ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రపంచ అధినేతలతో మాట్లాడారు. జీ20 సమావేశానికి హాజరవ్వడానికి వీరంత ఇటలీలో కలిశారు. ఫ్యామిలీ ఫొటోకు పోజు ఇవ్వడానికి వచ్చిన ప్రపంచ నేతలతో చిట్ చాట్ చేశారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్, యూకే ప్రధాని బోరిస్ జాన్సన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుల్ మ్యాక్రాన్‌లతో మాట్లాడారు. 

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి Narendra Modi ఇటలీ పర్యటనలో ఉన్నారు. Italy ప్రధానమంత్రి మేరియో డ్రాగి ఆహ్వానం మేరకు ఆయన G20 సదస్సుకు హాజరవ్వడానికి Europeకు ప్రయాణమయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రపంచ అధినేతలతో చర్చలు జరిపారు. జీ20 సదస్సు నేపథ్యంలో వారంతా ఒక చోట కలుసుకోవడం సాధ్యమైంది. ఈ నేపథ్యంలో America అధ్యక్షుడు Joe Biden, French Presiden ఇమ్యాన్యుల్ మ్యాక్రాన్, UK ప్రధాని బోరిస్ జాన్సన్, Canada పీఎం జస్టిన్ ట్రూడో సహా పలువురు నేతలతో ఆయన సంభాషణ జరిపారు. జీ20 సదస్సు కోసం వెళ్లిన ప్రధాని మోడీని ఇటలీ ప్రధాని మేరియో డ్రాగి ఆహ్వానించారు. 

Scroll to load tweet…

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో సరదా సంభాషణ జరిపినట్టు తెలుస్తున్నది. ఇరువురూ సంతోషంగా మాట్లాడుకుంటూ నడుస్తూ వెళ్తున్న ఫొటోలను ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. సెప్టెంబర్ 24న ప్రధాని మోడీతో బైడెన్ వైట్ హౌజ్‌లో ముఖాముఖిగా తొలిసారి సమావేశమైన సంగతి తెలిసిందే.

Also Read: పోప్ ఫ్రాన్సిస్‌తో ప్రధాని మోడీ భేటీ.. భారత్‌కు ఆహ్వానం

కాగా, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుల్ మ్యాక్రాన్‌తోనూ ప్రధాని చాలా క్లోజ్‌గా సంభాషించారు. వారిద్దరూ మాటల్లో నిమగ్నమైన ఓ చిత్రాన్ని ప్రధాని ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఇరువురి మధ్య ఫలప్రదమైన చర్చ జరిగిందని పేర్కొన్నారు. ప్రపంచ ప్రయోజనాలకు సంబంధించిన చర్చ జరిగినట్టు పేరర్కొన్నారు. ఆస్ట్రేలియా, యూకే, యూఎస్‌లతో కొత్త కూటమి ఆకస్ ఏర్పడిన తర్వాత దాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుల్ మ్యాక్రన్ విమర్శించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నెల క్రితం ఫ్రెంచ్ అధ్యక్షుడు మ్యాక్రాన్ ప్రధాని మోడీతో ఫోన్‌లో సంభాషించారు. 

Scroll to load tweet…

చైనాను కౌంటర్ చేయడానికి అమెరికా ఇన్నాళ్లు భారత్‌తో అనుయాయంగా కొనసాగింది. కానీ, తాజగా, ఆకస్ కూటమితో ఆస్ట్రేలియా వైపు చూపుసారించినట్టు అర్థమవుతున్నది. అదీగాక, ఆస్ట్రేలియాకు అణుజలాంతర్గామిని ఆఫర్ చేసింది. దాని ఫలితంగా ఫ్రాన్స్‌తో చేసుకున్న ఒప్పందాన్ని ఆస్ట్రేలియా అర్ధంతరంగా రద్దు చేసుకుంది. కనీసం మిత్రపక్షమని చూడకుండా ఫ్రాన్స్ ఒప్పందం రద్దు అయ్యేట్టు అమెరికా వ్యవహరించిందని ఫ్రాన్స్ రుసరుస లాడుతున్నది. ఈ నేపథ్యంలోనే భారత్‌కు ఇమ్మాన్యుల్ మ్యాక్రాన్ ఫోన్ చేసి మాట్లాడారు.

ప్రపంచ నేతలందరూ జీ20 ఫ్యామిలీ ఫొటోకూ పోజు ఇచ్చారు. ఈ తరుణంలో అందరూ ఒకరినొకరు పలుకరించుకుని మాట్లాడారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భౌతికంగా ఇక్కడ హాజరవ్వలేదు. కానీ, వీడియో లింక్ ద్వారా ప్రపంచ నేతలతో అనుసంధానంలోకి వచ్చారు.

Also Read: ఆఫ్ఘనిస్తాన్.. ఉగ్రవాదం.. డ్రగ్స్: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుల్ మ్యాక్రన్‌తో ప్రధానమంత్రి మోడీ సంభాషణ

Scroll to load tweet…

ఈ సమావేశానికి హాజరుకావడానికి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్‌తో గంటసేపు సమావేశమయ్యారు. అనంతరం ఇక్కడకు వచ్చారు. ఈ సమావేశం తర్వాత వచ్చే నెల 1వ, 2వ తేదీల్లో గ్లాస్గోలో జరగనున్న పర్యావరణ సంబంధించిన కార్యక్రమంలో పాల్గొననున్నారు.

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు(శనివారం) కాథలిక్ క్రైస్తవుల మత నాయకుడు పోప్ ఫ్రాన్సిస్‌తో సమావేశమయ్యారు. వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్ ప్రైవేటు లైబ్రరీలో ముఖాముఖిగా భేటీ అయ్యారు. షెడ్యూల్ ప్రకారం 20 నిమిషాలు సమావేశం కావాల్సి ఉంది. కానీ, గంట వరకు వీరిరువురు చర్చలు జరిపారు. ఈ సమావేశం హృదయపూర్వకంగా జరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన వ్యక్తిగత ట్విట్టర్‌ ఖాతాలో పోస్టు చేశారు. అనేక అంశాలపై పోప్ ఫ్రాన్సిస్‌తో మాట్లాడే అవకాశం దక్కిందని వివరించారు. భారత పర్యటనకు రావాల్సిందిగా పోప్ ఫ్రాన్సిస్‌ను ఆహ్వానించినట్టు ప్రధాని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెంట జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్‌లు ఉన్నారు.