మహిళా రిజర్వేషన్ ను తుంగలో తొక్కిన బీజేపీ: న్యూఢిల్లీలో కవిత దీక్షను ప్రారంభించిన ఏచూరి
మహిళా రిజర్వేషన్ బిల్లుపై జరిగే పోరాటంలో తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని సీపీఎం ప్రకటించింది. న్యూఢిల్లీలో కవిత దీక్షను సీతారాం ఏచూరి దీక్షను ప్రారంభించారు.
హైదరాబాద్: మహిళా రిజర్వేషన్ బిల్లుకు తమ పార్టీ సంపూర్ణ మద్దతును ఇస్తుందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చెప్పారు.శుక్రవారంనాడు న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారత జాగృతి దీక్షను సీతారం ఏచూరి ప్రారంభించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే పెట్టాలని కోరుతూ కవిత నేతృత్వంలో ఇవాళ ఒక్క రోజు దీక్ష నిర్వహిస్తున్నారు.
ఈ దీక్షను ప్రారంభించిన తర్వాత ఏచూరి ప్రసంగించారు. మహిళా రిజర్వేషన్ కోసం చేసే పోరాటం లో తాము పాల్గొంటామని ఆయన హామీ ఇచ్చారు. ఎన్నో అడ్డంకుల తర్వాత మహిళా బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.మహిళా రిజర్వేషన్ బిల్లుపై బీజేపీ ఇచ్చిన హామీని తుంగలో తొక్కిందని ఆయన విమర్శించారు.
also read:రాజకీయాల్లో మహిళలకు సముచిత స్థానం దక్కాలి: ఢిల్లీ దీక్షలో కవిత
మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి 9 ఏళ్లు దాటిందని ఆయన చెప్పారు. కానీ ఇప్పటివరకు లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టని విషయాన్ని సీతారాం ఏచూరి ఈ సందర్భంగా ప్రస్తావించారు. సోమవారం నుండి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశ పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.