ముంబై: దత్తత తీసుకొన్న తండ్రిని అత్యంత దారుణంగా చంపేసింది ఓ యువతి.అంతేకాదు తండ్రి శరీర భాగాలను కోసి పడేసింది. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకొంది.

ముంబైలోని ఘట్కోవర్ ప్రాంతంలో బెన్నెట్ రెబెల్లో నివాసం ఉంటున్నాడు. ఆయన రియా అనే 19 ఏళ్ల యువతిని దత్తత తీసుకొన్నాడు. రియా ఓ మైనర్‌‌తో ప్రేమలో పడింది. ఈ విషయాన్ని గమనించిన తండ్రి మైనర్‌తో ప్రేమ వ్యవహరం మంచిది కాదని కూతురుకు హితవు పలికారు.

Also read:న్యూఢిల్లీలో అగ్ని ప్రమాదం: 43 మంది మృతి

దీంతో విసిగిపోయిన  రియా తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఈ ఏడాది నవంబర్ 27వ తేదీన తండ్రిని ఇంట్లోనే దారుణంగా చంపేసింది.కొన ఊపిరితో ఉన్న తండ్రి ముఖంపై దోమల మందు స్ప్రే చేసి చంపేసింది. అంతేకాదు తనను దత్తత తీసుకొన్న తండ్రిని శరీర భాగాలను కత్తితో కోసి రెండు సంచులు సూట్‌కేసులో నింపింది. సూట్‌కేసులో నింపిన శరీరబాగాలను మిథి నదిలో పడేసింది. 

మూడు రోజుల తర్వాత సూట్‌కేసు ఒడ్డుకు చేరింది. ఈ సూట్‌కేసులో ఉన్న మృత శరీరభాగాలు ఎవరివో అనే విషయమై పోలీసులు దర్యాప్తు చేశారు. సూట్‌కేసులో ఉన్న మృత శరీరానికి ఉన్న చెయికి ఉన్న స్వెట్టర్ ఆధారంగా  పోలీసులు కేసును దర్యాప్తును ప్రారంభించి కేసును చేధించారు. 

also read:బెజవాడలో దారుణం: స్నానం చేస్తున్న కూతురి ఫోటోలు తీసిన తల్లి, చివరికిలా..

బెన్నెట్ ఫేస్‌బేక్‌ను పోలీసులు గుర్తించారు.   బెన్నెట్ ఇంటి అడ్రస్‌ను గుర్తించి స్థానికులను పోలీసులు విచారించారు. 10 రోజులుగా బెన్నెట్ కన్పించడం లేదని స్థానికులు చెప్పారు.ఈ సమయంలోనే బెన్నెట్ దత్తత తీసుకొన్న కూతురు గురించి స్థానికులుత పోలీసులకు సమాచారమిచ్చారు. 

బెన్నెట్ దత్తత తీసుకొన్న రియా విషయాన్ని పోలీసులు గుర్తించారు. రియాను పట్టుకొని పోలీసులు బెన్నెట్ గురించి ప్రశ్నించారు. అయితే ఆమె చెప్పిన సమాధానాలు పొంతనలేకపోవడంతో పోలీసులు  రియాను తమదైన శైలిలో ప్రశ్నిస్తే అసలు విషయాన్ని  బయటపెట్టింది. 

మైనర్‌తో ప్రేమ వ్యవహారం తెలిశాక బెన్నెట్‌ తనను లైంగికంగా వేధించాడని అందుకే హత్య చేసినట్టు ఆమె పేర్కొంది.  రియా తల్లిదండ్రులు ఘట్కోపర్‌ ప్రాంతంలో నివసిస్తున్నారు. తల్లిదండ్రులు ఉండగా దత్తత ఎందుకు ఇచ్చారనే దానిపై విచారిస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు. ఈ హత్య యాధృచ్ఛికంగా జరిగిందా, పథకం ప్రకారంగా జరిగిందా అనే విషయమై విచారణలో తేలనుందని పోలీసులు చెప్పారు.