Asianet News TeluguAsianet News Telugu

అల్లర్లు వెంటనే నిలిపివేయాలి: జామీయా విద్యార్థుల లాఠీఛార్జీపై సుప్రీం

ఢిల్లీలోని జామీయా యూనివర్శిటీ విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జీపై మంగళవారం నాడు విచారణ చేస్తామని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.

"Rioting Must Stop": Top Court Hearing Tomorrow On Crackdown On Students
Author
New Delhi, First Published Dec 16, 2019, 11:42 AM IST


న్యూఢిల్లీ: అల్లర్లు వెంటనే నిలిపివేయాలని  సుప్రీంకోర్టు  జామీయ యూనివర్శిటీ విద్యార్థులకు సూచించింది.పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జామీయా యూనివర్శిటీ విద్యార్థులు, యూపీలోని అలీఘడ్ యూనివర్శిటీ విద్యార్థుల ఆందోళనలపై సుప్రీంకోర్టు సోమవారం నాడు స్పందించింది. 

పౌరసత్వ సవరణ బిల్లును నిరసిస్తూ ఆందోళన చేసిన విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జీ చేశారు.ఈ విషయమై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌‌ను మంగళవారం నాడు విచారణ చేయనున్నట్టు సుప్రీంకోర్టు ప్రకటించింది. 

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే  ఈ విషయమై తీవ్రంగా స్పందించారు. ఈ పిటిషన్‌ను విచారణ చేసేందుకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే నిరాకరించారు. విద్యార్థులపై లాఠీచార్జీని నిరసిస్తూ ఇందిరా జయ్‌సింగ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.

వచ్చ ఏడాది జనవరి 5వ తేదీ వరకు జామీయా యూనివర్శిటీకి సెలవులు ప్రకటించారు.  నిరసనల పేరుతో ప్రజా ధనాన్ని వృధా చేయడం సరైంది కాదని  సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే అభిప్రాయపడ్డారు. తొలుత జామీయా యూనివర్శిటీలో శాంతి నెలకొనాల్సిన అవసరం ఉందని  సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే అభిప్రాయపడ్డారు.

శాంతియుత నిరసనలకు తాము వ్యతిరేకం కాదని  సుప్రీంకోర్టు  స్పష్టం చేసింది. పోలీసుల తీరు వల్లే హింసాత్మక ఘటనలు చోటు చేసుకొన్నాయని విద్యార్థి సంఘాలు చెబుతున్నాయి. బస్సులకు తాము నిప్పు పెట్టలేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.


 

Follow Us:
Download App:
  • android
  • ios