అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌లో జరిగిన ఘర్షణతో భారత్- చైనా సరిహద్దులలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఓ ప్రకటనను తెరపైకి తెచ్చారు

భారత్-చైనా సరిహద్దు వివాదం: అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌లో ఇటీవల భారత్, చైనా సైనికుల మధ్య వాగ్వివాదం జరిగినప్పటి నుంచి ఇరు దేశాల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. కాగా, చైనా అంశంపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు.

మీడియాతో ఒవైసీ మాట్లాడుతూ.. చైనాపై మోదీ ప్రభుత్వం చాలా మెతక వైఖరి అవలంబిస్తోందన్నారు. తవాంగ్‌తో పాటు ధోక్లామ్‌లో కూడా చైనా వంతెన నిర్మిస్తోందనీ, ఈ విషయంలో మోడీ ప్రభుత్వం బలహీనంగా ఉందనీ, సైన్యానికి ఆదేశాలు ఇచ్చి ఉంటే.. మన వీర సైన్యం వారిని ఏరివేసి ఉండేదని అన్నారు. 

ఈ ఏడాది వేసవికాలం నుంచి చైనా బలగాలు.. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం సరిహద్దు పాంత్రాలలో అన్ని ఒప్పందాలనూ ఉల్లంఘిస్తూ.. అక్రమణ చర్యలకు పాల్పడుతోందని, ఇరు దేశాల మధ్య ఘర్షణలు పదేపదే జరుగుతున్నాయనే ఓ వార్తను అసదుద్దీన్ ఒవైసీ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

డ్రాగన్ దేశం చైనా దుశ్చర్యలపై, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలపై పార్లమెంటులో చర్చించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అనేక విషయాలను దాచిపెడుతోందని, పార్లమెంటులో అన్ని వివరాలను తెలపాలని అన్నారు. చైనా దుశ్చర్యలపై మీడియాలో వచ్చిన వార్తలు నిజమైతే.. సరిహద్దులో నెలకొన్న సమస్యలు చాలానే ఉన్నాయని అన్నారు. అన్ని విషయాలపై కేంద్ర ప్రభుత్వం వాస్తవాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు.

దేశ ప్రజలను, పార్లమెంటును ప్రధాని మోడీ ప్రభుత్వం మభ్యపెట్టిందనీ, చైనా అక్రమ చర్యలపై నిజాలు చెప్పేందుకు కేంద్రం ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. చైనా దుశ్చర్యలను దాచిపెట్టడం వెనుక మోదీకి చేకూరుతున్న ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. తవాంగ్ ఘర్షణపై భారత్-చైనాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతపై అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ 1962 యుద్ధ సమయంలో పాకిస్థాన్ అంశం పార్లమెంటులో చర్చకు రావచ్చు, ముంబై దాడి తర్వాత చైనాపై చర్చ జరగవచ్చు కానీ ఎందుకు జరగకూడదు? అని ప్రశ్నించారు.

మైనారిటీల కోసం అమలు చేస్తున్న పథకాలపై ఎంఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను మూసేయాలని మోదీ ప్రభుత్వం భావిస్తోందని ఒవైసీ అన్నారు. ఇది కాకుండా.. కిషన్‌గంజ్‌లోని MMU సెంటర్‌పై విద్యా మంత్రి ప్రకటనకు సంబంధించి బిజెపి,కాంగ్రెస్ రెండింటిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

భారత వైమానిక దళ విన్యాసాలు 

చైనా , భారత్ సరిహద్దులో కొనసాగుతున్న ఉద్రిక్తత నేపథ్యంలో భారత వైమానిక దళం నేటి (డిసెంబర్ 15) నుండి రెండు రోజుల పాటు వైమానిక విన్యాసాలను చేయనున్నది. ఈ సైనిక విన్యాసాల్లో రాఫెల్, అపాచీ, సుఖోయ్-30 వంటి యుద్ధ విమానాలు పాల్గొనున్నాయి. భారత వైమానిక దళ విన్యాసాలు 48 గంటల పాటు కొనసాగుతాయి. చైనా సరిహద్దులో భారత వైమానిక దళం యుద్ధ విన్యాసాలు చేయనుంది.