 14 రోజుల కస్టడీలో ఉంచినట్లు స్పెషల్ కమిషనర్ విలేకరులకు తెలిపారు. లారెన్స్ ప్రోద్బలంతో పంజాబ్ లోని మోగా జిల్లాలో మహాకాల్ ఓ నేరానికి పాల్పడినట్లు చెప్పారు. మూసే వాలా హత్యకు ప్రధాన షూటర్ అయిన మ‌హాకాల్ లారెన్స్ సహకారంతో నేరం చేసేవాడు. కెనడాకు చెందిన గోల్డీ బ్రార్ సహా తన ముఠా సభ్యులు కుట్ర ప‌న్ని మూసేవాలాను చంపేశార‌ని లారెన్స్ గతంలో ద‌ర్యాప్తు అధికారుల‌కు తెలిపారు. గత ఏడాది ఆగస్టు 7న అకాలీదళ్ యువనేత విక్రమ్ జిత్ సింగ్ అలియాస్ విక్కీ మిద్దూఖేరా హత్య కేసులో మూసే వాలా ప్రమేయం ఉందని, ఇది తనకు, ఆయ‌న‌కు మ‌ధ్య వైరానికి దారితీసిందని లారెన్స్ ఆరోపించారు. 

అయితే లారెన్స్ దర్యాప్తున‌కు సహకరించడం లేదని, హత్యకు నిజమైన కుట్రదారులుగా ఉన్న అతని ముఠా సభ్యుల పేర్లను ఇంకా వెల్లడించలేదని అధికారులు తెలిపారు. ‘‘ బిష్ణోయ్ ఇప్పటి ఇంకా స‌రిగా స‌హ‌క‌రించ‌డం లేదు. కానీ విచారణ సమయంలో అతను సింగ‌ర్ సిద్దూ మూసేవాలాతో తనకు శత్రుత్వం ఉందని అంగీకరించాడు. తన ముఠా సభ్యులు గాయకుడిని చంపారని పేర్కొన్నాడు ’’ అని తెలిపారు. ‘‘మూసేవాలా హత్యకు కుట్ర చేసి, చంపేసిన ముఠా సభ్యులలో గోల్డీ బ్రార్ ఒకడని లారెన్స్ వెల్లడించాడు.  కానీ హత్యకు నిజమైన కుట్రదారులు, ఉరితీసిన ఇతర సహచరుల పేర్లను ఇంకా వెల్లడించలేదు ’’ అని ఒక పోలీసు అధికారి తెలిపారు. 

‘‘ చ‌దువుకోవ‌డం ముఖ్య‌మా ? హిజాబ్ ధ‌రించ‌డం ముఖ్య‌మా ?’’ - క‌ర్నాట‌క బీజేపీ ఎమ్మెల్యే సంజీవ మాతండూరు

గ‌త నెల 29వ తేదీన పంజాబ్ లోని మాన్సా జిల్లాలో కాంగ్రెస్ లీడ‌ర్, సింగ‌ర్ సిద్దూ మూసేవాలాను కొంద‌రు గుర్తు తెలియ‌ని దుండ‌గులు న‌డిరోడ్డుపై కాల్చి చంపిన సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉండ‌గా సినీ ర‌చ‌యిత సలీం ఖాన్, అతని కుమారుడు, బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ లకు బెదిరింపు లేఖకు సంబంధించిన విష‌యంలో గ్యాంగ్ స్టర్ బిష్ణోయ్ ను ప్రశ్నించడానికి ముంబై పోలీసుల క్రైమ్ బ్రాంచ్ యూనిట్ బుధవారం దేశ రాజధానికి చేరుకుంది. అయితే ఈ బెదిరింపు లేఖకు సంబంధించిన విషయంపై వ్యాఖ్యానించడానికి ధాలివాల్ నిరాకరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios