అమృత్ సర్ జోటా ఫాటక్ ట్రాక్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు తక్షణ సాయంగా రూ.3కోట్లు విడుదల చేయనున్నట్లు పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ ప్రకటించారు. రైలు ప్రమాదంంలో గాయపడిన క్షతగాత్రులను బాధితులను సీఎం పరామర్శించారు. బాధితులకు ధైర్యం చెప్పారు. అన్నివిధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. 

అమృత్‌సర్: అమృత్ సర్ జోటా ఫాటక్ ట్రాక్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు తక్షణ సాయంగా రూ.3కోట్లు విడుదల చేయనున్నట్లు పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ ప్రకటించారు. రైలు ప్రమాదంంలో గాయపడిన క్షతగాత్రులను బాధితులను సీఎం పరామర్శించారు. బాధితులకు ధైర్యం చెప్పారు. అన్నివిధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. 

మరోవైపు ఘోర రైలు ప్రమాదంపై పోలీస్ కమిషనర్ సారథ్యంలో మెజిస్టీరియల్ దర్యాప్తునకు ఆదేశిస్తున్నట్లు సీఎం అమరీందర్ సింగ్ తెలిపారు. నాలుగు వారాల్లోగా దర్యాప్తు నివేదిక ప్రభుత్వానికి అందించాలని సూచించారు. 

రైలు ప్రమాదంలో తొమ్మిది మంది మినహా అందర్నీ గుర్తించామని సీఎం అమరీందర్ సింగ్ తెలిపారు. 61మంది మృతి చెందగా, 57 మంది గాయపడ్డారని, సాధ్యమైనంత త్వరగా పోస్ట్‌మార్టం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

మరోవైపు అమృత్‌సర్ రైలు దుర్ఘటనలో ఇండియన్ రైల్వే బాధ్యత ఏమీ లేదని రైల్వే శాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. ప్రమాదంపై రైల్వే శాఖ ఎలాంటి దర్యాప్తు జరుపనుందని ప్రశ్నించగా రైళ్లు వేగంగానే వెళ్తుంటాయని జవాబిచ్చారు. ఈ ప్రమాదంలో రైల్వే శాఖ బాధ్యత లేదని సిన్హా స్పష్టం చేశారు. 

ఈ వార్తలు కూడా చదవండి

దసరా ఉత్సవాల విషయం తెలియదు: రైల్వే బోర్డు ఛైర్మెన్ అశ్విని లోహానీ

పంజాబ్ ప్రమాదం: 61 మంది మృతి, 72 మందికి గాయాలు

పంజాబ్ ప్రమాదం: ఘటనకు ముందే అక్కడి నుండి వెళ్లిపోయా: నవజ్యోత్ కౌర్

కళ్లెదుట ఘోరం జరిగినా పట్టించుకోని సిద్ధూ భార్య: స్థానికుల ఆగ్రహం

పంజాబ్ ప్రమాదం: సెల్ఫీల మోజులో పడి

పంజాబ్ రైలు ప్రమాదం: బాణసంచా పేలుళ్లే కారణమా?
పంజాబ్ లో ఘోర రైలు ప్రమాదం: 50 మందికి పైగా దుర్మరణం