ఆన్ లైన్ రమ్మీకి వ్యసనమై లక్షల అప్పుల్లో కూరుకుపోయిన ఓ పోలీసు అధికారి.. తన స్నేహితుడి ఇంట్లో చొరబడి బంగారు నగలను దొంగతనం చేశాడు. దీంతో అతడిని పోలీసులు అరెస్టు చేశారు. 

రోడ్డు పక్కన ఉన్న దుకాణంలో మామిడి పండ్లను దొంగిలించినందుకు కేరళ పోలీసుపై కేసు నమోదు చేసిన కొంత సమయానికే.. ఇంట్లో బంగారు ఆభరణాలను దొంగిలించినందుకు మరో ఎస్సై అరెస్టు అయ్యాడు. తాను ఆన్‌లైన్‌ గేమింగ్‌ వల్ల రూ.30 లక్షలు అప్పు చేశానని, అందుకే డబ్బు అవసరమై దొంగతనానికి పాల్పడ్డానని నిందితుడు పోలీసు దర్యాప్తు బృందానికి చెప్పాడు.

నేడు రోజ్ గార్ మేళాను ప్రారంభించనున్న ప్రధాని మోడీ.. 10 లక్షల మందికి ఉద్యోగాలే లక్ష్యం.. పూర్తి వివరాలివిగో..

ఈ కేసులో నిందితుడు అయిన సివిల్ పోలీసు అధికారి అమల్దేవ్ కె సతీశన్ (35) ఎర్నాకులం ఏఆర్ క్యాంపునకు అటాచ్ చేశారు. ఆయన ఎర్నాకులంలోని వైపిన్‌లోని నజరకల్ ప్రాంతంలోని తన తల్లి ఇంట్లో నివసిస్తున్నాడు. విచారణ బృందం తెలిపిన వివరాల ప్రకారం.. అలప్పుజాకు చెందిన అమల్‌దేవ్ అక్టోబర్ 13న స్నేహితుడి ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేరని అర్థం చేసుకున్న ఆయన అదే ప్రాంతంలోని స్నేహితుడి ఇంట్లోకి చొరబడి బ్యాగులో ఉంచిన బంగారు ఆభరణాలను అపహరించారు.

గుజరాత్ ప్రజలకు దీపావళి కానుక.. 27వ తేదీ వరకు ట్రాఫిక్ ఉల్లంఘనలపై ఫైన్లు మినహాయింపు..

చోరీ జరిగిన విషయం అక్టోబర్ 16వ తేదీన బాధిత కుటుంబానికి తెలిసింది. ఇంట్లో నిత్యం తిరిగే బయటి వ్యక్తి అమల్‌దేవ్ మాత్రమేనని వారు అనుమానం వ్యక్తం చేశారు. తరువాత వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నజరకల్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ నేతృత్వంలో జరిగిన విచారణలో దొంగతనం చేసింది సివిల్ ఎస్ ఐ అని నిర్ధారించారు.

నిందితుడు దొంగిలించిన ఆభరణాలలో కొంత భాగాన్ని స్థానిక ఆర్థిక సంస్థలో తాకట్టు పెట్టగా మిగిలిన వాటిని విక్రయించినట్లు ‘టైమ్స్ నౌ’ కథనం పేర్కొంది. అయితే తరువాత పోలీసు బృందం వాటిని పూర్తి స్థాయిలో రికవరీ చేసింది. నిందితుడు అమల్‌దేవ్ ఆన్‌లైన్ రమ్మీకి అలవాటు పడ్డాడని, రూ.30 లక్షల అప్పు ఉందని తేలింది.

ప్రమాదంలో ప్రజాస్వామ్యం.. రాజ్యాంగ వ్యవస్థలపై కేంద్రం దాడి : మల్లికార్జున్ ఖర్గే

నిందితుడు బ్యాంకులు, ప్రైవేట్ ఆర్థిక సంస్థల నుంచి కూడా రుణాలు తీసుకున్నట్లు సమాచారం. ఆయన ఇటీవల తన స్నేహితులను సంప్రదించాడు. తనకు ఆర్థిక సాయం చేయాలని కోరాడు. అయినా ఎక్కడి నుంచి సాయం అందకపోవడంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు. కాగా నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.