Asianet News TeluguAsianet News Telugu

ఎయిర్ హోస్టెస్ పై అత్యాచారం, నిందితుడిని గదిలో పెట్టి తాళం వేసిన బాధితురాలు..

తనపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని.. రూంలోపెట్టి తాళం వేసి.. పోలీసులకు ఫోన్ చేసింది ఓ అత్యాచార బాధితురాలు. నిందితుడు, ఖాన్‌పూర్ నివాసి అయిన హర్జీత్ యాదవ్ గా గుర్తించారు.

Airhostess Locks Man Who Raped Her At Her House, Dialed 112 says Delhi Police
Author
First Published Sep 27, 2022, 10:32 AM IST

న్యూఢిల్లీ : ఢిల్లీలో ఎయిర్ హోస్టెస్ పై అత్యాచార ఘటన కలకలం రేపింది. దక్షిణ ఢిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో  ఎయిర్ హోస్టెస్‌ కు పరిచయస్తులే ఆమె మీద.. ఆమె ఇంట్లోనే.. అత్యాచారానికి పాల్పడ్డారని సోమవారం పోలీసులు తెలిపారు. నిందితుడు, ఖాన్‌పూర్ నివాసి అయిన హర్జీత్ యాదవ్, ఆ ప్రాంతానికి చెందిన రాజకీయ పార్టీ బ్లాక్ ప్రెసిడెంట్. అతడిని అరెస్టు చేసినట్లు వారు తెలిపారు.

ఆదివారం మెహ్రౌలీ పోలీస్ స్టేషన్‌లో అత్యాచారానికి సంబంధించి పిసిఆర్ కాల్ వచ్చిందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సౌత్) చందన్ చౌదరి తెలిపారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితురాలు పోలీసులకు జరిగిన విషయాన్ని తెలుపుతూ నిందితుడు హర్జీత్ యాదవ్ గా పేర్కొంది. అతను తనకు గత నెలన్నరగా పరిచయం అని తెలిపింది. నిందితుడు మద్యం మత్తులో తన ఇంటికి వచ్చి అత్యాచారం చేశాడని బాధితురాలు పేర్కొంది. 

చండీగఢ్ యూనివర్శిటీ ఎంఎంఎస్ కుంభకోణం : నిందితురాలితో ఆర్మీ జవాన్ డేటింగ్...

30 ఏళ్ల బాధితురాలైన మహిళ నిందితుడిని గదిలో బంధించి.. 112కు కాల్ చేసిందని పోలీసులు తెలిపారు. ఆమె వాంగ్మూలం ఆధారంగా, ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సెక్షన్‌లు 376 (అత్యాచారం), 323 (స్వచ్ఛందంగా గాయపరచడం), 509 (మహిళను కించపరిచే మాట, సంజ్ఞ లేదా చర్య), 377 (అసహజ నేరాలు) కింద కేసు నమోదు చేశామని తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు డీసీపీ తెలిపారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios