ఉక్కు మనిషి సర్దార్ వల్లభభాయి పటేల్ (Sardar Vallabhbhai Patel) జయంతిని(అక్టోబర్ 31) 2014 నుంచి  భారత ప్రభుత్వం రాష్ట్రీయ ఏక్తా దివస్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. నేడు సర్దార్ వల్లభభాయి పటేల్ 146వ జయంతి సందర్భంగా (Sardar Vallabhbhai Patel birth anniversary) రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు.

ఉక్కు మనిషి సర్దార్ వల్లభభాయి పటేల్ (Sardar Vallabhbhai Patel) జయంతిని(అక్టోబర్ 31) 2014 నుంచి భారత ప్రభుత్వం రాష్ట్రీయ ఏక్తా దివస్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. నేడు సర్దార్ వల్లభభాయి పటేల్ 146వ జయంతి సందర్భంగా (Sardar Vallabhbhai Patel birth anniversary) రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలకు ప్రజలు ఎల్లప్పుడూ ఆయనకు రుణపడి ఉంటారని రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. న్యూఢిల్లీలోని పటేల్ చౌక్‌లోని సర్దార్ పటేల్ విగ్రహం వద్ద సర్దార్ పటేల్‌కు రాష్ట్రపతి కోవింద్ నివాళులర్పించారు. 

Also read: జీ20 సదస్సు: ప్రపంచ నేతలతో ప్రధాని మోడీ చిట్‌చాట్..

‘ఉక్కు మనిషి సర్దార్ వల్లభభాయి పటేల్ జయంతి సందర్భంగా నా వినయపూర్వకమైన నివాళులు. దేశ ఐక్యతకు ప్రతీకగా నిలిచిన సర్దార్ పటేల్ మన అగ్రగామి దేశ నిర్మాతలలో ఉన్నత స్థానాన్ని ఆక్రమించారు. నైతికత మరియు దేశ సేవ ఆధారంగా పని సంస్కృతిని స్థాపించినందుకు దేశప్రజలు సర్దార్ పటేల్‌కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారు’ అని రామ్‌నాథ్ కోవింద్ ట్వీట్ చేశారు. 

Scroll to load tweet…

ఐక్యతా విగ్రహం వద్ద పటేల్​కు అమిత్​ షా నివాళి
సర్దార్ వల్లభభాయి​ ​పటేల్​ జయంతి సందర్భంగా.. గుజరాత్​ కెవాడియాలోని పటేల్ ఐక్యతా విగ్రహం (Statue of Unity in Kevadia) వద్ద ఆయనకు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా (Amit Shah) నివాళులర్పించారు. ఐక్యతా విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పటేల్ విగ్రహాం(స్టాట్యూ ఆఫ్ యూనిటీ)పై హెలికాప్టర్ల నుంచి పూలవర్షం కురిపించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన 'రాష్ట్రీయ ఏక్తా దివస్​' పరేడ్​ను అమిత్ షా వీక్షించారు. ఐక్యతా పరేడ్‌లో భాగంగా ఆర్మీ, పోలీస్ అధికారుల గౌరవ వందనాన్ని అమిత్ షా స్వీకరించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ పటేల్ దేశానికి చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. జాతీయ ఐక్యతపై ప్రమాణం చేయించారు.

Also read: మళ్లీ ప్రధానిగా నరేంద్ర మోడీనే.. యూపీ సీఎం అభ్యర్థి ఆయనే.. : కేంద్ర హోం మంత్రి

‘దృఢ సంకల్పం, ఉక్కు నాయకత్వం, ఎనలేని దేశభక్తి ఉన్న వ్యక్తి సర్దార్ పటేల్. దేశంలోని భిన్నత్వాన్ని ఏ విధంగా ఏకత్వంగా మార్చి సమైక్య దేశానికి రూపాన్ని ఇవ్వగలదో సర్దార్ పటేల్ జీవితం చెబుతోంది. దేశ సమగ్రతతో పాటు, స్వతంత్ర భారత దేశానికి పరిపాలనా పునాది వేయడానికి సర్దార్ పటేల్ కూడా పనిచేశారు. మాతృభూమి కోసం సర్దార్ పటేల్ అంకితభావం, విధేయత, పోరాటం, త్యాగం.. ప్రతి భారతీయుడు దేశ ఐక్యత, సమగ్రత కోసం తనను తాను అంకితం చేసుకునేలా ప్రేరేపిస్తుంది. అఖండ భారతావని తరఫున అటువంటి గొప్ప వ్యక్తి జయంతి సందర్భంగా ఆయన పాదాలకు నమస్కారాలు. దేశ ప్రజలందరికీ 'రాష్ట్రీయ ఏక్తా దివస్' శుభాకాంక్షలు’అని అమిత్ షా ట్వీట్ చేశారు.

Scroll to load tweet…

మరోవైపు కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, హర్దీప్ సింగ్ పూరీ, పీయూష్ గోయల్‌తో పాటు ఇతర కేంద్ర మంత్రులు కూడా సోషల్ మీడియా వేదికగా సర్దార్ పటేల్‌కు నివాళులర్పించారు.