కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గతంలో రైతులను అవమానించిందని, ఇప్పుడు సైనికులను అవమానించిందని కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. నల్ల వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్నట్టుగానే అగ్నిపథ్ ను కూడా వెనక్కి తీసుకోవాలని కోరారు. 

కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీ విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్న మదిరిగానే, యువకుల డిమాండ్ ను అంగీకరించి అగ్నిపథ్ ను కూడా వెనక్కి తీసుకోవాలని కోరారు. ఎనిమిదేళ్లుగా వ‌రుస‌గా బీజేపీ ప్ర‌భుత్వం ‘జై జవాన్, జై కిసాన్’ విలువలను అవమానించిందని ఆరోపించారు. ‘‘ నల్ల వ్యవసాయ చట్టాలను ప్రధాని ఉపసంహరించుకోవాలని నేను ఇంతకుముందు కూడా చెప్పాను. అదే విధంగా ఆయ‌న ‘మాఫీవీర్’గా మారడం ద్వారా దేశంలోని యువత డిమాండ్‌ను అంగీకరించాలి. అగ్నిపథ్ పథకాన్ని వెనక్కి తీసుకోవలసి ఉంటుంది’’ అని ఆయన హిందీలో ట్వీట్ చేశారు. 

అగ్నిపథ్ ప‌థ‌కాన్ని వెన‌క్కి తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తూ చేప‌ట్టిన నిర‌స‌న‌ల్లో తెలంగాణలోని సికింద్రాబాద్‌లో ఒక ఆందోళ‌న‌కారుడు చ‌నిపోయాడు. ఈ సంద‌ర్భంగా దేశంలోని అనేక ప్రాంతాల్లో హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు చెల‌రేగాయి. ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాలపై దాడి జ‌రిగింది. అనేక రాష్ట్రాల్లోని రైల్వే స్టేషన్లు, హైవేలు యుద్ధభూమిగా మారాయి.

Agnipath : హింసాత్మక నిరసనలపై విచార‌ణ జ‌రిపించాలని సుప్రీంకోర్టులో పిటిష‌న్

మంగళవారం ఈ పథకాన్ని కేంద్ర ప్ర‌భుత్వం ప్రారంభించింది. ఇండియ‌న్ ఆర్మీ, ఇండియ‌న్ నేవీ, ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ల ఆధ్వ‌ర్యంలో కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ ప‌థ‌కాన్ని లాంచ్ చేశారు. ఈ ప‌థ‌కం కింద మూడు ద‌ళాల్లో నాలుగేళ్ల పాటు యువ‌త‌ను రిక్రూట్ చేసుకుంటారు. ఇందులో రిక్రూట్ అయిన అభ్య‌ర్థుల‌ను అగ్నివీర్స్ అని పిలుస్తారు. ఇలా నాలుగేళ్ల పాటు సైన్యంలో సేవ‌లందించిన అగ్నీవ‌ర్స్ లో 25 శాతం మందిని రెగ్యులర్ గా తీసుకుంటారు. మిగిలిన 75 శాతం అగ్నివీర్ లను పాక్యేజీ ఇచ్చి పంపిస్తారు. అయితే వీరు ఇంటికి వ‌చ్చిన త‌రువాత వివిధ సంస్థ‌లు రిక్రూట్ చేసుకోవ‌డానికి ఆస‌క్తి క‌న‌బ‌రిచే అవ‌కాశం ఉంది. 

ఈ దేశాల్లో పుట్టిన ప్ర‌తీ ఒక్క‌రూ సైన్యంలో చేరాల్సిందే.. ఎందుకంటే ?

ఈ అగ్నిప‌థ్ స్కీమ్ ద్వారా 17.5 నుంచి 21 సంవత్సరాల మధ్య వయస్సు గల యువకులను త్రివిధ ద‌ళాల్లో స‌ర్వీసుల్లోకి తీసుకుంటారు. వీరికి ఆరు నెలల శిక్షణ కాలం ఉంటుంది. దీని ద్వారా మ‌హిళ‌లు, పురుషుల‌ను ఇద్ద‌రినీ రిక్రూట్ చేసుకుంటారు. ఈ అభ్యర్థులు నెలకు మొత్తం అల‌వెన్సుల‌తో క‌లుపుకొని రూ. 30 నుంచి 40 వేల రూపాయిల జీతం అందుతుంది. 90 రోజుల్లో అగ్నివీర్లను నియమించేందుకు రిక్రూట్‌మెంట్ ర్యాలీల నిర్వ‌హించేందుకు ప్ర‌భుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈ ఏడాది 46,000 మంది సైనికులను ఈ పథకం కింద నియమించుకోనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇందులో ఆర్మీలో 40,000 మంది, వైమానిక దళంలో 3,000, నేవీలో 3,000 మందిని రిక్రూట్ చేసుకోవాల‌ని భావిస్తోంది. 

పుల్వామాలో మరో పోలీసులు హ‌త్య‌.. పొలాల్లో క‌నిపించిన మృత‌దేహం

అయితే ఈ ప‌థ‌కం అభ్య‌ర్థుల్లో ఆందోళ‌న నెల‌కొన‌డంతో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అగ్నివీర్​ తొలి బ్యాచ్​ వారికి.. గరిష్ఠ వయో పరిమితిలో మొత్తం ఐదేళ్లు సడలింపు కల్పించనున్నట్టుగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అంతే కాకుండా సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్, అస్సాం రైఫిల్స్‌లో 'అగ్నివీర్'లకు 10 శాతం రిజర్వేషన్లను కల్పించనున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రెండు పారామిలటరీ బలగాలలో రిక్రూట్‌మెంట్ కోసం అగ్నివీర్‌లకు నిర్దేశించిన గరిష్ట వయోపరిమితి కంటే మూడేళ్ల వయోపరిమితి సడలింపును కూడా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది.