Asianet News TeluguAsianet News Telugu

బిల్లుల చెల్లింపులు ఆలస్యమవుతోందంటూ కర్నాటకలో మరో కాంట్రాక్టర్ ఆత్మహత్య.. ఇరకాటంలో అధికార బీజేపీ

కర్ణాటకలో మరో కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనతో అధికార బీజేపీ మరో సారి ఇరకాటంలో పడినట్లయ్యింది. కొంత కాలం కిందట ఓ కాంట్రక్టర్ ఆత్మహత్య చేసుకోవడంతో మంత్రి ఈశ్వరప్పపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. అది క్లియర్ అయిన కొంత కాలానికే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. 

Another contractor commits suicide in Karnataka due to delay in payment of bills. Ruling BJP in trouble
Author
First Published Dec 31, 2022, 4:18 PM IST

వచ్చే ఏడాది జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తూ బెంగళూరుకు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుమకూరు జిల్లాలో ఒక కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు. కాంట్రాక్టర్‌ను టీఎన్ ప్రసాద్ (50)గా గుర్తించారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద 16 కోట్ల విలువైన ప్రభుత్వ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యతలు ఆయన తీసుకున్నారు. 

ఏప్రిల్‌లో ఓ కాంట్రాక్టర్ ఆత్మహత్యపై తీవ్ర వివాదం చెలరేగడంతో మంత్రి కేఎస్ ఈశ్వరప్ప రాష్ట్ర మంత్రివర్గం నుంచి తప్పుకోవాల్సి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో ఆయనకు క్లీన్ చీట్ లభించింది. ఆ సమయంలో మరణించిన కాంట్రాక్టర్ తన మరణానికి ఈశ్వరప్ప కారణం అంటూ లేఖ రాశాడు. తరువాత ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఆయనపై కేసు నమోదు అయ్యింది. 

పుతిన్ విమర్శకుడైన మరో రష్యా పౌరుడు ఒడిశాలో మిస్సింగ్.. పెరుగుతున్న అనుమానాలు

కాంట్రాక్టర్ మరణంతో ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్ర నిరసనలు వ్యక్తం చేసింది. బొమ్మై నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా పనులపై 40 శాతం కమీషన్ వసూలు చేస్తోందని ఆరోపిస్తూ ప్రతిపక్ష కాంగ్రెస్ ‘పే సీఎం’ క్యాంపియన్ నిర్వహించింది. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ పలు సందర్భాల్లో లేవనెత్తుతోంది.  

అయితే కాంగ్రెస్ ప్రచారంపై కర్ణాటక ముఖ్యమంత్రి బొమ్మె స్పందించారు. ఇదంతా ‘రాజకీయ ప్రేరణ’ అంటూ కొట్టిపారేశారు. కాగా.. తాజాగా కేసులో బకాయిలను చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైనందుకు కాంట్రాక్టర్ నిరుత్సాహానికి గురయ్యాడని, అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి వల్లే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడని పోలీసులు వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో అతడు నిర్మిస్తున్న ఓ భవనంలోని ఇన్‌స్పెక్షన్ బంగ్లాలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

భారత్‌లోకి ప్రమాదకర కోవిడ్ వేరియంట్ ఎంట్రీ.. తొలి కేసు నమోదు!.. అమెరికాలో 40 శాతం కేసులకు కారణమిదే..

‘‘కాంట్రాక్టర్ గురువారం ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఈ ఘటనలో సీఆర్ పీసీ సెక్షన్ 174 కింద శుక్రవారం కేసు నమోదు చేశాం. అతడు రాసిన సూసైడ్ నోట్ ను మేము స్వాధీనం చేసుకున్నాం. నా చావుకు ఎవరూ బాధ్యులు కాదని ఆయన అందులో పేర్కొన్నాడు.’’ అని దర్యాప్తు అధికారి తెలిపారని ‘ఎన్ డీటీవీ’ నివేదించింది. ఈ ఘటనపై కాంట్రాక్టర్ల సంఘం అధ్యక్షుడు బలరాం మాట్లాడుతూ.. ఆత్మహత్యకు పాల్పడిన కాంట్రాక్టర్ భారీ మొత్తంలో రుణాలు తీసుకున్నాడని తెలిపారు. వాటిని తీర్చేందుకు ఐదు నెలల కిందట తన ఇంటిని కూడా అమ్మేశాడని చెప్పారు. 

భారత్‌లోకి ప్రమాదకర కోవిడ్ వేరియంట్ ఎంట్రీ.. తొలి కేసు నమోదు!.. అమెరికాలో 40 శాతం కేసులకు కారణమిదే..

‘‘ బిల్లుల క్లియరెన్స్ రావాల్సి ఉంది. ఈ చెల్లింపులు చాలా ఆలస్యమయ్యాయి. ఇదే విషయంలో నిన్న ఆయన నాతో మాట్లాడాడు. ఈ సమయంలో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ‘బిల్లులు క్లియర్ చేయాలని అడుగుతున్నా.. ఆలస్యం అవుతోంది’ అని ఆయన నాతో ఆవేదన వ్యక్తం చేశాడు. కానీ అతడు ఆత్మహత్య చేసుకుంటాడని అనుకోలేదు.’’ అంటూ టీఎన్ ప్రసాద్ స్నేహితుడు, కాంట్రక్టర్ రాజేంద్ర తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios