గంటల తరబడి నిరీక్షించినా బస్సు ఆగడం లేదని విసుగెత్తిపోయిన ఓ మహిళ ఆగ్రహానికి గురైంది. ఓ బస్సుపై రాయితో దాడి చేసింది. దీంతో ఆ బస్సు కిటికీ పగిలిపోయింది. డ్రైవర్ ఆమెను బస్సులో ఎక్కించుకొని నేరుగా పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లాడు. తరువాత ఏం జరిగిందంటే ? 

ఓ మహిళ గంటల తరబడి బస్టాప్ లో నిలబడింది. బస్సుల కోసం ఎదురుచూసింది. కానీ ఒక్క బస్సు కూడా ఆ బస్టాప్ లో ఆగలేదు. దీంతో ఆమెకు విసుగు వచ్చింది. అదే సమయంలో ఓ బస్సు ఆ బస్టాప్ గుండా వెళ్లబోయింది. దీంతో అది కూడా అక్కడ ఆగదేమో అని కోపంతో రాయి తీసుకొని దాడి చేసింది. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.

16 ఏళ్ల బాలికకు లైంగిక సంపర్కంపై నిర్ణయం తీసుకునే సామర్థ్యం ఉంటుంది - మేఘాలయ హైకోర్టు

వివరాలు ఇలా ఉన్నాయి. లక్ష్మి అనే మహిళ కొప్పల్ జిల్లాలోని హులిగికి వెళ్లి హులిగెమ్మ ఆలయాన్ని దర్శించుకున్నారు. అక్కడి దేవాలయంలో పూజలు చేసి తిరిగి బస్టాప్ కు చేరుకుంది. అయితే ఆమె గంటల తరబడి ఎదురుచూసిన అక్కడ ఏ బస్సు కూడా ఆగలేదు. దీంతో ఆమెకు కోపం వచ్చింది. అదే సమయంలో ఆ బస్టాప్ గుండా కొప్పల్-హోసపేటే నాన్ స్టాప్ బస్సు వెళ్తోంది. 

భార్య చెల్లెలితో వివాహేతర సంబంధం.. మరదలి ఇంటికి వెళ్లేముందు చికెన్ వండిన భర్త.. వచ్చిన తరువాత తిని.. షాక్..

ఆ బస్సు కూడా అక్కడ ఆగకపోవడంతో ఓ రాయి తీసుకొని విసిరింది. దీంతో ఆ బస్సు కిటికీ ధ్వంసం అయ్యింది. దీంతో డ్రైవర్ బస్సును ఆపాడు. అనంతరం లక్ష్మిని ఎక్కించుకున్నాడు. నేరుగా బస్సును మునిర్ బాద్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లాడు. ఆ మహిళ బస్సుపై దాడి చేసిన సంగతి అక్కడి పోలీసులకు వివరించారు. దీంతో ఆమె క్షమాపణలు చెప్పింది. అనంతరం ఆమెకు పోలీసులు రూ.5 వేల జరిమానా విధించారు. దీంతో లక్ష్మి ఆ జరిమానా చెల్లించారు. అనంతరం అదే బస్సులో ఆమె తన స్వగ్రామం ఇల్కల్ కు వెళ్లింది.

ఒడిశాలో రెండు బస్సులు ఢీ.. 12 మంది దుర్మరణం.. సీఎం నవీన్ పట్నాయక్ దిగ్భ్రాంతి

ఈ ఘటనపై ఆ బస్సు డ్రైవర్ కమ్ కండక్టర్ ముత్తప్ప మాట్లాడుతూ.. లక్ష్మితో పాటు మరో మహిళ, ఇద్దరు పిల్లలు బస్సు స్టాప్ కు ఎదురుగా, రాంగ్ సైడ్ లో నిలబడ్డారని తెలిపారు. ‘‘మా బస్సు హోసపేట వైపు వెళ్తోంది. కానీ వారు ఇల్కల్ వెళ్లాల్సి ఉంది. వారు రోడ్డుకు రాంగ్ సైడ్ లో నిలబడ్డారు. కానీ వారు వాస్తవానికి ఎదురుగా ఉన్న బస్టాప్ వద్ద వేచి ఉండాల్సింది. మా బస్సు నాన్ స్టాప్ సర్వీసు కాబట్టి దారి పొడవునా స్టాప్ లు లేవు. ఈ సమయంలోనే ఆమె బస్సుపై రాయి విసిరింది’’ అని ముత్తప్ప తెలిపారు.