అగ్నిపథ్ పథకంపై చెలరేగిన నిరసనలు, హింసాత్మక ఘటనలపై విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. జాతీయ భద్రత, సైన్యంపై అగ్నిపథ్ పథకం ప్రభావాన్ని పరిశీలించేలా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జీ అధ్యక్షతన నిపుణుల కమిటీని ఏర్పాటు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా తీసుకొచ్చిన అగ్నిప‌థ్ ప‌థ‌కంపై నిర‌స‌న‌లు కొన‌సాగుతున్నాయి. ఈ నిర‌స‌న‌లు హింసాత్మ‌కంగా మారుతున్నాయి. సికింద్రాబాద్ ప్రాంతంలో జ‌రిగిన ఆందోళ‌న‌ల్లో ఒక‌రు చ‌నిపోయారు. ప‌లు రాష్ట్రాల్లో రైళ్ల‌ను త‌గులబెట్టారు. రోడ్ల‌ను బ్లాక్ చేశారు. పోలీసుల‌పై రాళ్లు రువ్వారు. రోడ్ల‌పై టైర్ల‌ను త‌గుల‌బెట్టారు. వాహ‌నాలకు నిప్పుపెట్టారు. ఈ ఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది. 

అగ్నిపథ్ నియామక పథకంపై చెల‌రేగిన హింస‌పై విచారించడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ను ఏర్పాటు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో శ‌నివారం పిటిషన్ దాఖలైంది. అగ్నిపథ్ కు వ్యతిరేకంగా నిరసనల సందర్భంగా ప్రభుత్వ ఆస్తులకు జరిగిన నష్టాన్ని విచారించేలా కోర్టు ఆదేశించాలని పిటిషన‌ర్ కోరారు. 

పుల్వామాలో మరో పోలీసులు హ‌త్య‌.. పొలాల్లో క‌నిపించిన మృత‌దేహం

జాతీయ భద్రత, సైన్యంపై ఈ పథకం ప్రభావాన్ని పరిశీలించడానికి రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అధ్యక్షతన నిపుణుల కమిటీని ఏర్పాటు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో కోరారు. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ గ‌త మంగళవారం ప్రకటించిన ఈ అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా జ‌రిగిన అల్ల‌ర్ల, నిర‌స‌న‌ల నేప‌థ్యంలో ఈ పిటిష‌న్ దాఖ‌లైంది. కాగా నిర‌స‌న‌కారులు బీహార్, ఉత్తరప్రదేశ్, తెలంగాణతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఆస్తులను ధ్వంసం చేశారు. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్న విధంగానే ఈ పథకాన్ని ఉపసంహరించుకోవాలని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి.

Coronavirus: దేశంలో 13 వేలు దాటిన క‌రోనా కొత్త కేసులు.. పెరిగిన మ‌ర‌ణాలు !

రైల్వే ఆవరణలో జరిగిన విధ్వంసకర ఘటనలతో రూ.200 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని అధికారిక వ‌ర్గాలు తెలిపాయి. 50 రైలు బోగీలు, 5 ఇంజిన్లు పూర్తిగా కాలిపోయాయి. ప్లాట్ ఫార్మ్స్, కంప్యూటర్లు, వివిధ సాంకేతిక భాగాలు దెబ్బతిన్నాయి. ఈ అల్ల‌ర్ల వ‌ల్ల ప‌లు రైలు సేవ‌ల‌కు కూడా నిలిచిపోయాయి. అయితే కేంద్రంతో పాటు రక్షణ దళాలు ఈ పథకాన్ని సమర్థించాయి. ఈ ప‌థ‌కం కింద మూడు ద‌ళాల్లో నాలుగేళ్ల పాటు యువ‌త‌ను రిక్రూట్ చేసుకుంటారు. ఇందులో రిక్రూట్ అయిన అభ్య‌ర్థుల‌ను అగ్నివీర్స్ అని పిలుస్తారు. ఇలా నాలుగేళ్ల పాటు సైన్యంలో సేవ‌లందించిన అగ్నీవ‌ర్స్ లో 25 శాతం మందిని రెగ్యులర్ గా తీసుకుంటారు. మిగిలిన 75 శాతం అగ్నివీర్ లను పాక్యేజీ ఇచ్చి పంపించేస్తారు. అయితే వీరు ఇంటికి వ‌చ్చిన త‌రువాత వివిధ సంస్థ‌లు రిక్రూట్ చేసుకోవ‌డానికి ఆస‌క్తి క‌న‌బ‌రుస్తాయి. 

ఈ దేశాల్లో పుట్టిన ప్ర‌తీ ఒక్క‌రూ సైన్యంలో చేరాల్సిందే.. ఎందుకంటే ?

ఈ అగ్నిప‌థ్ స్కీమ్ ద్వారా 17.5 నుంచి 21 సంవత్సరాల మధ్య వయస్సు గల యువకులను త్రివిధ ద‌ళాల్లో స‌ర్వీసుల్లోకి తీసుకుంటారు. వీరికి ఆరు నెలల శిక్షణ కాలం ఉంటుంది. దీని ద్వారా మ‌హిళ‌లు, పురుషుల‌ను ఇద్ద‌రినీ రిక్రూట్ చేసుకుంటారు. ఈ అభ్యర్థులు నెలకు మొత్తం అల‌వెన్సుల‌తో క‌లుపుకొని రూ. 30 నుంచి 40 వేల రూపాయిల జీతం అందుతుంది. 90 రోజుల్లో అగ్నివీర్లను నియమించేందుకు రిక్రూట్‌మెంట్ ర్యాలీల నిర్వ‌హించేందుకు ప్ర‌భుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈ ఏడాది 46,000 మంది సైనికులను ఈ పథకం కింద నియమించుకోనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇందులో ఆర్మీలో 40,000 మంది, వైమానిక దళంలో 3,000, నేవీలో 3,000 మందిని రిక్రూట్ చేసుకోవాల‌ని భావిస్తోంది.