బీజేపీ కనక మహిళా బిల్లుపై ముందుకొస్తే.. మద్దతివ్వడానికి అన్ని పార్టీలు సిద్ధం.. ఎమ్మెల్సీ కవిత

మహిళా రిజర్వేషన్ల బిల్లును చట్టంగా చేయడానికి బీజేపీ ముందుకొస్తే అన్ని పార్టీలు మద్దతివ్వడానికి సిద్ధంగా ఉన్నాయని బీజేపీ ఎమ్మెల్సీ కవిత అన్నారు. 

All parties will support if BJP comes forward on Women's Bill says  MLC Kavitha - bsb

ఢిల్లీ : మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఢిల్లీ జంతర్ మంతర్ లో నేడు దీక్ష చేపట్టిన భారత జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత  రాజకీయాల్లో కూడా మహిళలకు సమచిత స్థానం దక్కాలని అన్నారు.  చాలాకాలంగా పెండింగ్లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించి చట్టంగా తీసుకురావాలని టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈ మేరకు నిరసన దీక్షలో ఆమె మాట్లాడారు. ఆకాశంలో సగం కాదని..  ధరణిలో సగం అవకాశాల్లోనూ సగం కావాలంటూ ఆమె వ్యాఖ్యానించారు. 

‘భారతీయ సంస్కృతిలోనే మహిళలకు పెద్దపీటవేశారు. అందుకే ఎక్కడైనా మహిళలనే ముందుగా ప్రస్తావిస్తాం. రాజకీయాల్లోనూ మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లు ఇవ్వాలని అంశం చాలా రోజులుగా పెండింగ్లో ఉంది. దేవి గౌడ ప్రధానమంత్రిగా ఉన్న 1996లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారు. అయితే ఇన్నేళ్లు గడుస్తున్న అది ఇంకా చట్టంగా మారలేదు. కేంద్రంలో పరిపాలనలో ఉన్న బిజెపి ప్రభుత్వానికి పూర్తిస్థాయి మెజారిటీ ఉంది. ఈ బిల్లు విషయంలో వారు కనుక చిత్తశుద్ధితో  ఉంటే..  మహిళా రిజర్వేషన్లు బిల్లును చట్టంగా  చేయాలని అనుకుంటే..  బిజెపి ముందుకు వస్తే..  అన్ని పార్టీలు దీనికి మద్దతు పలుకుతాయి.  మహిళా రిజర్వేషన్లను సాధించేవరకు ఈ పోరాటాన్ని ఆపేది లేదు’  అని కవిత అన్నారు.

మహిళా రిజర్వేషన్‌ ను తుంగలో తొక్కిన బీజేపీ: న్యూఢిల్లీలో కవిత దీక్షను ప్రారంభించిన ఏచూరి

ఢిల్లీ జంతర్ మంతర్లో ఎమ్మెల్సీ కవిత చేపట్టిన దీక్షకు వివిధ రాజకీయ పక్షాల నేతలు మద్దతు తెలిపాయి. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి దీక్షకు హాజరయ్యారు. బీఆర్ఎస్ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి,  సత్యవతి రాథోడ్, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, వెంకటేష్ నేత,  ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డిలతో పాటు మహిళా నేతలు పెద్ద ఎత్తున దీక్షకు హాజరై తమ సంఘీభావాన్ని తెలిపారు. దీక్ష నేపథ్యంలో సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి  సీతారాం ఏచూరి మాట్లాడారు. 

‘గత  30లుగా మహిళా బిల్లుపై చర్చ జరుగుతోందని అన్నారు.  ఎలాంటి వ్యవస్థ మనుగడ సాగించడానికి మహిళల భాగస్వామ్యం ఉండాలని తెలిపారు. ‘ఒకసారి మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకువచ్చాము కానీ.. అప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో అది సగంలోనే ఆగిపోయింది. ఈ సోమవారం నుంచి జరిగే పార్లమెంటు సమావేశాల్లో నైనా మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావాలి.  పంచాయితీల్లో మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తున్నప్పుడు చట్టసభల్లో ఎందుకు అమలు చేయకూడదు? ఎమ్మెల్సీ కవిత చేస్తున్న ఈ దీక్షకు.. చేపట్టిన ఉద్యమానికి మేము పూర్తిగా మద్దతు పలుకుతాం’  అని సీతారాం ఏచూరి తెలిపారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios