Army aspirants stage protests: ప్రభుత్వ అగ్నిపథ్ పథకంపై బీహార్, రాజస్థాన్‌లలో నిరసనలు చెలరేగాయి. ఉద్యోగార్ధులు పెన్షన్, ఉద్యోగ భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో చాలా ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Agnipath-Bihar-Rajasthan -protests: నాలుగు సంవత్సరాల కాంట్రాక్ట్ ప్రాతిపదికన సైన్యంలోకి సైనికులను నియమించుకునే అగ్నిపథ్ పథకాన్ని కేంద్రం ప్రకటించిన రెండు రోజుల తరువాత.. ఆర్మీ ఉద్యోగార్ధులు ఉద్యోగ భద్రత, పెన్షన్ సంబంధిత అంశాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీహార్, రాజస్థాన్‌లలో పెద్ద సంఖ్యలో ఆర్మీ అభ్యర్థులు నిరసనలకు దిగారు. వేలాది మంది రోడ్లపైకి చేరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తారు. బీహార్, రాజస్థాన్ లలో రోడ్లను దిగ్భందించి నిరసన తెలుపుతున్నారు. బీహార్ లోని చాప్రాలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. వందలాది మంది రోడ్లపైకి చేరి రాకపోకలను అడ్డుకున్నారు. అంతటితో ఆగకుండా వాహనాలను ధ్వంసం చేశారు. రైళ్లను సైతం అడ్డుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదులు చేస్తున్నారు. నాలుగు ఏండ్లు ఉద్యోగం చేసిన తర్వాత తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. 4 ఏండ్ల ఉద్యోగం ముగిసిన తర్వాత రోడ్లపై పడతామనీ, పింఛన్ కూడా రాదని పేర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితులు ఉన్న నేపథ్యం కలిగిన ఈ అగ్నిపథ్ స్కీమ్ ఎందుకని ప్రశ్నిస్తున్నారు.
ఈ పథకం ద్వారా రిక్రూట్ అయిన సైనికుల్లో కేవలం 25 శాతం మంది మాత్రమే పూర్తి కాల వ్యవధిలో సేవలందించగలరని డిఫెన్స్ ఉద్యోగార్ధులు నాలుగేళ్లు పూర్తయిన తర్వాత తమ తదుపరి దశ గురించి ఆందోళన వ్యక్తం చేశారు. అగ్నిపథ్ పథకం ద్వారా రిక్రూట్ చేయబడిన.. అనంతరం ఆర్మీలో చోటు సంపాదించలేకపోయిన యువతకు పెన్షన్ ప్రయోజనాలు లేకుండానే ఉంటాయి. రెండేళ్ల తర్వాత ఆర్మీలో రిక్రూట్‌మెంట్ ప్రారంభమైందని, ఆ తర్వాత కూడా తమ భవిష్యత్తుపై ఎలాంటి స్పష్టత లేదని వారు చెప్పారు. తమను నిలబెట్టుకోకుంటే నాలుగేళ్ల తర్వాత తమ భవిష్యత్తు ఏమవుతుందని, ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు బబీహార్‌లోని అరా రైల్వే స్టేషన్‌లో ఆందోళన చేస్తున్న విద్యార్థులు కేంద్రానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు కొనసాగించడంతో రెండవ రోజు కూడా నిరసనలు కొనసాగాయి.
"సాయుధ దళాలలో చేరడానికి మేము చాలా కష్టపడుతున్నాము. నాలుగు సంవత్సరాల పాటు సర్వీస్, నెలల శిక్షణ మరియు సెలవులతో ఎలా ఉంటుంది? కేవలం మూడు సంవత్సరాలు శిక్షణ పొందిన తర్వాత మేము దేశాన్ని ఎలా రక్షించుకుంటాము? ప్రభుత్వం ఈ పథకాన్ని వెనక్కి తీసుకోవాలి"అని ఒక నిరసనకారుడు చెప్పాడు. బీహార్‌లో మరో నిరసనకారుడు "నాలుగు సంవత్సరాలు మాత్రమే పని చేసి ఎక్కడికి వెళ్తాము? నాలుగు సంవత్సరాల సేవ తర్వాత మేము నిరాశ్రయులమవుతాము. కాబట్టి మేము రోడ్లపైకి వచ్చి నిరసనకు దిగాము. దేశ నాయకులకు ఇప్పుడు ప్రజలు అవగాహన కలిగి ఉన్నారని తెలుసుకుంటారు" అని పేర్కొన్నాడు.
బక్సర్ జిల్లాలో 100 మందికి పైగా యువకులు రైల్వే స్టేషన్‌పై దాడి చేసి, పట్టాలపై నిరసనకు దిగారు. దీంతో పాట్నాకు వెళ్లే జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ను దాదాపు 30 నిమిషాల పాటు నిలిచిపోయింది. RPF ఇన్‌స్పెక్టర్ దీపక్ కుమార్ మరియు GRP SHO రామశిష్ ప్రసాద్ నేతృత్వంలోని భద్రతా సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని రైలు రాకపోకలకు అంతరాయం కలగకుండా వారిని హెచ్చరించే వరకు వారు పథకానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్టేషన్ గుండా వెళుతున్న పాటలీపుత్ర ఎక్స్‌ప్రెస్‌పై నిరసనకారులు రాళ్లు రువ్వారని ప్రాంతీయ మీడియాలోని ఒక విభాగంలో నివేదికలు పేర్కొన్నాయి.
అలాగే, ముజఫర్‌పూర్ పట్టణంలో పెద్ద సంఖ్యలో ఆర్మీ ఆశావహులు చక్కర్ మైదాన్ చుట్టూ రోడ్లపై టైర్లను కాల్చుతూ నిరసనకు దిగారు. అక్కడ వారు జవాన్ల రిక్రూట్‌మెంట్ కోసం తప్పనిసరి ఫిజికల్ టెస్ట్‌ల కోసం పెద్ద సంఖ్యలో వచ్చారు. జైపూర్‌లో, నాలుగు సంవత్సరాల పాటు సాయుధ దళాల్లోకి యువకులను చేర్చుకునే కేంద్రం "అగ్నిపథ్" పథకానికి వ్యతిరేకంగా బుధవారం సుమారు 150 మంది ప్రజలు అజ్మీర్-ఢిల్లీ రహదారిని దిగ్బంధించినట్లు పోలీసులు తెలిపారు. కర్ధాని స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) బన్వారీ మీనా ప్రకారం, దాదాపు 150 మంది నిరసనకారులు హైవేని దిగ్బంధించారు. సాయుధ దళాలలో రిక్రూట్‌మెంట్ మునుపటి పద్ధతిని అనుసరించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆందోళనకారులను చెదరగొట్టి హైవేను క్లియర్ చేశామని, 10 మందిని అరెస్టు చేసినట్లు ఎస్‌హెచ్ వో తెలిపారు.
