Asianet News TeluguAsianet News Telugu

కేరళ సీఎం విజయన్‌కు అమిత్ షా ఫోన్: బాంబు పేలుళ్లపై ఆరా

కేరళ సీఎం పినరయి విజయన్ కు  కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా  ఇవాళ ఫోన్ చేశారు. కేరళలో బాంబు పేలుడు ఘటన గురించి ఆరా తీశారు.

  Amit Shah dials CM Pinarayi after Kalamassery explosion lns
Author
First Published Oct 29, 2023, 12:41 PM IST

న్యూఢిల్లీ: కేరళ సీఎం పినరయి విజయన్ కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదివారం నాడు ఫోన్ చేశారు.  కేరళలో  బాంబు పేలుడు ఘటనపై  కేరళ సీఎం విజయన్ తో  అమిత్ షా మాట్లాడారు.  బాంబు పేలుడు ఘటనకు సంబంధించి అమిత్ షా ఆరా తీశారు. బాంబు పేలుడు ఘటన గురించి  కేంద్ర మంత్రి సమీక్షించారు.  బాంబు పేలుడు  జరిగిన ప్రాంతానికి ఎన్ఎస్‌జీ చేరుకుంది. ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని దర్యాప్తును ప్రారంభించింది.

కేరళలోని ఓ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన   పేలుడు ఘటనపై  దర్యాప్తు నిర్వహిస్తున్నట్టుగా కేరళ సీఎం  పినరయి విజయన్ ప్రకటించారు.  ఈ ఘటన తీవ్రంగా కలిచివేసిందని ఆయన  ప్రకటించారు.  ఈ ఘటనకు బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని సీఎం తెలిపారు.  ఈ ఘటనకు సంబంధించి వివరాలను సేకరిస్తున్నామన్నారు. ఉన్నతాధికారులంతా ఎర్నాకుళంలోనే ఉన్నారని సీఎం తెలిపారు.సంఘటనస్థలానికి కేరళ డీజీపీ వెళ్తున్నారని విజయన్ చెప్పారు. ఈ ఘటనపై  డీజీపీతో మాట్లాడినట్టుగా  సీఎం తెలిపారు.  విచారణ తర్వాత  మరిన్ని విషయాలు బయటకు వస్తాయని  విజయన్ తెలిపారు.

మరో వైపు  సంఘటన స్థలంలో  సహాయక చర్యలను  మరింత ముమ్మరం చేసినట్టుగా కేరళ పరిశ్రమల శాఖ మంత్రి పి. రాజీవ్  చెప్పారు.ఇదిలా ఉంటే సంఘటన స్థలానికి కేరళ ఎటీఎస్ సహా పోలీసు ఉన్నతాధికారులు చేరుకున్నారు.ఇవాళ ఉదయం  ఓ కన్వెన్షన్ సెంటర్ లో వరుస పేలుళ్లు చోటు చేసుకున్నాయి.  ఈ ఘటనలో  ఓ మహిళ మృతి చెందారు.  20 మంది గాయపడ్డారు.

also read:కేరళలో బాంబు పేలుడు: ఒకరు మృతి, 20 మందికి గాయాలు

గాయపడిన వారిలో  ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కన్వెన్షన్ సెంటర్ లో ఇవాళ ఉదయం  తొమ్మిదిన్నర 10 గంటల మధ్య కాలంలో  పేలుడు చోటు చేసుకుంది. ఆ తర్వాత  సెకన్ల వ్యవధిలో  పేలుళ్లు చోటు చేసుకున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios