Asianet News TeluguAsianet News Telugu

న్యూఢిల్లీలో అగ్ని ప్రమాదం: 43 మంది మృతి

న్యూఢిల్లీలో ఆదివారం నాడు ఉదయం ఆనాజ్ మండిలో జరిగిన అగ్ని ప్రమాదంలో 43 మంది మృతి చెందారు. పలువురు మంటల్లో చిక్కుకొన్నారు. 

At least 32 killed in massive fire in Delhi's Anaj Mandi, 30 fire tenders rushed to spot
Author
Hyderabad, First Published Dec 8, 2019, 9:26 AM IST

న్యూఢిల్లీలో ఆదివారం నాడు ఉదయం ఆనాజ్ మండిలో జరిగిన అగ్ని ప్రమాదంలో 43 మంది మృతి చెందారు. పలువురు మంటల్లో చిక్కుకొన్నారు. 

అనాజ్ మండీలో ఆదివారం నాడు ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది.ఈ ప్రమాదంలో చిక్కుకొన్న 43 మంది మృత్యువాత పడ్డారు. మంటల్లో చిక్కుకొన్న వారిని అగ్ని మాపక సిబ్బంది రక్షించే ప్రయత్నం చేస్తున్నారు.

Delhi: Fire broke out at a house in Anaj Mandi, Rani Jhansi Road in the early morning hours today, 11 people rescued so far; 15 fire tenders present at the spot pic.twitter.com/zbsMmRn3NW

— ANI (@ANI) December 8, 2019

సుమారు 15 అగ్నిమాపక యంత్రాలు మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.క్షతగాత్రులను రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పలువురు మృతి చెందినట్టుగా వైద్యులు ప్రకటించారు.ఆదివారం నాడు ఉదయం ఐదున్నర గంటలకు ఈ భవనంలో మంటలు వ్యాపించినట్టుగా అధికారులు చెబుతున్నారు.

మంటలు వ్యాపించిన విషయాన్ని భవనంలో ఉన్న వారు ఫైరింజన్ సిబ్బందికి సమాచారం అందించారు. ఈ సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ భవనంలోని ఓ ప్లాట్ లో మంటలు వ్యాపించాయి.ఈ ఫ్లాట్‌లో చాలా చీకటిగా ఉన్నట్టుగా డిప్యూటీ ఫైర్ చీఫ్ ఆఫీసర్ సునీల్ చౌదరి చెప్పారు. ఈ భవనంలో స్కూల్ బ్యాగ్స్, బాటిల్స్ తయారు చేస్తారని ఆయన తెలిపారు. అగ్ని ప్రమాదంలో గాయపడిన 15 మందిని ఎల్ఎన్‌జేపీ ఆసుపత్రికి తరలించినట్టుగా ఆయన తెలిపారు. 

భవనంలో అగ్ని ప్రమాదం సంభవించిన సమయంలో సుమారు 20 నుండి 25 మంది కార్మికులు భవనంలోనే నిద్రిస్తున్నారని స్కూల్ బ్యాగ్స్, బాటిల్స్ తయారీ కంపెనీ యజమాని తెలిపారు. అగ్ని ప్రమాదం జరిగిన భవనంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.


 

Follow Us:
Download App:
  • android
  • ios