Asianet News TeluguAsianet News Telugu

ప్రధానిగా మల్లికార్జున్ ఖర్గే లేదా రాహుల్ గాంధీ.. ఇండియా కూటమిపై ఎంపీ శశిథరూర్ కామెంట్లు

లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధిస్తే ప్రధానిగా మల్లికార్జున్ ఖర్గే లేదా రాహుల్ గాంధీని కాంగ్రెస్ ఎంచుకుంటుందని పార్టీ ఎంపీ శశిథరూర్ అన్నారు. కూటమి కాబట్టి, ఇతర పార్టీల అభిప్రాయాలూ ఉంటాయని చెప్పారు.
 

alliance bloc would choose mallikarjun kharge or rahul gandhi for prime minister post says shashi tharoor kms
Author
First Published Oct 17, 2023, 5:56 PM IST | Last Updated Oct 17, 2023, 5:56 PM IST

న్యూఢిల్లీ: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు శశిథరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ప్రధానమంత్రి ఎంపికలో కాంగ్రెస్ నుంచి మల్లికార్జున్ ఖర్గే లేదా రాహుల్ గాంధీ ఉంటారని అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో ఆశ్చర్యకర ఫలితాలు వస్తాయని ఆయన జోస్యం చెప్పారు. ఇండియా కూటమికి లోక్ సభ ఎన్నికల్లో గెలిసే అవకాశాలు మెండుగా ఉన్నాయని వివరించారు. బీజేపీని ఇండియా కూటమి ఓడించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందేనని అమెరికాలో మాట్లాడుతూ అన్నారు.

ఎన్నికల అనంతరం పరిణామాల అంచనాల గురించి శశిథరూర్ మాట్లాడారు. ‘నా ఆలోచనల ప్రకారం ఇది కూటమి కాబట్టి, ఫలితాలు వచ్చిన తర్వాత పార్టీలు అన్ని వారికి విశ్వాసమున్న వారిని ఎంచుకుంటారు. నా గెస్ ప్రకారం, కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే లేదా ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా ఎంచుకుంటారు. మల్లికార్జున్ ఖర్గేను ఎంచుకుంటే మన దేశ తొలి దళిత ప్రధానమంత్రిగా రికార్డ్ సృష్టిస్తారు’ అని శశిథరూర్ అన్నారు.

Also Read: కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ఐపీఎల్ టీమ్, మధ్యప్రదేశ్‌లో సంచలన హామీలు

హైద‌రాబాద్ లో విద్యార్థి ఆత్మహత్యపై కాంగ్రెస్ నేత కన్హయ్య  కుమార్ స్పందించారు. విద్యార్థిని ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని కాంగ్రెస్ నాయ‌కుడు కన్హయ్య కుమార్ అన్నారు. రాష్ట్రంలో విద్యార్థుల, యువకుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న వారి (ప్రవళిక) ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్  చేసిన ఆయ‌న‌.. ప్రేమ వ్య‌వ‌హారమంటూ ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌ని మండిప‌డ్డారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios