మార్చి 20న అమృత్‌సర్‌లో రికార్డయిన సీసీటీవీ ఫుటేజీలో... అమృత్ పాల్ సింగ్ జాకెట్, ప్యాంటు ధరించి.. కళ్లకు డార్క్ షేడ్స్ పెట్టుకుని కనిపించాడు.
న్యూఢిల్లీ : పంజాబ్ పోలీసుల నుంచి వారం రోజులుగా తప్పించుకు తిరుగుతున్న రాడికల్ సిక్కు బోధకుడు అమృతపాల్ సింగ్, తన డ్రెస్సింగ్ మార్చాడు. సంప్రదాయ పంజాబీ దుస్తుల్లో కనిపించే అతను.. జాకెట్, ప్యాంటు ధరించి.. కళ్లకు డార్క్ షేడ్ కళ్లద్దాలు పెట్టుకుని కనిపించాడు. 'వారిస్ పంజాబ్ దే'పై భారీ అణిచివేత సమయంలో రాష్ట్ర పోలీసుల నుండి తప్పించుకునే సమయంలో అతను ఈ డ్రెస్సింగ్ లోనే మాయమయ్యాడని.. పోలీసులు యాక్సెస్ చేసిన సెక్యూరిటీ కెమెరా ఫుటేజీలో నమోదయ్యింది.
ఈ సీసీటీవీ ఫుటేజీ అమృత్‌సర్‌లోనిది, మార్చి 20న రికార్డయింది. ఆ తరువాత అమృత్ పాల్ సింగ్ బంధువుల ఇంట్లో దాక్కున్నట్లు తెలిసింది. అతను అమృత్‌సర్ నుండి హర్యానాలోని కురుక్షేత్రకు బయలుదేరి.. అక్కడినుంచి దేశ రాజధానికి బయలుదేరినట్లు వీడియోల ద్వారా తెలుస్తోందని పోలీసు వర్గాలు తెలిపాయి. అతను నిన్న సన్యాసి వేషంలో బస్ టెర్మినల్ వద్ద దిగినట్లు వారు తెలిపారు.
రాహుల్‌పై అనర్హత వేటు: ఈరోజు రాజ్యాంగ ప్రజాస్వామ్యం కొత్త పతానాన్ని చూశాం.. బీజేపీపై మమత ఫైర్
ఢిల్లీలోని కశ్మీర్ గేట్‌లోని ఇంటర్ స్టేట్ బస్ టెర్మినల్ వద్ద ఢిల్లీ, పంజాబ్ పోలీసుల బృందాలు ఈ ఉదయం నుండి కాపు కాచాయి. సీసీటీవీ ఫుటేజీలను స్కాన్ చేస్తున్నాయి. అతను పోలీసుల నుండి పారిపోతున్నప్పుడు అతనికి ఒక మహిళ ఆశ్రయం కల్పించింది. ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది కూడా సీసీ టీవీ కెమెరాలో నమోదయ్యింది. ఆ ఫుటేజ్ లో వేర్పాటువాద నాయకుడు తన ముఖాన్ని దాచుకునేందుకు గొడుగు పట్టుకున్నట్లు కనిపించింది.
హర్యానాలోని కురుక్షేత్రలోని తన ఇంట్లో అమృతపాల్ సింగ్, అతని సహాయకుడు పాపల్‌ప్రీత్ సింగ్‌కు ఆశ్రయం కల్పించిన మహిళ బల్జీత్ కౌర్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. హత్యాయత్నం, చట్ట అమలుకు ఆటంకం కలిగించడం.. సామరస్యానికి ఆటంకం సృష్టించడం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న అమృతపాల్ గత శనివారం నుండి పరారీలో ఉన్నాడు, అధికారులు అతని మోటర్‌కేడ్‌ను అడ్డుకోవడానికి, నాటకీయంగా వెంబడించి అరెస్టు చేయడానికి ప్రయత్నించారు.
గత ఏడాది ప్రమాదంలో మరణించిన నటుడు, కార్యకర్త దీప్ సిద్ధూ ప్రారంభించిన రాడికల్ సంస్థ 'వారిస్ పంజాబ్ దే' చీఫ్ అమృతపాల్ సింగ్, అతను, అతని మద్దతుదారులు కత్తులు, తుపాకీలతో దాడి పోలీస్ స్టేషన్ మీద దాడి చేయడంతో వార్తల్లో నిలిచారు. ఓ కిడ్నాప్ కు ప్రయత్నించినందుకు అరెస్టు చేయబడి బోధకుడి సహాయకులలో ఒకరిని విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. అమృత్‌సర్ శివార్లలో పగటిపూట జరిగిన దాడిలో పలువురు పోలీసులు గాయపడ్డారు, చర్య తీసుకోవాలని అధికారులపై ఒత్తిడి తెచ్చారు.
