పోలీసు శాఖ, దాని అనుభంధ శాఖల్లో రిక్రూట్ మెంట్ నిర్వహించినప్పుడు అగ్నిపథ్ పథకం కింద దేశానికి సేవలందించి వచ్చిన అగ్నివీర్స్ కు ప్రాధాన్యత ఇస్తామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కూడా  సీఏపీఎఫ్, అస్సాం రైఫిల్స్ భర్తీలో ప్రాధాన్యత ఇస్తామని బుధవారం ప్రకటించింది. 

పోలీసు డిపార్ట్ మెంట్స్ లో జ‌రిగే రిక్రూట్ మెంట్ల‌లో అగ్నివీర్స్ కు ప్రాధాన్య‌త ఇస్తామ‌ని యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ హామీ ఇచ్చారు. ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్ట‌ర్ లో పోస్ట్ చేశారు. ‘‘ ప్రధాని ఆకాంక్షలకు అనుగుణంగా ‘అగ్నిపథ్’ పథకం యువతను దేశానికి, సమాజానికి సేవ చేయడానికి సంసిద్ధం చేస్తుంది. వారికి గర్వించదగిన భవిష్యత్తుకు అవకాశం కల్పిస్తుంది’’ అని సీఎం ట్వీట్ చేశారు. నాలుగేళ్ల పాటు అగ్నివీర్స్ గా ప‌ని చేసి తిరిగి వ‌చ్చిన వారికి పోలీసు, పోలీసు అనుబంధ దళాలలో ప్రాధాన్యత ఇస్తామని ఆయన ప్రకటించారు.

Coronavirus: మ‌ళ్లీ పెరుగుతున్న క‌రోనా కేసులు.. మ‌ర‌ణాలు !

కేంద్ర ప్ర‌భుత్వం రెండు రోజుల కింద‌ట అగ్నిప‌థ్ ప‌థ‌కం ప్రారంభించింది. ఇండియ‌న్ ఆర్మీ, ఇండియ‌న్ నేవీ, ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ల ఆధ్వ‌ర్యంలో కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ ప‌థ‌కాన్ని లాంచ్ చేశారు. ఈ ప‌థ‌కం కింద మూడు ద‌ళాల్లో నాలుగేళ్ల పాటు యువ‌త‌ను రిక్రూట్ చేసుకుంటారు. ఇందులో రిక్రూట్ అయిన అభ్య‌ర్థుల‌ను అగ్నివీర్స్ అని పిలుస్తారు. ఇలా నాలుగేళ్ల పాటు సైన్యంలో సేవ‌లందించిన అగ్నీవ‌ర్స్ లో 25 శాతం మందిని రెగ్యులర్ గా తీసుకుంటారు. మిగిలిన 75 శాతం అగ్నివీర్ లను పాక్యేజీ ఇచ్చి పంపించేస్తారు. అయితే వీరు ఇంటికి వ‌చ్చిన త‌రువాత వివిధ సంస్థ‌లు రిక్రూట్ చేసుకోవ‌డానికి ఆస‌క్తి క‌న‌బ‌రుస్తాయి. 

పెళ్లైన 8 ఏళ్లకు మళ్ళీ పెళ్లి.. భార్యకు ఓ భర్త అరుదైన బహుమతి.. ఎలాగంటే...

ఈ అగ్నిప‌థ్ స్కీమ్ ద్వారా 17.5 నుంచి 21 సంవత్సరాల మధ్య వయస్సు గల యువకులను త్రివిధ ద‌ళాల్లో స‌ర్వీసుల్లోకి తీసుకుంటారు. వీరికి ఆరు నెలల శిక్షణ కాలం ఉంటుంది. దీని ద్వారా మ‌హిళ‌లు, పురుషుల‌ను ఇద్ద‌రినీ రిక్రూట్ చేసుకుంటారు. ఈ అభ్యర్థులు నెలకు మొత్తం అల‌వెన్సుల‌తో క‌లుపుకొని రూ. 30 నుంచి 40 వేల రూపాయిల జీతం అందుతుంది. 90 రోజుల్లో అగ్నివీర్లను నియమించేందుకు రిక్రూట్‌మెంట్ ర్యాలీల నిర్వ‌హించేందుకు ప్ర‌భుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈ ఏడాది 46,000 మంది సైనికులను ఈ పథకం కింద నియమించుకోనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇందులో ఆర్మీలో 40,000 మంది, వైమానిక దళంలో 3,000, నేవీలో 3,000 మందిని రిక్రూట్ చేసుకోనుంది. 

Agnipath: 'అగ్నిప‌థ్' పై ఆర్మీ అభ్య‌ర్థుల‌ ఆగ్ర‌హం.. దేశంలోని ప‌లు ప్రాంతాల్లో ఉద్రిక్త‌త !

ఈ పథకం ప్రారంభం అయిన ఒక రోజు తరువాత హోం మంత్రి అమిత్ షా కార్యాలయం అగ్నిప‌థ్ ను ‘‘దార్శనికమైనది’’ అని పిలిచింది. దేశ యువత ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించింది. ఈ నేపథ్యంలో సీఏపీఎఫ్, అస్సాం రైఫిల్స్ నియామకాల్లో ఈ పథకం కింద నాలుగేళ్లు పూర్తి చేసుకున్న అగ్నివీర్లకు ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ నిర్ణయంపై వివరణాత్మక ప్రణాళికా పని ప్రారంభమైంది అని కూడా పేర్కొంది. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్, అస్సాం, హర్యానా ముఖ్యమంత్రులు కూడా రాష్ట్ర పోలీసు దళాల నియామకంలో రిటైర్డ్ ‘అగ్నివీర్స్ ’కు ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా పరివర్తనాత్మక అగ్నిపథ్ పథకం సాయుధ దళాల కార్యాచరణ ప్రభావాన్ని తగ్గిస్తుందని కాంగ్రెస్ హెచ్చరించింది. సైనికుల భవిష్యత్తుపై ఆందోళ‌న వ్య‌క్తం చేసింది.