Asianet News TeluguAsianet News Telugu

సిసోడియాపై సీబీఐ దాడి అనంత‌రం గుజరాత్ లో ఆప్ కు ఓట్ షేర్ 4 శాతం పెరిగింది - కేజ్రీవాల్

మనీష్ సిసోడియాపై సీబీఐ దాడులు నిర్వహించిన తరువాత ఆమ్ ఆద్మీ పార్టీకి గుజరాత్ లో ఓటింగ్ పెరిగిందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. 

After CBI raid on Sisodia, vote share of AAP increased by 4 percent in Gujarat - Kejriwal
Author
First Published Sep 1, 2022, 4:04 PM IST

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై సీబీఐ దాడి జ‌రిగిన త‌రువాత గుజరాత్‌లో తమ పార్టీ ఓట్లు 4 శాతం పెరిగాయ‌ని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ అన్నారు. సీబీఐ చ‌ర్య‌ల నేప‌థ్యంలో ఆయ‌న బీజేపీపై విరుచుకుప‌డ్డారు. ‘‘ సిసోడియాపై దాడి జరిగినప్పటి నుంచి గుజరాత్‌లో ఆప్ ఓట్ షేర్ నాలుగు శాతం పెరిగింది. ఆయనను అరెస్టు చేసే నాటికి అది ఆరు శాతానికి పెరుగుతుంది. త్వరలో జరగబోయే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుంది ’’ అని ఆయన అన్నారు. 

ప్ర‌ముఖ‌ రచయిత్రి అరుంధతీ రాయ్ ఇంట విషాదం..

సిసోడియా నివాసంపై సీబీఐ దాడి చేసిందని, అతడి గ్రామానికి వెళ్లి బ్యాంక్ లాకర్‌లో సోదాలు చేసింద‌ని, కానీ అందులో ఏమీ దొర‌క‌లేద‌ని కేజ్రీవాల్ వెల్ల‌డించారు. “ మనీష్ సిసోడియాపై నకిలీ కేసు పెట్టారు. ఆయ‌న దర్యాప్తును స్వాగతించాడు. కానీ పరువు నష్టం కేసుతో బెదిరించలేదు ” అని ఢిల్లీ సీఎం అన్నారు.  త‌న డిప్యూటీ సీఎంను అరెస్టు చేయాల‌ని సీబీఐపై ఒత్తిడి ఉంద‌ని తెలిపారు.

ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బీజేపీ రూ.20 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు ఖర్చు చేస్తోందని, కానీ తాను పాఠశాలలు, ఆసుపత్రులు నిర్మించాలని కోరితే తప్పేముంది అని కేజ్రీవాల్‌ ప్రశ్నించారు.‘‘ నా పిల్లలిద్దరూ ఐఐటీలో చదివారు. భారతదేశంలోని ప్రతీ బిడ్డకు ఒకే విధమైన విద్యను అందించాలని నేను కోరుకుంటున్నాను ” అని ఆయన అన్నారు.

ఆప్ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు బీజేపీ డబ్బు ఆఫర్ చేసిందని కేజ్రీవాల్, ఆప్ నేత‌ల ఆరోప‌ణ‌ల‌ను బీజేపీ ఖండించింది. వీటిని ద్వేషపూరితమైన, తప్పుదోవ పట్టించేది వ్యాఖ్య‌లు అంటూ అభివర్ణించింది. ఢిల్లీ ప్రభుత్వ మద్యం కుంభకోణం నుండి ప్ర‌జ‌ల దృష్టిని మళ్లించే ప్రయత్నం ఇది అని పేర్కొంది. 

కొచ్చి మెట్రో ప్రాజెక్టు విస్తరణ .. రేపే ప్ర‌ధాని మోదీ శంకుస్థాప‌న‌

ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీ 2021-22లో అవకతవకలకు సంబంధించి సిసోడియా నివాసంతో పాటు 31 చోట్ల గత నెలలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దాడులు నిర్వహించింది. ఎక్సైజ్ పాలసీ అమలులో అవకతవకలకు సంబంధించి సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న 15 మంది వ్యక్తులు, సంస్థల జాబితాలో సిసోడియా పేరు కూడా ఉంది.

అది స‌ర్వే కాదు, మినీ ఎన్ఆర్సీ.. యూపీ మ‌ద‌ర్సాల స‌ర్వేపై అస‌దుద్దీన్ ఒవైసీ మండిపాటు

ఇదిలా ఉండగా.. దేశ రాజధానిలో బీజేపీ చేపట్టిన ‘ఆపరేషన్ కమలం’ విఫలమైందని రుజువు చేసేందుకు కేజ్రీవాల్‌ ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానాన్ని ఢిల్లీ అసెంబ్లీ మూజువాణి ఓటుతో ఆమోదించింది. విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఎవరూ ఓటు వేయలేదు. అయితే ఈ స‌మ‌యంలో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు విజేందర్ గుప్తా, అభయ్ వర్మ, మోహన్ సింగ్ బిష్త్ లకు, డిప్యూటీ స్పీకర్ రాఖీ బిర్లాతో తీవ్ర వాగ్వాదం చెల‌రేగింది. దీంతో వారిని స‌భ నుంచి బ‌హిష్క‌రించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios