పెళ్లి జరుగుతుండగా చోరీ కేసులో పెళ్లి కొడుకు అరెస్టు.. అన్నతో వధువు వివాహం
ఉత్తరప్రదేశ్‌లోని అలీగడ్‌లో పెళ్లి జరుగుతుండగా పోలీసులు పెళ్లి కొడుకును దొంగతనం కేసులో అరెస్టు చేసి తీసుకెళ్లారు. దీంతో ఉభయ కుటుంబాలు పోలీసు ఎదుట పడిగాపులు కాశాయి. చేసిన నేరాన్ని ఆ యువకుడు అంగీకరించాడు. ఆ వధువును పెళ్లి చేసుకోవడానికి వరుడి అన్నయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో ఆయనతో వధువు పెళ్లి జరిపించేశారు.

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అలీగఢ్‌లో పెళ్లికి సిద్ధమైన ఓ యువకుడిని పోలీసులు ఓ దొంగతనం కేసులో అరెస్టు చేశారు. పెళ్లి మండపంలో వరుడి కోసం వధువు వేచి చూస్తూ ఉన్నది. ఉభయ కుటుంబాలు పోలీసు స్టేషన్ ముందు వరుడి కోసం పడిగాపులు కాశారు. చివరికి వారంతా ఓ నిర్ణయానికి వచ్చారు. వధువును పెళ్లి చేసుకోవడానికి వరుడి అన్నయ్య అంగీకరించడంతో ఆయనతోనే పెళ్లి జరిపించేశారు.
అలీగడ్‌లో ఇరు కుటుంబాలు పెళ్లికి నిశ్చయించుకున్నారు. పెళ్లి మండపం సిద్ధమైంది. మరికాసేపట్లో పెళ్లి జరగాల్సి ఉన్నది. కానీ, ఇంతలో పోలీసులు వరుడిపై ఫోకస్ పెట్టారు. 35 క్రేట్ల లిక్కర్, ఇతర వస్తువులను ఓ వైన్ షాపు, క్యాంటీన్ నుంచి దొంగిలించిన కేసులో అతడిని అనుమానితుడిగా చూశారు.
ఇంటరాగేషన్ చేస్తుండగా పోలీసులు ఓ మోటార్ సైకిల్, మొబైల్ ఫోన్‌లను స్పాట్ నుంచి సీజ్ చేశారు. వాటి ఆధారంగా పోలీసులు వరుడికి చేరువయ్యారు. అతడిని అరెస్టు చేశారు. ఒక వైపు పెళ్లి మండపానికి వెళ్లేదుండగా.. పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తీసుకెళ్లారు. దొంగతనం కేసులో విచారించగా.. ఆ దొంగతనం కేసులో తన ప్రమేయం ఉన్నట్టు వరుడు, అనుమానితుడు అంగీకరించాడు. నిందితుడు లేదా నవవరుడి పేరు ఫైజల్‌గా గుర్తించారు.
Also Read: మేకప్ ఆర్టిస్ట్‌ను చంపేసిన బాయ్‌ఫ్రెండ్.. డెడ్‌బాడీని పడేయడానికి భార్య సహాయం
పెళ్లి కొడుకును అరెస్టు చేయడంతో ఉభయ కుటుంబాలు పోలీసు స్టేషన్ ఎదుట వచ్చి వాలాయి. మరోవైపు పెళ్లి కూతురు వరుడి కోసం పెళ్లి పీటలపై కూర్చొని ఎదురుచూస్తూ ఉన్నది. దీంతో ఆ వధువును పెళ్లి చేసుకోవడానికి వరుడి సోదరుడు అంగీకరించాడు. ఆయనతోనే ఆమె వివాహం జరిపించేశారు.