Asianet News TeluguAsianet News Telugu

భారత్‌లోకి ప్రమాదకర కోవిడ్ వేరియంట్ ఎంట్రీ.. తొలి కేసు నమోదు!.. అమెరికాలో 40 శాతం కేసులకు కారణమిదే..

కోవిడ్-19 వైరస్ తాజా వేరియంట్‌లు చైనాతో పాటు అనేక దేశాలలో ఆందోళనలను పెంచుతున్నాయి. ప్రస్తుతం కోవిడ్ ఓమిక్రాన్ XBB.1.5 వేరియంట్ అగ్రరాజ్యం అమెరికాలో వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ రకమైన వేరియంట్ భారత్‌లో కూడా ప్రవేశించినట్టుగా తెలుస్తోంది.

India First Case Of Omicron XBB.1.5 in Gujarat Reports
Author
First Published Dec 31, 2022, 3:06 PM IST

కోవిడ్-19 వైరస్ తాజా వేరియంట్‌లు చైనాతో పాటు అనేక దేశాలలో ఆందోళనలను పెంచుతున్నాయి. ప్రస్తుతం కోవిడ్ ఓమిక్రాన్ XBB.1.5 వేరియంట్ అగ్రరాజ్యం అమెరికాలో వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ రకమైన వేరియంట్ భారత్‌లో కూడా ప్రవేశించినట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన తొలి కేసు గుజరాత్‌లో నమోదైంది. డిసెంబర్‌లో గుజరాత్‌లో ఓమిక్రాన్ XBB.1.5 వేరియంట్ కేసు నమోదైనట్టుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని Insacog డేటా పేర్కొందని టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ చేసింది. ఇక, XBB.1.5 అనే సబ్ వేరియంట్.. న్యూ యార్క్‌లో కోవిడ్ కేసులు, ఆసుపత్రిలో చేరికల పెరుగుదలకు కారణమని అంతర్జాతీయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్ BA.2 సబ్-వేరియంట్ XBB.1.5 యునైటెడ్ స్టేట్స్‌లో ఇటీవలి కోవిడ్-19 కేసులలో 40 శాతానికి పైగా కారణమైందని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ విడుదల చేసిన డేటా వెల్లడించింది. చైనాలో పెరుగుతున్న కోవిడ్ కేసులు, అంటు వ్యాధి గురించి చాలా మంది ప్రజారోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ.. చాలా మంది నిపుణులు రెట్టింపు సూపర్ వేరియంట్ XBB.1.5 గురించి ఎక్కువగా ఆందోళన చెందుతున్నారని రాయిటర్స్ నివేదించింది.

ఇక, XBBఅనేది ఓమిక్రాన్ రెండు వేర్వేరు BA.2 సబ్-వేరియంట్‌ల రీకాంబినెంట్. ఒమిక్రాన్ సబ్‌వేరియంట్‌లు XBB.1.5, BQ.1.1, BQ.1, BA.5, XBBలు ప్రస్తుతం వివిధ దేశాలలో దాదాపు అన్ని కోవిడ్-19 ఇన్‌ఫెక్షన్‌లకు కారణమవుతున్నాయి. US సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ షేర్ చేసిన డేటా ప్రకారం.. వీటన్నింటిలో XBB.1.5 వేరియంట్ చాలా రోగనిరోధక శక్తిని కలిగి ఉంది. సంబంధిత సబ్‌వేరియంట్‌ల కంటే కణాలతో బంధించడంలో మరింత ప్రభావవంతంగా కనిపిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios