Asianet News TeluguAsianet News Telugu

కాంతారా సినిమా చూసేందుకు వచ్చిన ముస్లిం దంపతులపై యువకుల దాడి.. ఎక్కడంటే ?

కాంతారా సినిమా చూసేందుకు వచ్చిన ఓ ముస్లిం జంటపై యువకులు దాడి చేశారు. సినిమా చూడకుండా అడ్డుకున్నారు. ఇది కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసు కేసు నమోదైంది. 

Youth attack on Muslim couple who came to watch Kantara movie.. Where?
Author
First Published Dec 9, 2022, 3:56 PM IST

సెప్టెంబర్ నెలలో విడుదలైన ‘కాంతారా’ సినిమా చూసేందుకు థియేటర్ కు వెళ్లేందుకు ఆ ముస్లిం జంటకు చేదు అనుభవం ఎదురైంది. థియేటర్ వద్దనే కొంత మంది యువకులు వారిని అడ్డగించి దాడి చేశారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది.

గోవా జైలు నుంచి తప్పించుకుని 15 ఏళ్ల తర్వాత హోటల్‌లో చిక్కాడు.. అక్కడ ఏం చేస్తున్నాడంటే?

వివరాలు ఇలా ఉన్నాయి. దక్షిణ కన్నడ జిల్లా సుల్లియా పట్టణం పుత్తూరులోని సంతోష్ సినిమా థియోటర్ లోకి గురువారం ఓ ముస్లిం జంట కాంతారా సినిమా చూసేందుకు వచ్చింది. అయితే ఈ సినిమాను చూడవద్దని ఆ జంటను యువకులు అడ్డుకున్నారు. దీనిపై భర్త అభ్యంతరం వ్యక్తం చేశాడు. తాము సినిమా చూస్తామని చెప్పారు.

కాలేజీ ఈవెంట్‭లో కలకలం.. బుర్ఖా వేసుకుని డాన్స్ చేసిన అబ్బాయిలు.. యాజమాన్యం ఏం చేసిందంటే..?

దీంతో ఆగ్రహంతో ఆ యువకులు అతడిపై దాడి చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో బయటకు వచ్చింది. ఆ గుంపులోని ఓ యువకుడు బాధిత మహిళతో కూడా గొడవపడ్డాడు. ఈ ఘటనపై సంతోష్ సినిమా థియేటర్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ముస్లిం దంపతులపై దాడికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియరాలేదు.

కేరళ యూనివర్సిటీ ల్లో గవర్నర్ అధికారాలకు కత్తెర వేసేందుకు అడుగులు.. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం

బాధితుడిని బంట్వాల్ తాలూకాలోని బి ముడా గ్రామానికి చెందిన మహమ్మద్ ఇంతియాజ్‌గా గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా హిట్ టాక్ తెచ్చుకున్న కాంతారావు గతంలో కన్నడ, తమిళం, తెలుగు, మలయాళంలో విడుదలైంది. అయితే ఈ సినిమా ఇటీవల ఓటీటీ ఫ్లాట్ ఫారమ్ అయిన అమెజాన్ ప్రైమ్ కూడా రిలీజ్ అయ్యింది. తాజాగా నేడు ఈ సినిమా హిందీ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్‌లో కూడా విడుదలయ్యింది. సెప్టెంబర్ 30వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా సినిమా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఇప్పటి వరకు రూ. 400 కోట్లకు పైగా వసూలు చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios