మహిళా ట్యూషన్ టీచర్ తో పారిపోయిన విద్యార్థిని.. మేజర్ అయిన తరువాత కలిసి జీవిస్తామంటూ పోలీసులతోనే..
ఓ మహిళా ట్యూషన్ టీచర్ కు విద్యార్థిని మధ్య బలమైన ఆకర్షణ ఏర్పడింది. దీంతో వారిద్దరూ కలిసి జీవించాలని అనుకున్నారు. ఇంట్లో చెప్పకుండా పారిపోయారు. కానీ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో బాలికను టీచర్ ను పోలీసులు పట్టుకున్నారు.
ప్రైవేట్ మహిళా ట్యూషన్ టీచర్ తో ఓ విద్యార్థినికి సాన్నిహిత్యం ఏర్పడింది. దీంతో వారు కలిసి జీవించాలని అనుకున్నారు. కానీ ఆ బాలిక వయస్సు ఇప్పటికీ 17 సంవత్సరాలే. అయితే ఈ విషయం ఇంట్లో చెబితే ఒప్పుకోరని ఆ మహిళా టీచర్ తో బాలిక పారిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాలింపు చర్యల తరువాత వీరి జాడ పోలీసులకు తెలిసింది. అయితే తాను ఇప్పుడు మైనర్ ను అని, మేజర్ అయ్యాక తన టీచర్ తో కలిసి జీవించాలని అనుకుంటున్నాని ఆమె పోలీసులతో తెలిపారు. కాగా.. పోలీసులు ఆ మహిళా టీచర్ పై పోక్సో కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన కేరళలో వెలుగులోకి వచ్చింది.
వివరాలు ఇలా ఉన్నాయి. కేరళలో 17 ఏళ్ల విద్యార్థినిని కిడ్నాప్ చేసిన మహిళా ప్రైవేట్ ట్యూటర్ ను పోలీసులు అరెస్టు చేశారు. బాలికకు 18 ఏళ్లు నిండిన తర్వాత కలిసి ఉండాలనుకుంటున్నామని టీచర్-స్టూడెంట్ ఇద్దరూ పోలీసులకు చెప్పినట్లు ‘టైమ్స్ నౌ’ కథనం నివేదించింది. తిరువనంతపురం జిల్లా శ్రీకారియంకు చెందిన 22 ఏళ్ల మహిళా ప్రైవేట్ ట్యూటర్ గా పని చేస్తున్నారు. మెడికల్ కాలేజ్ సమీపంలో నివసించే 17 ఏళ్ల బాలికకు ట్యూషన్ చెప్పేందుకు తల్లిదండ్రులు ఆమెను నియమించుకున్నారు. ఆ బాలిక 12వ తరగతి చదువుతోంది.
అమెరికాలో ‘మినీ ఇండియా ’.. అగ్రరాజ్యం అభివృద్ధిలో ప్రవాసుల పాత్రపై ప్రధాని కీలక వ్యాఖ్యలు
ఈ క్రమంలో బాలిక-టీచర్ మధ్య సాన్నిహిత్యం పెరిగింది. దీంతో వారి మధ్య బలమైన ఆకర్షణ మొదలైంది. దీంతో వారిద్ధరు కలిసి జీవించాలని భావించారు. దీంతో ఇంట్లో చెప్పకుండా బాలిక టీచర్ తో వెళ్లిపోయింది. కాగా.. తమ కూతురు కనిపించడం లేదని మెడికల్ కాలేజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎర్నాకుళంలోని అంగమాలి బస్టాండ్ లో వీరిద్దరూ పోలీసులకు చిక్కారు. దీంతో మహిళా టీచర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో బాలికకు 18 సంవత్సరాలు నిండిన తరువాత కలిసి జీవించాలని అనుకుంటున్నామని ఆ టీచర్-విద్యార్థిని పోలీసులకు తెలిపారు.
ప్రధాని మోదీ విజన్ ప్రశంసనీయం.. డిజిటల్ ఇండియాపై సుందర్ పిచాయ్ కీలక వ్యాఖ్యలు
కానీ పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వడంతో ఆ బాలిక తన తల్లిదండ్రులతో ఉండటానికి ఒప్పుకుంది. కాగా.. వీరిద్దరూ పారిపోయేందుకు సహకరించిన టీచర్ స్నేహితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.