న్యూఢిల్లీ: విషవలయంలోకి, వ్యతిరేక వాతావరణంలోకి తన పేరును లాగవద్దని నటుడు, బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మాజీ బాయ్ ఫ్రెండ్ అధ్యయన్ సుమన్ విజ్ఞప్తి చేశారు కంగనా రనౌత్ కు డ్రగ్స్ వ్యవహారంతో సంబంధాలున్నాయనే ఆరోపణపై మహారాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధ్యయన్ సుమన్ ఆ విజ్ఞప్తి చేశారు. 

అధ్యయన్ సుమన్ 2016లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ వైరల్ అయిన నేపథ్యంలో ఆయన చెప్పిన విషయాలను ఆధారం చేసుకుని మహారాష్ట్ర ప్రభుత్వం కంగనాపై విచారణకు ఆదేశాలు జారీ చేసింది. 

Also Read: సోనియా సేనగా మారేందుకు శివసేన రెడీ: కంగనా తీవ్ర వ్యాఖ్యలు

కంగనా రనౌత్ మాదక ద్రవ్యాలు వాడిందని అధ్యయన్ సుమన్ చేసిన ఆరోపణలపై ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తారని మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ చెప్పారు. 

అధ్యయన్ సుమన్ గతంలో కంగనాతో సంబంధంలో ఉన్నారు. కంగనా డ్రగ్స్ తీసుకునేది ఆయన ఆరోపించారు. తన ఆరోపణలను ఆధారం చేసుకుని మహారాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించడంపై ఆయన తాజాగా సోషల్ మీడియాలో స్పందించారు. 

తాను 2016లో ఆ మాటలు అన్నానని, దానికి తనను, కుటుంబ సభ్యులను జాతీయ మీడియాలో హేళన చేశారని, ఆ విషయాన్ని తాను మరిచిపోయానని, జీవితంలో ముందుకు సాగుతున్నానని, దయచేసి తనను మళ్లీ ఆ అంధకారమయమైన గతంలోకి తనను తీసుకుని వెళ్లవద్దని, తాను చాలా బాధపడ్డానని ఆయన అన్నారు. 

Also Read: కంగనా తిరిగి ముంబయి నుంచి వెళ్ళిపోతుందట

కంగనా రనౌత్ తో తనకు ఏ విధమైన సంబంధాలు లేవని, అయితే తామిద్దరం సుశాంత్ రాజ్ పుత్ కు న్యాయం జరగాలని పోరాడుతున్నామని ఆయన చెప్పారు.