విజయవాడ: కన్న కూతురినే తనతో సన్నిహితంగా ఉండే ఇద్దరు వ్యక్తుల వద్దకు పంపేందుకు ప్రయత్నించింది తల్లి. తన కూతురిని అసభ్యకరంగా ఫోటోలు తీసి నిందితులకు పంపి ఆ ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేయించింది. బాధితురాలు చివరకు పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన విజయవాడలో చోటు చేసుకొంది.

విజయవాడలోని మొగల్రాజపురంలోని దంపతులకు 15 ఏళ్ల కూతురు ఉంది. ఈ దంపతుల మధ్య మనస్పర్థల కారణంగా విడిపోయారు. తండ్రి, కుమార్తెలు  ఒకే ఇంట్లో ఉంటున్నారు.

Also read:మధ్యప్రదేశ్‌లో దారుణం: స్కూల్‌ టీచర్‌పై గ్యాంగ్ రేప్

బాధితురాలి తాతకు ఆరోగ్యం బాగాలేదు. దీంతో ఆయనను హైద్రాబాద్‌లో చికిత్స కోసం బాధితురాలి తండ్రి తీసుకెళ్లాడు. అయితే బాధితురాలిని తనతో పాటు హైద్రాబాద్ కు తీసుకెళ్లలేదు.

తన భార్య ఇంటి వద్ద బాధితురాలిని వదిలి వెళ్లాడు. 15 రోజుల తర్వాత బాధితురాలి తండ్రి హైద్రాబాద్ నుండి తిరిగి వచ్చాడు. తనతో అత్యంత సన్నిహితంగా ఉండే రమేష్, సాగర్ లు తన కూతురితో అసభ్యంగా ప్రవర్తించేలా బాధితురాలి తల్లి ప్రోత్సహించింది.

ఒకరోజు తనతో సన్నిహితంగా ఉండే సాగర్ తో బాధితురాలిని కారులో పంపేందుకు ప్రయత్నించింది. మధ్యలో బాధితురాలి తల్లి కారు దిగింది. సాగర్ తో కారులో వెళ్లేందుకు బాధితురాలు ఒప్పుకోలేదు. ఈ సమయంలో స్థానికులు కలగజేసుకొని బాలికను ఇంటికి పంపించారు.

మరో వైపు బాధితురాలు స్నానం చేసి బట్టలు మార్చుకొనే సమయంలో తల్లే స్వయంగా ఫోటోలు తీసి నిందితులకు పంపింది.ఈ ఫోటోల ఆధారంగా బాధితురాలిని బ్లాక్ మెయిల్ చేయించింది. బాధితురాలు ఒప్పుకోకపోవడంతో తండ్రిని కూడ చంపుతామని బెదిరించారు.

ఈ లోపుగా తండ్రి హైద్రాబాద్ నుండి విజయవాడకు చేరుకొన్నారు. కూతురిని తన వెంట తీసుకెళ్లాడు. ఇంటికి వచ్చిన తర్వాత బాధితురాలు తండ్రికి అసలు విషయం చెప్పింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.