Asianet News TeluguAsianet News Telugu

 కాలేజీ ఈవెంట్‭లో కలకలం.. బుర్ఖా వేసుకుని డాన్స్ చేసిన అబ్బాయిలు.. యాజమాన్యం ఏం చేసిందంటే..?

కర్ణాటకలోని మంగళూరులోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలోకి చెందిన నలుగురు విద్యార్థులు ఓ కార్యక్రమంలో బాలీవుడ్ పాటలపై బురఖాలు ధరించి డ్యాన్స్ చేశారు. దీనితో వివాదం తలెత్తింది. దీని ద్వారా బురఖా, హిజాబ్‌లను ఎగతాళి చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఆ కళాశాల యాజమాన్యం నలుగురు విద్యార్థులను కళాశాల నుంచి సస్పెండ్ చేసింది. ఈ ఘటన ఎందుకు జరిగిందనే కోణంలో కాలేజీ యాజమాన్యం కూడా విచారణ జరుపుతోంది.

4 students suspended after dance in burqa at Mangaluru college event
Author
First Published Dec 9, 2022, 3:14 PM IST

కర్ణాటకలో మొదలైన హిజాబ్ వివాదం ఏవిధంగా దేశవ్యాప్తంగా దూమారం రేపిందో అందరికీ తెలుసు. ఈ వివాదం ఇంకా ముగియలేదు.. తరుచుగా ఆ వివాదాన్ని రెచ్చగొట్టే ఘటనలు జరుగుతునే ఉంటాయి. ఏదోవిధంగా తెర మీదికి వస్తూనే ఉంది. తాజాగా.. ఒక ఇంజనీరింగ్ కాలేజీ కల్చరల్ ప్రోగ్రామ్ లో కొంతమంది అబ్బాయిలు బురఖాల, హిజాబ్ ధరించి.. డాన్స్ చేయడంతో  మరోసారి ఈ వివాదాన్ని తెరమీదికి వచ్చింది. ఈ ఘటన కర్ణాటకలోని మంగళూరులోని సెయింట్ జోసెఫ్ ఇంజినీరింగ్ కళాశాల చోటుచేసుకుంది. 

వీడియో వైరల్ కావడంతో దుమారం

వివరాల్లోకెళ్లే..  మంగళూరులోని సెయింట్ జోసెఫ్ ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన  కల్చరల్ ప్రోగ్రామ్ లో కొంతమంది విద్యార్థులు సడెన్ గా బురఖాల, హిజాబ్ ధరించి స్టేజీ మీదికి వచ్చారు. ఈ క్రమంలో 'తేరీ ఫోటో కో దేఖ్నే సే యార్...' అనే బాలీవుడ్ పాటపై స్టేప్పులేశారు. ఈ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా విమర్శించారు. కమ్యూనిటీ మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా డ్యాన్స్‌ను అనుమతించారని పలువురు కళాశాల యాజమాన్యాన్ని విమర్శించారు.  

చాలా మంది నెటిజన్లు డ్యాన్స్ అనవసరం అని అన్నారు. కానీ ప్రోగ్రామ్‌ల జాబితాలో బాలీవుడ్ పాటలను చేర్చలేదని కళాశాల అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వెల్లువెత్తడంతో ఆ విద్యార్థులను సస్పెండ్ చేసినట్టు కళాశాల యాజమాన్యం ప్రకటించింది. విద్యార్థి సంఘం అనధికారిక కార్యక్రమంలో ఆ విద్యార్థులు బురఖాలు ధరించి డ్యాన్స్ చేసినట్టు ,వారిపై కఠినమైన మార్గదర్శకాలను ఉల్లంఘించారని కళాశాల యాజమాన్యం వివరణ ఇచ్చింది.  

ఈ ఘటనపై కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో క్లిప్‌లో ముస్లిం సమాజానికి చెందిన విద్యార్థులు కించపరిచేలా చేసిన నృత్యంలో కొంత భాగాన్ని చిత్రీకరించారు. ఆ విద్యార్థులను సస్పెండ్ చేసినట్టు కళాశాల ప్రిన్సిపాల్ వెల్లడించారు. అది అనకాధిక కార్యక్రమం. కమ్యూనిటీల మధ్య సామరస్యాన్ని దెబ్బతీసే కార్యకలాపాలకు కళాశాల ఎట్టిపరిస్థితిలో మద్దతు ఇవ్వదని పేర్కొన్నారు.  అయితే, డ్యాన్స్ విద్యార్థులు ముస్లిం వర్గానికి చెందినవారని కళాశాల పేర్కొంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని కాలేజీ యాజమాన్యం ట్వీట్ ద్వారా తెలియజేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios