భార్య చెల్లెలితో భర్త వివాహేతర సంబంధం కొనసాగించాడు. కొంత కాలం తరువాత ఈ విషయం భార్యకు తెలిసింది. దీంతో వారి మధ్య గొడవలు జరిగాయి. ఈ క్రమంలో ఒక రోజు చికెన్ లో మత్తు మందు కలిపి, భార్య తిన్న తరువాత ఆమెను హతమార్చాడు. ఈ ఘటన యూపీలో జరిగింది. 

వారిద్దరికీ పెళ్లి జరిగి కొన్ని సంవత్సరాలు అవుతోంది. ఐదుగురు పిల్లలు. చక్కగా సాగిపోతున్న కాపురం. అనోన్యంగా కుటుంబం అంతా కలిసి జీవిస్తోంది. ఆనందంగా గడిచిపోతున్న జీవితంలో వివాహేతర సంబంధం చిచ్చు పెట్టింది. భార్యకు తెలియకుండా ఆమె చెల్లెలితోనే భర్త ప్రేమాయణం సాగించాడు. కొంత కాలం తరువాత ఈ విషయం భార్యకు తెలిసింది. దీంతో వారిమధ్య గొడవలు జరిగాయి. ఈ క్రమంలో ఒక రోజు కుటుంబ సభ్యుల కోసం భర్త చికెన్ కర్రీ చేశాడు. కొంత సమయం తరువాత చుట్టుపక్కల ప్రజలు వచ్చి చూసి..షాక్ కు గురయ్యారు. అసలేం జరిగిందంటే ? 

నాలుక సర్జరీ కోసం వెళ్తే సున్నతి చేసిన డాక్టర్లు.. హిందూ సంఘాల ఆగ్రహం.. యూపీ ఎం ఖాన్ హాస్పిటల్ లో ఘటన

యూపీ రాష్ట్రం ఝాన్సీ జిల్లాలో నివసిస్తున్న సంజీవ్ కు కొన్నేళ్ల కిందట రేఖా తో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఐదుగురు పిల్లల జన్మించారు. ఇలా వీరి సంసారం చక్కగా సాగిపోతోంది. ఈ క్రమంలో భార్య చెల్లెలిపై భర్త మనసు పారేసుకున్నాడు. ఈ విషయం మరదలికి చెప్పడంతో ఆమె కూడా అతడి ప్రేమకు అంగీకరించింది. దీంతో వీరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. కానీ ఈ విషయం భార్యకు తెలియకుండా భర్త.. అక్కకు తెలియకుండా చెల్లెలు జాగ్రత్త పడ్డారు. 

కానీ ఇలాంటి విషయాలు ఎంతో కాలం బయటకు రాకుండా ఉండవు కదా.. ఇక్కడా అలాగే జరిగింది. సంజీవ్, అతడి మరదలు సన్నిహితంగా ఉంటున్నారని పలువురు రేఖకు తెలిపారు. దీంతో ఆమె భర్తను నిలదీసింది. ఇక అప్పటి నుంచి వారి మధ్య గొడవలు మొదలయ్యాయి. కొంత కాలం నుంచి అవి మరింతగా పెరిగాయి. 

ఒడిశాలో రెండు బస్సులు ఢీ.. 12 మంది దుర్మరణం.. సీఎం నవీన్ పట్నాయక్ దిగ్భ్రాంతి

ఇదే క్రమంలో సంజీవ్ తన ఇంట్లో చికెన్ కర్రీ చేశాడు. తరువాత ఎప్పటిలాగే భార్య చెల్లెలి దగ్గరికి బయలుదేరాడు. అయితే ఈ సారి భర్తకు తెలియకుండా అతడి వెంటే రేఖ కూడా వెళ్లింది. భర్త మరదలితో కలిసి ఉన్న సమయంలో ఒక్క సారిగా ఆమె అక్కడికి చేరుకుంది. వారిద్దరినీ అక్కడే నిలదీసింది. అక్కడే వారితో గొడవ పడింది.

62 ఏళ్లలో తొలిసారిగా ఢిల్లీ, ముంబైలకు ఒకే రోజు చేరుకున్న రుతుపవనాలు.. రెండు నగరాల్లోనూ కురుస్తున్న వానలు..

అనంతరం భార్యాభర్తలు ఇంటికి తిరిగి వచ్చారు. ఇంట్లో కూడా వారి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో భార్యపై కోపం పెంచుకున్న సంజీవ్.. అంతకు ముందే తాను వండిన చికెన్ లో మత్తు మందు కలిపాడు. ఈ విషయం తెలియకుండా భార్య ఆ కర్రీ తినడంతో మత్తుగా నిద్రపోయింది. కొంత సమయం తరువాత ఆమెపై అతడు కత్తితో దాడి చేశాడు. రేఖ నొప్పితో కేకలు వేయడంతో అతడు అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలి అరుపులు వినిపించడంతో స్థానికులు పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చారు. ఆమె తీవ్రగాయాలతో ఉండటాన్ని చూసి షాక్ కు గురయ్యారు. అనంతరం రేఖను హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న సమయంలోనే పరిస్థితి విషమించడంతో మరణించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.