Asianet News TeluguAsianet News Telugu

భార‌త్‌లో 8,306 క‌రోనా కొత్త కేసులు.. పెరుగుతున్న ఒమిక్రాన్‌..

దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనలు నెలకొన్నాయి. భారత్ లోనూ ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. అయితే, సాధారణ కరోనా వైరస్ కేసుల్లో పెరుగుదల నమోదుకాకపోవడం కాస్త ఊరట కలిగిస్తున్నది. దేశంలో కొత్తగా 8306 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. 
 

India reports 8,306 new Covid-19 cases
Author
Hyderabad, First Published Dec 6, 2021, 10:31 AM IST

భారత్ లో కరోనా ప్రభావం కొనసాగుతూనే ఉంది. మరీ ముఖ్యంగా అత్యంత ప్రమదకరమైన వేరియంట్ గా భావిస్తున్న ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక సాధారణ కరోనా కొత్త కేసుల్లో పెరుగుదల పెద్దగా లేకపోవడం కాస్త ఊరట కలిగించే అంశం.  సోమవారం ఉదయం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 8,306 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు రోజుతో పోలిస్తే తక్కువగానే కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్ లో మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 3,46,41,561కి చేరాయి. దేశంలో యాక్టివ్ కేసులు సైతం లక్ష దిగువకు చేరాయి. ప్రస్తుతం 98,416 క్రియాశీల కేసులు ఉన్నాయి.

Also Read: భారత్‌-రష్యా మధ్య 21వ శిఖరాగ్ర సదస్సు.. కీల‌క ఒప్పందాల‌పై సంత‌కాలు

అలాగే, గత 24 గంటల్లో దేశంలో కరోనా వైరస్ తో పోరాడుతూ 211 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,73,537కు పెరిగింది.  అలాగే, కోవిడ్-19 నుంచి కొత్తగా 8,834 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కరోనా రికవరీల సంఖ్య 3,40,69,608కి పెరిగింది. కరోనా కేసులు, మరణాలు అధికంగా నమోదైన రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర, కేరళ, కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, ఒడిశా, ఛత్తీస్ గఢ్ లు టాప్-10 లో ఉన్నాయి.  ప్రస్తుతం అధికంగా కేసులు, మరణాలు కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటకలో నమోదవుతున్నాయి. భారత్ కరోనా రికవరీ రేటు 98.3 శాతంగా ఉంది. మరణాల రేటు 1.34 శాతంగా ఉంది.  వారంతపు కరోనా పాజిటివిటీ రేటు 5.4 శాతంగా ఉంది.  దేశంలో ఇప్పటివరకు మొత్తం 64,72,52,850 కరోనా పరీక్షలు నిర్వహించినట్టు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) వెల్లడించింది. ఆదివారం ఒక్కరోజే 12,26,064 శాంపిళ్లను పరీక్షించినట్టు తెలిపింది. ఇక ఒమిక్రాన్ కేసుల పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. ఇప్పటివరకు దేశంలో మొత్తం 127.9 కోట్ల కరోనా టీకాలను పంపిణీ చేశామని కేంద్రం వెల్లడించింది. ఇందులో మొదటి డోసు తీసుకున్నవారు 80 కోట్లు , రెండు డోసులు 47.9 కోట్ల మంది ఉన్నారు. 

Also Read: పౌరుల ప్రాణాలకు రక్షణ లేదా? కేంద్ర హోంశాఖ ఏం చేస్తున్నట్టు : రాహుల్ గాంధీ

ప్రపంచవ్యాప్తంగా వైరస్ ప్రభావం ఇలా.. 

ప్రపంచవ్యాప్తంగా వైరస్ ప్రభావం పెరుగుతూనే ఉంది. మరీ ముఖ్యంగా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి అధికంకావడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. దక్షిణాఫ్రికా, బ్రిటన్, అమెరికాలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. దాదాపు 20 పైగా దేశాలను ఒమిక్రాన్ చుట్టిముట్టింది.  చాలా దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఇక అన్ని దేశాల్లో కలిపి ఇప్పటివరకు మొత్తం 266,127,191 కరోనా కేసులు నమోదయ్యాయి. 5,270,933 మంది వైరస్ తో చనిపోయారు. 5,270,933 మంది కోలుకున్నారు. కోవిడ్-19 కేసులు అధికంగా నమోదైన దేశాల జాబితాలో అమెరికా, భారత్, బ్రెజిల్, యూకే, రష్యా, టర్కీ, ఫ్రాన్స్, జర్మనీ, ఇరాన్, అర్జెంటీనా దేశాలు టాప్-10లో ఉన్నాయి. ప్రస్తుతం జర్మనీ, దక్షిణాఫ్రికా, అమెరికాలో కొత్త కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. 

Also Read: విదేశీ కంపెనీల చేత్తుల్లోకి తెలంగాణ భూ వివ‌రాలు.. రాముల‌మ్మ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Follow Us:
Download App:
  • android
  • ios