Asianet News TeluguAsianet News Telugu

అది స‌ర్వే కాదు, మినీ ఎన్ఆర్సీ.. యూపీ మ‌ద‌ర్సాల స‌ర్వేపై అస‌దుద్దీన్ ఒవైసీ మండిపాటు

మదర్సాల సర్వే నిర్వహించాలని యూపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తప్పుపట్టారు. అది సర్వే కాదని, మినీ ఎన్ఆర్సీ అని ఆరోపించారు. 

Its not a survey, it's a mini NRC.. Asaduddin Owaisi lashed out at the survey of UP madrasas
Author
First Published Sep 1, 2022, 2:46 PM IST

రాష్ట్రంలో గుర్తింపు లేని మదర్సాలపై సర్వే నిర్వహించాలన్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయంపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిప‌డ్డారు. ముస్లింలను వేధించాలని బీజేపీ భావిస్తోందని ఆయ‌న ఆరోపించారు. ఆర్టికల్ 30 ప్రకారం మదర్సాలు ఉన్నాయని, అలాంటప్పుడు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సర్వేకు ఎందుకు ఆదేశించిందని ప్రశ్నించారు.

దేశ అవినీతి రాజధానిగా కర్ణాటక.. దృష్టి మరల్చేందుకే హిజాబ్, ఈద్గా : బీజేపీపై డీకే శివకుమార్ విమర్శలు

‘‘ఇది సర్వే కాదు.. మినీ ఎన్ఆర్సీ. కొన్ని మదర్సాలు ఉత్తరప్రదేశ్ మదర్సా బోర్డు పరిధిలో ఉన్నాయి. ఆర్టికల్ 30 కింద మా హక్కులలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోజాలదు. వారు (బీజేపీ) ముస్లింలను వేధించాలనుకుంటున్నారు ’’ అని ఒవైసీ అన్నారు.

ఉపాధ్యాయులు, విద్యార్థుల సంఖ్య, పాఠ్యాంశాలు, ఏదైనా ప్రభుత్వేతర సంస్థతో దాని అనుబంధం వంటి సమాచారాన్ని నిర్ధారించడానికి రాష్ట్రంలోని గుర్తింపు లేని మదర్సాలపై సర్వే నిర్వహించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. మదర్సాలలో విద్యార్థులకు ప్రాథమిక సౌకర్యాల లభ్యతకు సంబంధించి జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆవశ్యకత మేరకు ఈ సర్వే నిర్వహించనున్నట్లు మైనారిటీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డానిష్ ఆజాద్ అన్సారీ తెలిపారు.

మైనర్ బాలికపై 90 ఏళ్ల వృద్ధుడి లైంగిక దాడి.. మూడేండ్ల జైలు శిక్ష

మదర్సా పేరు, దానిని నడుపుతున్న సంస్థ పేరు, అది ప్రైవేట్ లేదా అద్దె భవనంలో నడుస్తోందా, తాగునీరు, ఫర్నిచర్, విద్యుత్ సరఫరా, మరుగుదొడ్డి వంటి ప్రాథమిక సౌకర్యాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడానికి ఈ సర్వే సహాయపడుతుందని మంత్రి పేర్కొన్నారు. మదర్సాలో ఉపాధ్యాయులు, విద్యార్థుల సంఖ్య, దాని పాఠ్యప్రణాళిక, ఆదాయ వనరులు, ఏదైనా ప్రభుత్వేతర సంస్థతో దాని అనుబంధానికి సంబంధించిన సమాచారాన్ని కూడా సేకరిస్తామని ఆయన చెప్పారు.

ఆరేళ్లుగా ప్రియుడితో డేటింగ్.. కొంత కాలం త‌రువాత అత‌డు సోద‌రుడు అవుతాడ‌ని తెలియ‌డంతో..

కాగా.. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లో మొత్తం 16,461 మదర్సాలు ఉన్నాయి. రాష్ట్రంలోని మొత్తం మదర్సాలలో 560 మందికి ప్రభుత్వ గ్రాంట్లు ఇవ్వగా, కొత్త మదర్సాలను గత ఆరేళ్లుగా గ్రాంట్ జాబితాలో చేర్చలేదు.
 

Follow Us:
Download App:
  • android
  • ios