Asianet News TeluguAsianet News Telugu

చండీగఢ్ యూనివర్శిటీ ఎంఎంఎస్ కుంభకోణం : నిందితురాలితో ఆర్మీ జవాన్ డేటింగ్...

చడీగఢ్ యూనివర్సిటీ ఎంఎంఎస్ కుంభకోణంలో ప్రధాన నిందితురాలైన యువతి..అరెస్టైన ఆర్మీ జవాన్ తో ప్రేమలో ఉన్నట్టు తేలింది. 

Woman who filmed Chandigarh students was dating arrested Army man
Author
First Published Sep 27, 2022, 10:10 AM IST

చండీగఢ్ యూనివర్శిటీ ఎంఎంఎస్ కుంభకోణానికి సంబంధించి అరుణాచల్ ప్రదేశ్‌లో అరెస్టయిన ఆర్మీ మ్యాన్ సంజీవ్ సింగ్, హాస్టల్‌లో మహిళల స్నానం చేసే వీడియోలు తీస్తున్నవిద్యార్థినితో ప్రేమలో ఉన్నాడు. ఇక సింగ్ నిందితుడితో తనకు ఎలా పరిచయం, సంబంధాన్ని మొహాలి పోలీసులకు చెప్పినట్లు సమాచారం. ఆర్మీ యువకుడు, నిందితురాలికి సోషల్ మీడియాలో కలుసుకున్నారు. ఆ తరువాత మొబైల్ ఫోన్ నంబర్లను మార్చుకున్నారని సమాచారం. నిందితుడు సంజీవ్ సింగ్‌ కు కూడా వీడియోలను షేర్ చేశాడా? లేదా? అనేది ఇంకా తెలియలేదు. సంజీవ్‌ రెండు మొబైల్‌ ఫోన్లను పోలీసులు గుర్తించారు.

సంజీవ్‌ను పోలీసులు ఎలా పట్టుకున్నారంటే.. 
నిందితురాలైన ఎంబీఏ విద్యార్థిని  ఫొటోలు తీస్తూ పట్టు బడడంతో..  హాస్టల్ మేనేజర్ ఆమెను విచారించారు. ఆ విచారణతో ఆమెకు నిత్యం ఎవరికో మెసేజ్‌లు పంపుతున్నట్లు తేలింది. తర్వాత, వాట్సాప్ చాట్‌ పరిశీలిస్తే ఆమె సంజీవ్ సింగ్‌తో చాట్ చేస్తున్నట్లు వెల్లడయ్యింది. సంజీవ్ సింగ్ తనను వీడియోలు, ఫోటోలను పంపమని అడిగాడని తెలిపింది. వీడియోలు తీయాలని తన మీద ఒత్తిడి ఉందని ఆ చాట్ లో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. అంతేకాదు, ఇలా వీడియోలు, ఫొటోలు తీయమని, పంపమని ఒత్తిడి చేయడం వల్ల తనను చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెడుతున్నావంటూ ఆమె సంజీవ్‌తో చెప్పింది. ఆ మహిళ, తన ఫోన్ కాంటాక్ట్‌లో, సంజీవ్ సింగ్ నంబర్‌ను చేయడానికి రాంకజ్ వర్మ ఫోటోతో సేవ్ చేసింది. 

పీఎఫ్ఐపై కొనసాగుతున్న ఎన్ఐఏ, ఈడీ సోదాలు: ఎనిమిది రాష్ట్రాల్లో ఏక కాలంలో దాడులు

 బెయిల్ కోరిన రాంకజ్ వర్మ..
ఈ కేసులో మరో నిందితుడు రాంకజ్ వర్మ, తాను నిర్దోషినని, నిందితురాలు, సిమ్లాకు చెందిన ఆమె ప్రియుడు సన్నీ మెహతా తనకు తెలియదని పేర్కొన్నాడు. తనకు బెయిల్ ఇవ్వాలంటూ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తన డిపి కారణంగానే పోలీసులు తనను పట్టుకున్నారని, తన తప్పేమీ లేదని రాంకజ్ పోలీసులకు తెలిపాడని అతని సోదరుడు పంకజ్ మీడియాకు తెలిపారు.

బాలిక, ఆమె ప్రియుడు, అతని స్నేహితుడు రంకజ్‌ల పోలీసు రిమాండ్ నేటితో ముగియనుంది. మొబైల్ ఫోన్‌లు, అమ్మాయి ల్యాప్‌టాప్ లను ఫోరెన్సిక్ టెస్ట్ కోసం పంపిన పోలీసులు రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆమె వీడియోలను, ఫోటోలను తీసిందా, లేదా అనేది ఈ రిపోర్టులో తేలనుంది.

చండీగఢ్ యూనివర్శిటీ వీడియో లీక్ కేసు
సెప్టెంబరు 18న, యూనివర్సిటీ హాస్టల్ లో ఉంటున్న మహిళల ప్రైవేట్ వీడియోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఈ విషయాన్ని విద్యార్థులు ఆరోపించడంతో చండీగఢ్ యూనివర్సిటీ క్యాంపస్ లోపల భారీగా నిరసనలు చెలరేగాయి. ఈ కేసులో పంజాబ్ పోలీసులు ఇప్పటివరకు నలుగురిని అరెస్టు చేశారు. అందిన ప్రకారం, సన్నీ మెహతా, రాంకజ్ వర్మ ఇతర విద్యార్థుల స్నానం చేసే వీడియోలు తీయకపోతే నిందితురాలైన మహిళ ప్రైవేట్ వీడియోలను లీక్ చేస్తానని బెదిరించారని ఆరోపించారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios