Asianet News TeluguAsianet News Telugu

Earthquake : కర్ణాట‌కలో భూకంపం.. రిక్ట‌ర్ స్కేల్ పై 3.4 తీవ్రత న‌మోదు

కర్ణాటక రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భూకంపం సంభవించింది. స్వల్పంగా ప్రకంపనలు రావడంతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టమూ జరగలేదు. రిక్టర్ స్కేల్ పై ఈ భూకంప తీవ్రత 3.4 గా నమోదు అయ్యింది. 

An earthquake measuring 3.4 on the Richter scale has hit Karnataka
Author
Bangalore, First Published Jun 23, 2022, 1:06 PM IST

క‌ర్ణాట‌క రాష్ట్రంలోని హసన్ జిల్లా, దాని ప‌రిస‌ర ప్రాంతాల్లో గురువారం తెల్ల‌వారుజామున స్వ‌ల్ప భూకంపం వ‌చ్చింది. రిక్ట‌ర్ స్కేల్ పై 3.4 తీవ్ర‌త న‌మోదు అయ్యింది. ఈ విష‌యాన్ని విపత్తు నిర్వహణ అధికారి ధృవీక‌రించారు. అలాగే ఇదే స‌మ‌యంలో కొడగు జిల్లా సోమవారపేట సమీపంలోని పలు గ్రామాల్లో కూడా భూకంపం సంభవించింది. 

Agnipath: అగ్నిపథ్‌కు అప్లై చేస్తే సామాజిక బహిష్కరణే: హర్యానాలో పెద్దల నిర్ణయం

ఉన్న‌ట్టుండి ఒక్క సారిగా భూమి కంపించ‌డంతో ప్ర‌జ‌ల‌కు ఏం జ‌రిగిందో అర్థం కాలేదు. దీంతో ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు. కర్ణాటక స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ కమిషనర్ మనోజ్ రాజన్ తెలిపిన వివరాల ప్రకారం.. హసన్ జిల్లా హోలెనరసిపురా తాలూకాలోని నగరనహళ్లి గ్రామ పంచాయతీ పరిధిలోని మలుగనహళ్లి గ్రామం భూకంప కేంద్రంగా ఉంది. భూకంప తీవ్రత మధ్యస్థంగా ఉందని తెలిపారు. భూకంప కేంద్రం నుండి గరిష్టంగా 40-50 కిలోమీటర్ల రేడియల్ దూరం వరకు ప్రకంపనలు సంభవించవచ్చని ఆయన అన్నారు.

‘‘ ఈ రకమైన భూకంపం స్థానిక సమాజానికి ఎలాంటి హానీ క‌లిగించ‌దు. అయినప్పటికీ స్వల్పంగా కుదుపులు ఉంటాయి. ఈ ప్రాంతం భూకంప కేంద్రం సీస్మిక్ జోన్-IIలో ఉన్నందున, భూకంపాలు సంభవించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అలాగే న‌ష్టం జ‌రిగే అవ‌కాశాలు కూడా చాలా త‌క్కువ‌గా ఉంటాయి. టెక్టోనిక్ మ్యాప్ ప్రకారం ఈ ప్రాంతం ఎలాంటి నిర్మాణాత్మక నిలిపివేతలకు గురి కాదు. కాబ‌ట్టి ఇక్క‌డ సంభ‌వించే భూకంపాలు మితంగా ఉంటాయి. అలాగే ఎలాంటి విధ్వంసాలు సృష్టించ‌వు. కాబ‌ట్టి ఎవ‌రూ భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు ’’ అని కమిషనర్ వివరించారు.

ఉద్ద‌వ్ ఠాక్రే కోవిడ్ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించారు - పోలీసుల‌కు బీజేపీ నేత త‌జింద‌ర్ బ‌గ్గా ఫిర్యాదు

బుధవారం తెల్లవారుజామున తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌లోని గ్రామీణ, పర్వత ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. ఈ ఘ‌ట‌న‌లో దాదాపు 900 మంది చ‌నిపోయారు. 600 మందికి పైగా గాయ‌ప‌డ్డారని అధికారులు తెలిపారు. ఈ భూకంపం వ‌ల్ల ప‌లు భ‌వ‌నాలు కుప్ప‌కూలిపోవ‌డంతో వంద‌లాది మంది శిథిలాల్లో చిక్కుకున్నారు. రిక్టర్ స్కేల్‌పై 6.1 తీవ్రత న‌మోదు అయ్యింది.  భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్తాన్‌లోని పక్తికా ప్రావిన్స్‌లో సరిహద్దుకు సమీపంలో ఉందని, ఖోస్ట్ నగరానికి నైరుతి దిశలో 50 కిలోమీటర్లు (31 మైళ్లు) దూరంలో ఉందని పొరుగు దేశమైన పాకిస్తాన్ వాతావరణ విభాగం తెలిపింది. 

Follow Us:
Download App:
  • android
  • ios