గ్యాంగ్‌స్టర్, మాజీ ఎంపీ అతిఖ్ అహ్మద్ అతని సోదరుడు అష్రఫ్ హత్యలతో దేశం ఉలిక్కిపడింది. మీడియా ప్రతినిధుల ముసుగులో వచ్చిన ముగ్గురు నిందితులు అతిఖ్ సోదరులను పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్చిచంపారు.
గ్యాంగ్‌స్టర్, మాజీ ఎంపీ అతిఖ్ అహ్మద్ అతని సోదరుడు అష్రఫ్ హత్యలతో దేశం ఉలిక్కిపడింది. పోలీస్ కస్టడీలో, చుట్టూ మీడియా ప్రతినిధులు, భారీ భద్రత వుండగానే దుండగులు అతిఖ్ సోదరులను హత్య చేయడం కలకలం రేపుతోంది. దీనిపై యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతిఖ్ సోదరుల హత్యల వెనుక ప్రభుత్వం వుందంటూ విపక్షాలు, పౌర హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇదిలావుండగా.. దుండగులు మీడియా ప్రతినిధుల ముసుగులో వచ్చి హత్య చేయడంపై కేంద్రం అప్రమత్తమైంది. జర్నలిస్టులు, ప్రముఖుల భద్రతపై ప్రత్యేక పాలసీని సిద్ధం చేయాలని కేంద్రం నిర్ణయించింది. జర్నలిస్టుల భద్రత కోసం ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్గదర్శకత్వంలో హోంమంత్రిత్వ శాఖ ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను సిద్ధం చేయనుంది.
ఇదిలావుండగా.. గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్, అష్రఫ్ అహ్మద్‌ల హత్య దేశవ్యాప్తంగా కలకలం రేపింది. పోలీసుల కస్టడీలో ఉండగానే మీడియాకు లైవ్‌లో సమాధానాలు ఇస్తున్న సమయంలో ముగ్గురు నిందితులు వారిద్దరిపై కాల్పులు జరిపారు. ఆ ఇద్దరు స్పాట్‌లోనే మరణించారు. ఈ ఘటన జరిగిన వెంటనే యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. ఈ ఘటనపై దర్యాప్తునకు కమిటీ వేయాలని అధికారులకు సూచించారు. అలాగే, ముగ్గురు సభ్యులతో జ్యుడీషియల్ కమిషన్ కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
Also Read: "యూపీలో తుపాకీ పాలన" .. కాల్పులపై 'సుప్రీం' దర్యాప్తు జరపాలి : AIMIM చీఫ్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
ప్రయాగ్‌రాజ్‌లో అతీక్ అహ్మద్, అష్రఫ్ అహ్మద్‌ల హత్య జరగ్గానే ముఖ్యంగా యూపీ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేగింది. దీంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. పోలీసులంతా అలర్ట్ మోడ్‌లో ఉన్నారు. అన్ని జిల్లాల్లో పోలీసులు నిఘా పెంచారు. సున్నితమైన ఏరియాల్లో పెట్రోలింగ్‌లను పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ప్రయాగ్‌రాజ్‌లో అల్లర్లను ఎదుర్కొనే పోలీసులూ మోహరించారు. అతీక్ సోదరుల హత్య తర్వాత సీఎం యోగి ఆదిత్యానాథ్ నివాసానికి భద్రతను పెంచారు . ఈ హత్య జరిగిన తర్వాత కనీసం 17 మంది పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు
