మేకప్ ఆర్టిస్ట్‌ను చంపేసిన బాయ్‌ఫ్రెండ్.. డెడ్‌బాడీని పడేయడానికి భార్య సహాయం
ముంబయి ఫిలిం ఇండస్ట్రీలో పని చేసే ఓ వ్యక్తి తన గర్ల్‌ఫ్రెండ్‌ను చంపేశాడు. ఆ డెడ్ బాడీని భార్య సహకారంతో పొరుగు రాష్ట్రం గుజరాత్‌లో ఓ చిన్న సెలయేటిలో పడేశాడు. బాధితురాలు రేప్ కేసు పెట్టడంతో నిందితుడు ఆగ్రహానికి గురై ఈ హత్యకు పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు.

ముంబయి: మహారాష్ట్రలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఫిలిం ఇండస్ట్రీలో పని చేసే 43 ఏళ్ల వ్యక్తి భార్య ఉండగానే మరో మహిళతో సహజీవనం చేశాడు. ఆమె కూడా ఫిలిం ఇండస్ట్రీలో మేకప్ ఆర్టిస్ట్‌గా పని చేసేది. ఆమె కొన్నాళ్ల క్రితం ఆయనపై రేప్ కేసు పెట్టింది. ఆ కేసును వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి తెచ్చాడు. కానీ, ఆమె తలొగ్గలేదు. దీంతో ఆమెను చంపేశాడు. ఈ ఘటన ముంబయిలో ఆగస్టు 9, 12వ తేదీల మధ్య చోటుచేసుకుంది.
28 ఏళ్ల యువతి మృతదేహం పొరుగు రాష్ట్రం గుజరాత్‌లోని వల్సద్‌లో ఓ చిన్న సెలయేరులో సూట్ కేసులో ప్యాక్ చేసి కనిపించింది. యాక్సిడెంట్ డెత రిపోర్ట్‌గా గుజరాత్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ డెడ్ బాడీని క్లెయిమ్ చేసుకుంటూ ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆమె అంత్యక్రియలను పోలీసులే నిర్వహించారు. ప్రాథమిక విచారణ ప్రకారం, ఆమెను నీటిలో ముంచి చంపేసినట్టు తేలింది. ఆమె డెడ్ బాడీని సూట్‌కేసులో బంధించి ఓ సెలయేటిలో పడేశారు.
Also Read: Sugar Price: నాలుగేండ్ల కనిష్టానికి పడిపోయిన ఉత్పత్తి.. భారీగా పెరగనున్న చక్కెర ధరలు
నిందితుడు వసాయ్‌ని నగరంలో మంగళవారం అరెస్టు చేసినట్టు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసు పద్మజ బడే అని వివరించారు. బాధితురాలి కుటుంబం నైగావ్ పోలీసు స్టేషన్‌లో ఆగస్టు 14న మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు.
బాధితురాలు నిందితుడిపై రేప్ కేసు పెట్టింది. ఆ కేసు వాపసు తీసుకోవాలని నిందితుడు ఒత్తిడి తెచ్చాడు. దీంతో ఆగ్రహంతో నిందితుడు ఆమెను చంపేశాడు. ఆమె డెడ్ బాడీని పడేయడంలో నిందితుడి భార్య కూడా సహకరించినట్టు తెలిసింది.
నిందితుడిపై మిరా బయందర్ వసాయ్ విరార్ పోలీసు పరిధిలో ఆయనపై ఆత్మహత్యకు ప్రేరేపించిన ఆరోపణల కింద కేసు నమోదైంది.