Asianet News TeluguAsianet News Telugu

మోడీ సలహాదారుగా అమిత్‌ ఖారే ... బీహార్ దాణా స్కామ్‌ని బయటపెట్టింది ఈయనే..!!

ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) సలహాదారుగా రిటైర్డ్ ఐఏఎస్‌ (IAS) అధికారి అమిత్‌ ఖారే (amit khare) నియమితులయ్యారు. 1990ల కాలంలో ఉమ్మడి బిహార్‌ రాష్ట్రంలో పశుసంవర్ధక శాఖలో డిప్యూటీ కమిషనర్‌గా పనిచేసిన సమయంలో దేశంలోనే సంచలనం సృష్టించిన దాణా కుంభకోణాన్ని (Fodder Scam) వెలుగులోకి తీసుకువచ్చి నిజాయితీగల అధికారిగా గుర్తింపు పొందారు.  

Amit Khare now in new role as PM Narendra Modis advisor
Author
Hyderabad, First Published Oct 12, 2021, 9:14 PM IST

ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) సలహాదారుగా రిటైర్డ్ ఐఏఎస్‌ (IAS) అధికారి అమిత్‌ ఖారే (amit khare) నియమితులయ్యారు. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా పనిచేసిన ఆయన గత నెలలో పదవీ విరమణ పొందారు. రెండేళ్ల కాంట్రాక్టుపై ఆయన పీఎంవోలో ప్రధాని సలహాదారుగా కొనసాగుతారని కేంద్ర సిబ్బంది, వ్యవహారాల మంత్రిత్వశాఖ (department of personnel and training) వెల్లడించింది.  పీఎంవోలో ప్రధానికి సలహాదారుగా అమిత్ నియామకానికి కేబినెట్‌ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ (cabinet appointment committee) ఆమోదం తెలిపింది. అమిత్‌ ఖారే 1985 బ్యాచ్‌ బిహార్ (bihar) క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. రాష్ట్ర/కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో పలు కీలక హోదాల్లో విధులు నిర్వర్తించారు.

Also Read:ఇండియన్ స్పేస్ అసోసియేషన్ ప్రారంభించిన ప్రధాని.. ‘ఖగోళ యుగంలో భారత్ వెనుకబడదు’

కాగా, అమిత్ ఖారే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం-2020 రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. అంతకుముందు 2018 మే నుంచి 2019 డిసెంబర్ వరకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ కార్యదర్శిగా పనిచేసిన సమయంలో (new it rules 2021) డిజిటల్ మీడియాకు (Digital media) సంబంధించి కేంద్రం తీసుకొచ్చిన కొత్త నిబంధనల రూపకల్పనలో ముఖ్య భూమిక పోషించారు. అంతకుముందు 1990ల కాలంలో ఉమ్మడి బిహార్‌ రాష్ట్రంలో పశుసంవర్ధక శాఖలో డిప్యూటీ కమిషనర్‌గా పనిచేసిన సమయంలో దేశంలోనే సంచలనం సృష్టించిన దాణా కుంభకోణాన్ని (Fodder Scam) వెలుగులోకి తీసుకువచ్చి నిజాయితీగల అధికారిగా గుర్తింపు పొందారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios