లక్నో: తాను కోరుకొన్న ఉద్యోగం దక్కదనే నిరాశతో ఓ యువకుడు  ఫేస్‌బుక్‌ లైవ్‌ లో ఉరేసుకొని  ఆత్మహత్య చేసుకొన్నాడు.  అయితే ఫేస్‌బుక్  లైవ్‌లో సుమారు 2 వేల మంది ఈ ఆత్మహత్యకు ప్రత్యక్షంగా వీక్షించారు. కానీ, ఏ ఒక్కకూడ కూడ  ఆత్మహత్య చేసుకోకూడదని వారించలేదు. 

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాకు చెందిన 24 ఏళ్ల మున్నా అనే  యువకుడికి  ఆర్మీలో  ఉద్యోగం సంపాదించడం జీవితాశయం.  అయితే ఆర్మీలో చేరేందుకు  స్థానికంగా నిర్వహించే ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో  పాల్గొనేందుకు ప్రయత్నించాడు. అయితే  కానీ, తన చదువు, వయస్సు మాత్రం ఆర్మీలో చేరేందుకు సరిపోవని తేలింది.

దీంతో తీవ్ర నిరాశకు గురైన  మున్నా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకొన్నాడు.భారత ఆర్మీలో చేరాలనుకొన్నాను... కానీ, తనకు ఆర్మీలో ఉద్యోగం దక్కే అవకాశం లేనందున  తాను  ఆత్మహత్య చేసుకోవాలనుకొంటున్నానని చెబుతూ ఫేస్‌బు్ లైవ్ స్ట్రీమింగ్ ఆన్ చేసి  ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

మున్నా ఫేస్ బుక్ లైవ్ స్ట్రీమింగ్ చేసే సమయంలో  2 వేల మంది  ప్రత్యక్షంగా వీక్షించారు. అయితే ఎవరూ  కూడ మున్నాను ఆత్మహత్య  చేసుకోకూడదని ఆపలేదు.కనీసం పోలీసులు, కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వలేదు.

మున్నా వద్ద ఆరుపేజీల సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.  ఆర్మీలో ఉద్యోగం సాధించలేకపోయినందు వల్లే  ఆత్మహత్యకు పాల్పడినట్టుగా ఆయన ఆ లేఖలో పేర్కొన్నాడు. అయితే భగత్ సింగ్‌ను మున్నా రోల్ మోడల్‌గా భావించేవాడని కుటుంబసభ్యులు చెప్పారు. అయితే మున్నా  ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.